తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Today Episode : మురారి-కృష్ణను చూసి తట్టుకోలేకపోతున్న ముకుంద.. ఏం చేస్తుంది?

Krishna Mukunda Murari Today Episode : మురారి-కృష్ణను చూసి తట్టుకోలేకపోతున్న ముకుంద.. ఏం చేస్తుంది?

HT Telugu Desk HT Telugu

01 June 2023, 11:08 IST

    • Krishna Mukunda Murari Today Episode : కృష్ణ ముకుందా మురారి సీరియల్ ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. మురారి ప్రేమ గురించి కృష్ణకు తెలియడంతో ఆసక్తిగా ఉంది.
కృష్ణ ముకుందా మురారి
కృష్ణ ముకుందా మురారి

కృష్ణ ముకుందా మురారి

ఎందుకు దిగులు పడ్డావని, ఏదో పొగొట్టుకున్న దానిలా ఉన్నావని కృష్మతో మురారి అంటాడు. ఏం లేదని చెబుతుంది. అయితే ఏవేవో సమాధానాలు ఇస్తుంది. నీ మాటల్లో ఏదో బరువు ఉందని మురారి చెబుతాడు. కృష్ణ మాత్రం అలాంటిదేమీ లేదని అంటుంది. మురారి ఏం అడిగినా.. కృష్ణ సమాధానం వంకరగానే ఉంటుంది. మురారి స్టేషన్ వెళ్లేందుకు రెడీ అవుతాడు. అన్ని మరిచిపోతున్నట్టుగా అంటాడు. ఆ తర్వాత కిందకు దిగుతుంటే.. మురారి వాళ్లకు ముకుంద ఎదురుపడుతుంది. కానీ ఎవరూ ఎవరినీ పట్టించుకోకుండా వెళ్తారు.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

రేవతికి బై చెప్పేసి.. వెళ్తుంటే.. ముకుంద వారివైపునకు చూస్తుంది. మరోవైపు నా కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే.. ముకుంద కుడుపు రగిలిపోతుందని అనుకుంటుంది. మురారి మాట్లాడిన మాటలు, కృష్ణ ప్రపోజ్ చేసిన విషయాల గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముకుంద ఆలోచనల్లో పడుతుంది. ఏంటి ఇది? రోజు రోజుకు చేజారిపోతున్నావ్.. కృష్ణ నీకు దగ్గర అవుతుందా? లేదా తనకు నువ్ దగ్గరవుతున్నావా? లేదంటే రాయివి అయిపోతున్నావా? పరాయి వాడివి అయిపోతున్నావా? అనుకుంటుంది ముకుంద.

సీన్ కట్ చేస్తే.. ముకుందను చూస్తుంటే.. తన ప్రేమ సంగతి అందరికీ చెప్పేలా ఉందని, ఏదో ఒక విధంగా తనకు వార్నింగ్ ఇవ్వాలని రేవతి ఆలోచిస్తుంది. నీతో జీవితం పంచుకోలేక ఇంకొకరి భర్తగా ఊహించుకోలేక నాకు పచ్చిపడతుందని ముకుంద అనుకుంటుంది. నువ్వు నాకు కావాల్సిందేనని, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నవి విసిరికొడుతుంది ముకుంద. ఇదే సమయంలో రేవతి గదిలోకి వస్తుంది. తనను చూసి ముకుంద కన్నీళ్లు తడుచుకుంటుంది. నా జీవితానికి అడ్డంగా చాలా మంది ఉన్నారని ముకుంద చెబుతుంది. నీ కష్టం, బాధ, ఒంటరితనానికి మీ నాన్న పరిష్కారం చెప్పారు కదా అని రేవతి అంటుంది. అ పరిష్కారం నాకు నచ్చలేదు, గుండె పగిలిపోతే ఏం చేయాలని కృష్ణ అంటుంది.

అది నీ దురదృష్టం అనుకోవాలని రేవతి అనగా.. అనుకోలేను నాకేం తక్కువ అని ముకుంద అంటుంది. నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం ఆదర్శ్ వాడు పారిపోవడం వల్ల ఇలా జరిగిందని రేవతి చెబుతుంది. మీకు తెలిసి ఏం చేయగలిగారని ముకుంద ప్రశ్నిస్తుంది. ఇలా ఇద్దరి మధ్య మటాలు సాగిపోతూ ఉంటాయి. నేను పోగొట్టుకున్న జీవితం నాకు కావాలని ముకుంద అంటుంది. నీ జీవితం నీకు ఇచ్చేందుకు ఇంకొకరి జీవితం నాశనం చేసే హక్కు తనకు లేదని రేవతి అంటుంది. అప్పుడే నువ్ చెప్పి ఉంటే అందరం నీకు సపోర్ట్ చేసేవాళ్లం అని చెబుతుంది. నీ నిర్ణయంలో అజ్ఞానం ఉందని స్పష్టం చేస్తుంది.

అంటే తప్పంతా నా మీదే నెడుతున్నారా అని రేవతి ప్రశ్నిస్తుంది. నువ్వు ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయిందని, అది జీవితకాలం లేటు అయిందని రేవతి అంటుంది. వాడు తాళి కట్టిన భార్య పట్ల నిజాయితీగా ఉన్నాడని చెబుతుంది. కానీ నువ్వు అలా లేవని, ఇది నీ పతనానికి తప్ప ఎందుకు పనికిరాదని రేవతి గట్టిగా అంటుంది. మీ నాన్న మాట విని మళ్లీ పెళ్లి చేసుకో లేదంటే గతాన్ని పూర్తిగా మర్చిపో ఇంతకు మించి ఏమి సాయం చేయలేనని స్పష్టం చేస్తుంది. మురారి వాళ్లు వెళ్తుంటే ఓ జంట గొడవ పడుతూ కనిపిస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.