తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam October 7th Episode: పూనకం తెప్పించకు తట్టుకోలేవని జ్యోత్స్నకు దీప వార్నింగ్- పెళ్లి చేయనన్న శివనారాయణ

Karthika deepam october 7th episode: పూనకం తెప్పించకు తట్టుకోలేవని జ్యోత్స్నకు దీప వార్నింగ్- పెళ్లి చేయనన్న శివనారాయణ

Gunti Soundarya HT Telugu

07 October 2024, 7:51 IST

google News
    • Karthika deepam 2 today october 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కు నీకు సంబంధం ఏంటని జ్యోత్స్న దీపను నిలదీస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో దీప కోపంగా జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. తిక్కతిక్కగా మాట్లాడితే దవడ పళ్ళు రాలగొడతానని గట్టిగా చెప్తుంది. 
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial today october 7th episode: నరసింహ శౌర్యను ఎత్తుకుపోయే టైమ్ కి కార్తీక్, దీప వస్తారు. ఇంట్లోకి రమ్మని శౌర్య అడిగితే ఇప్పుడు కాదు పని ఉందని వెళ్ళిపోతాడు. చెట్టు చాటున దాక్కున్న నరసింహ పక్కకి వెళ్ళిపోతాడు. అనుమానం వచ్చిన కార్తీక్ అటు చూస్తాడు. ఎవరూ లేనప్పుడు ఇంట్లోనే ఆడుకో బయటకఔ రావొద్దని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు.

పూనకం తెప్పించకు 

అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లావని శౌర్య అడిగితే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. మాటల్లో కార్తీక్ తన తల్లిని డ్రాప్ చేశాడని శౌర్య చెప్పేస్తుంది. జ్యోత్స్న నోటికొచ్చినట్టు మాట్లాడంతో దీపకు కోపం వస్తుంది.

మా ఊరి ముత్యాలమ్మ తల్లి నాలోకి వచ్చి నాకు పూనకం రాకముందే వదిలేయ్. పూనకం వచ్చేవరకు నన్ను రెచ్చగొడితే తట్టుకోలేవని దీప వార్నింగ్ ఇస్తుంది. ఏం చేస్తావని పారిజాతం అంటే ఇది నేను దీప తేల్చుకోవాలని పారుని జ్యో పంపించేస్తుంది. మా బావకు నీకు ఏంటి సంబంధమని జ్యోత్స్న దీపను నిలదీస్తుంది.

కాశీ నీ తమ్ముడే కదా 

కాశీ పంపించిన ఫోటో చూపించి దీనికి సమాధానం చెప్పమని జ్యోత్స్న అడుగుతుంది. ఇందులో తప్పు ఏముంది. నీ తమ్ముడు, మరదలు కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆశీర్వదించడానికి వెళ్ళాము. పెళ్లి పెద్దగా నేను వెళ్ళాను అందరం కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్నాం అందులో తప్పు ఏంటని అంటుంది.

తమ్ముడు ఏంటి అంటే దాసు బాబాయ్ మీ చిన్నాన్న కదా ఆయన కొడుకు నీకు తమ్ముడే కదా అని దీప అంటుంది. మా బావను నీ వాడిని చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావ్. తనని నువ్వు నాకు వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు స్వప్న, కాశీ పెళ్లి చేసి మా పెళ్లి చెడగొట్టావ్.

దవడ పళ్ళు రాలతాయి 

మా అత్త మా మావయ్యను వెల్లగొట్టింది. కానీ ఆయన రెండో భార్య కూతురు ఇంటికి వెళ్తుంది. అంటే నువ్వు మా అత్త మనసు కూడ మార్చేశావ్. ఇంకెందుకు లేట్ బ్యాగ్ సర్దుకుని మా అత్త ఇంటికి వెళ్లిపో. ఏదో ఒకరోజు గుడిలో నీ మెడలో మా అత్త బావతో తాళి కట్టించేస్తుంది.

నువ్వు ఇన్ని మాటలు అన్నా కొట్టకుండా ఉన్నాను అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సుమిత్ర అమ్మ, రెండు నువ్వు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావనే కృతజ్ఞత. లేకపోతే నాకొచ్చే కోపానికి కొడితే దవడ పళ్ళు రాలిపోతాయి. నీకు ఇంతకముందే చెప్పాను కార్తీక్ బాబుకు నీకు పెళ్లి చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోతాను.

మీ బావ మనసులో నువ్వు ఉన్నావా?

నేను నా భర్తకు విడాకులు ఇచ్చాను. నా జీవితంలో నా కూతురు అత్తగారు తప్ప మరొక మనిషి ఉండరు. నేను స్వప్న వాళ్ళ పెళ్లి చేయడం వల్ల పెళ్లి ఆగిపోయి, రెండు కుటుంబాలు విడిపోయాయని అంటున్నావ్ కదా నువ్వే వాటిని కలుపు. నేను నిన్ను ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు. మీ బావ మనసులో నువ్వు ఉన్నావా?

