తెలుగు న్యూస్  /  Entertainment  /  Kgf 2 Final Share Details Distributors Profit More Than Five Hundred Crores

Kgf 2 Final Collection: కేజీఎఫ్ 2 సినిమాకు వచ్చిన లాభాలు ఎంతంటే

19 September 2022, 10:09 IST

  • Kgf 2 Final Collection: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ షేర్ ఎంతంటే...

యశ్
యశ్ (twitter)

యశ్

Kgf 2 Final Collection: కన్నడ సినీ పరిశ్రమను కేజీఎఫ్ కు ముందు కేజీఎఫ్ తర్వాతగా చెప్పుకోవచ్చు. సౌత్ కు మాత్రమే పరిమితమైన కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పింది కేజీఎఫ్ సినిమా. హీరోయిజం, కమర్షియల్ సినిమాకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. యశ్ (Yash) ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్ కు అన్ని భాషల సినీ అభిమానులు ఫిదా అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్

Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తర్వాత తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది. అంతే కాకుండా ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది .ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లకు అత్యధిక లాభాలను మిగిల్చిన సినిమా కేజీఎఫ్ 2 కావడం గమనార్హం. ఈ సినిమాను దాదాపుగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు.

ఫైనల్ గా కేజీఎఫ్ 535 కోట్లకుపైగా షేర్ ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి ఐదింతల లాభాల్ని ఈ సినిమా తెచ్చిపెట్టినట్లు సమాచారం. కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించాడు. రవీనా టాండన్ కీలక పాత్ర పోషించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2కు కొనసాగింపుగా కేజీఎఫ్ 3 ని తెరకెక్కించబోతున్నట్లు యశ్, ప్రశాంత్ నీల్ ప్రకటించారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కేజీఎఫ్ 3 సాగబోతున్నట్లు సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.