మా బావ మనసులో నేను ఎందుకు లేను ఉంటానని జ్యోత్స్న కంగారుగా చెప్తుంది. ముందు అది తేల్చుకో తర్వాత పెళ్లి చేసుకుని ఈ రెండు కుటుంబాలను కలుపు. అప్పుడు నేనే బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతాను. ఇంకోసారి నోటికొచ్చిన ప్రశ్నలు అడిగితే సమాధానం చేత్తో ఉంటుందని గట్టిగా చెప్తుంది.

కాంచన దగ్గరకు వెళ్ళు 

దీప మాటలకు జ్యోత్స్న రగిలిపోతుంది. బావ నా వాడు కానీ దీప మాట వింటాడు. ఇప్పుడు అత్త కూడా తనకు వత్తాసు పలుకుతుందని ఆవేశంగా మాట్లాడుతుంది. పారిజాతం కన్నింగ్ ఐడియాలు ఇస్తుంది. మీ బావ కోసం అత్త ఇంటికి వెళ్ళు. నువ్వు ఇలాగే ఉంటే దీప దగ్గర అవుతుంది నువ్వు దూరం అవుతావు.

మీ బావ, అత్తకు ఫోన్ చేశావా అని పారిజాతం జ్యోత్స్నను ప్రశ్నిస్తుంది. పెళ్లి చేయమని ఇంట్లో వాళ్ళను అడగడం కాదు అసలైన మనిషి అక్కడ ఉంది వెళ్ళి నిలదీయమని రెచ్చగొట్టి మనవరాలిని పంపిస్తుంది. దీప సుమిత్ర దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మనం ఏం చెప్పినా మా ఆయన, మావయ్య వాళ్ళ నిర్ణయాలు మార్చుకోరు.

పెళ్లి చేయండి 

అలాగని జరిగింది చిన్న తప్పు కాదు. తప్పు చేసిన దాసును ఎలా చూశారో నాకు తెలుసు. దాసు కంటే అన్నయ్య పెద్ద తప్పు చేశాడు. క్షమించమని ఎలా అడుగుతానని సుమిత్ర అంటుంది. పెద్దవాళ్ళు చేసిన తప్పులకు పిల్లలకు ఎందుకు శిక్ష అని దీప అంటుంది.

అప్పుడే శివనారాయణ వచ్చి పిల్లలు పెద్దవాళ్లకు ఆస్తులే దీప. తప్పు చేసిన మనిషితో బంధం కలుపుకోలేము. జీవితం చూసుకుంటే ఆ కుటుంబమే కలుషితం అవుతుందని అంటాడు. పెళ్లి చేస్తామని పిల్లలకు మాట ఇచ్చారు కదాని దీప అడుగుతుంది.

కార్తీక్ ని మర్చిపోతుంది 

వాళ్ళు ఆశలు పెంచుకున్నారని చెప్తుంది. కోరుకున్నది దక్కకపోతే వాళ్ళు జీవితాంతం బాధపడతారు కదా అంటుంది. నీ కూతురు తండ్రిని కోరుకున్నది కానీ వాడు చెడ్డవాడు అని తెలిసినాక వదులుకుంది. తన తండ్రిని మర్చిపోయింది. అలా కాకుండా తండ్రి కావాలని మారం చేస్తుంది వెళ్లిపోతాను అంటే నువ్వు పంపిస్తావా పంపవు కదా అంటాడు.

కానీ మీరు వద్దన్న మనిషి ఈ ఇంటి మనిషే కదా అంటుంది. కార్తీక్ బాబు లేకుండా జ్యోత్స్న ఉండలేదని చెప్తుంది. దానికి కారణం మేమే. చిన్నప్పటి నుంచి వాళ్ళకు పెళ్లి అన్నాము ఇప్పుడు కాదు అంటే అదే చిన్నగా మర్చిపోతుందని పెద్దాయన చెప్తాడు. అది సాధ్యం కాదండి ఈ విషయంలో మీరే వాళ్ళను క్షమించాలి.

నాన్న మాటే నా మాట 

కార్తీక్ బాబు, జ్యోత్స్నకు పెళ్లి చేయాలని దీప అడుగుతుంది. దశరథ మౌనంగా ఉంటే మీరైన చెప్పొచ్చు కదా అంటుంది. మా నాన్న మాట నేను ఎప్పుడు కాదనలేదు ఆయన మాట నా మాట అనేసి వెళ్ళిపోతాడు. మీరు వాళ్ళకు పెళ్లి చేయకపోతే వాళ్ళకు అన్యాయం చేసినట్టు అవుతుందని దీప అంటుంది.

నిన్ను పరాయి దాన్ని అని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకునేలా చేయకు. ఇంకెప్పుడూ ఈ విషయం గురించి తనతో మాట్లాడొద్దని శివనారాయణ చెప్తాడు. వాళ్ళ మాటలకు సుమిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ పెళ్లి చేయడం కోసం మీ వంతు ప్రయత్నాలు చేయమని దీప సుమిత్రకు చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం