Karthika deepam october19th episode: పగతో రగిలిపోతున్న జ్యోత్స్న, పారు- ద్రోహం చేసిన దీపను క్షమించేది లేదన్న శివనారాయణ
19 October 2024, 7:05 IST
- Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప మెడలో కార్తీక్ తాళి కట్టడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. దీపను ప్రశాంతంగా బతకనివ్వను బావకు నేనే భార్యను అంటూ జ్యోత్స్న పగతో రగిలిపోతుంది. పారు కూడా దీపను భూమి మీద లేకుండా చేస్తానని అంటుంది.
కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 19వ తేదీ ఎపిసోడ్
Karthika deepam 2 serial: దీపకు ఐదోతనం వరంగా ఇచ్చారని అనసూయ కార్తీక్ కాళ్ళ మీద పడుతుంది. పుట్టుక నుంచి దానికి అన్నీ కష్టాలే ఆయిన వాళ్ళు అంతా దానికి దూరం అవుతూనే ఉన్నారు. దానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం చంటిది. దాన్ని దూరం చేయాలని నా కొడుకు చూస్తున్నాడు.
జ్యోత్స్న చెప్పింది నిజమే
నా తమ్ముడే బతికి ఉంటే దీని బతుకు ఇలా చీకటి అవుతుందని అనుకోలేదు. దీని చీకటి బతుకులో మీరు దీపం వెలిగించారు. మీరు నిజంగా దేవుడు అని దణ్ణం పెడుతుంది. జ్యోత్స్న మాటలను శివనారాయణ నమ్మాలని అనిపించడం లేదని అంటాడు. అసలు ఏం జరిగిందో కనుక్కుంటానని సుమిత్ర అంటుంది.
సుమిత్రకు కాంచన ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న ఇంటికి వచ్చింది. నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది. నిజమే వదిన అని కానీ నేను ఎవరికో అన్యాయం చేద్దామని కాంచన మాట్లాడబోతుంటే సుమిత్ర ఫోన్ పెట్టేస్తుంది. జ్యోత్స్న చెప్పింది నిజమే మావయ్య అని సుమిత్ర ఏడుస్తుంది.
ఇదంతా నీ వల్లే
మన మీద దీప పగబట్టింది. నా జీవితానికి ఉన్న ఒక్క ఆశను కాలితో తొక్కి చంపేసిందని జ్యోత్స్న ఏడుస్తుంది. దీపను కార్తీక్ పెళ్లి చేసుకోవడం ఏంటి? వెళ్ళి ఒక్కసారి మాట్లాడదామని సుమిత్ర అంటుంది. పెళ్లి జరిగిపోయాక ఏం మాట్లాడతామని శివనారాయణ బాధగా అంటాడు.
నువ్వు అసలు వారసురాలివి కాకపోయిన ఆస్తి కోసం ఇంత చేస్తే ఇలా జరిగింది ఏంటి? ఇదంతా నువ్వు చేసుకున్న దరిద్రమే. ఆ దీపతో గొడవ పడి నీ కొంపకు నువ్వే నిప్పు పెట్టుకున్నావ్. దాన్ని ఇంట్లో నుంచి పంపించొద్దు ఎక్కడో తేడా కొడుతుంది అంటే నా నోరు మూయించావు.
కార్తీక్ కి దీపక్క కరెక్ట్
పుట్టిన దగ్గర నుంచి బావ నా మొగుడు అని బతికావ్. ఇప్పుడు అది వచ్చి నీ అదృష్టాన్ని తన్నుకుపోయిందని పారిజాతం అంటుంది. బావ తాళి కట్టేటప్పుడు కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచించొచ్చు కదాని జ్యోత్స్న బాధపడుతుంది. నా కలను నాశనం చేసి నా జీవితానికి అర్థం లేకుండా చేసిందని పారిజాతం పగతో రగిలిపోతుంది.
నా మెడలో కట్టమని తీసుకెళ్లిన తాళి బావ దాని మెడలో కట్టాడు. అది నా తాళి చచ్చినా దీపను వదిలిపెట్టనని జ్యోత్స్న రగిలిపోతుంది. దాసు కంగారుగా కాశీ దగ్గరకు వచ్చి దీపను కార్తీక్ పెళ్లి చేసుకున్నాడని చెప్తాడు. బావ లాంటి మంచి వాడికి దీపక్క కరెక్ట్. దీపక్క మంచితనానికి దేవుడే న్యాయం చేశాడని కాశీ అంటాడు.
జ్యోత్స్న పెళ్లి అతడితోనే
కానీ నా కూతురికి అన్యాయం జరిగింది. కార్తీక్ లాంటి మంచివాడికి దీప కరెక్ట్. కానీ బావ నా మొగుడు అని ఆశపడిన నా కూతురి పరిస్థితి ఏంటని దాసు మనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావని దశరథ తండ్రిని అడుగుతాడు. ముందు అనుకున్నట్టుగానే నా ఫ్రెండ్ కొడుకుతో పెళ్లి చేద్దామని శివనారాయణ అంటాడు.
అందుకు జ్యోత్స్న ఒప్పుకోదు. మీరు వెళ్ళి కాంచనతో మాట్లాడండి. దీప చేతిలో ఎంతో కొంత పెట్టి తనని వదిలించుకోండి అని పారిజాతం అనేసరికి శివనారాయణ కోపంగా చెయ్యి ఎత్తుతాడు. ఒకసారి ఆ ఇంటికి కూతురిని ఇచ్చి తప్పు చేశాను ఇప్పుడు నా మనవరాలి జీవితాన్ని నాశనం చేయలేనని చెప్తాడు.
నమ్మించి గొంతు కోసింది
ఇక ఆ మనుషులను జీవితంలో క్షమించలేను. ఆ లిస్ట్ లో దీప కూడా చేరింది. నమ్మించి గొంతు కోయడం అనే మాట దీపకు సరిగా సరిపోతుంది. అందరూ నాకు సరైన బుద్ధి వచ్చేలా చేశారు. మనవరాలు జ్యోత్స్నకు ఏం కాదు తన గురించి భయపడొద్దని కోడలికి ధైర్యం చెప్తాడు.
జ్యోత్స్న జరిగింది తలుచుకుని రగిలిపోతుంటే పారిజాతం వస్తుంది. బావ తాళి కట్టేంతగా దీప ఏం చేసింది. దీపకి బావకి మధ్య ఏదో బలమైన సంబంధం ఉంది. నిజానికి దీపను బావకు పరిచయం చేసింది నేనే. కానీ ఇదే వాళ్ళ మొదటి పరిచయం కాదని అనిపిస్తుంది.
దీపకు కార్తీక్ ముందే తెలుసు
నిజం చెప్పు గ్రాని నా అనుమానం నిజమే కదాని అడుగుతుంది. ముత్యాలమ్మ గూడెంలోనే దీపకు కార్తీక్ పరిచయం ఉంది. శౌర్య తొక్కుకుంటూ తిరిగే సైకిల్ మీ బావ గిఫ్ట్ గా ఇచ్చాడు. కార్తీక్ లండన్ నుంచి ఇంటికి కూడా రాకుండా నేరుగా దీప దగ్గరకు వెళ్ళాడు. మన ముందు మాత్రం ఏం తెలియనట్టు నటించారని అంటుంది.
ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న గ్రాని గొంతు పట్టుకుంటుంది. దీపను తప్పించి నిన్ను కార్తీక్ కి భార్యను చేస్తానని పారిజాతం అంటుంది. దీప బావతో సుఖంగా ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను. దాన్ని ప్రశాంతంగా బతకనివ్వను కలిసి కాపురం చేసుకొనివ్వను.
నన్ను ఎవరి ముందు తలెత్తుకోకుండా చేశారు. నేను ఇన్నాళ్ళూ ప్రాణంగా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తిత్వాన్ని చంపేశారు. ఈ తాళి నా మెడలో కట్టి అందరూ అనుకునే మాటలు నిజం చేశారు. ఈ తాళి నా మెడలో ఎందుకు కట్టారో చెప్పండి. నా అనుమతి లేకుండా నా మెడలో తాళి కట్టే హక్కు ఎవరిచ్చారు అని నిలదీస్తుంది.
నీ కూతురు ఇచ్చింది. నీకు ఇంతకముందే చెప్పాను అవసరం అయితే శౌర్య కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటానని అన్నాను. ఫ్రెండ్ లా ఉండటం కోసం వాళ్ళ అమ్మ మెడలో తాళి కట్టాలా అని అడుగుతుంది. ఫ్రెండ్ గా కాదు నాన్నలా ఉండటం కోసం తాళి కట్టాలని కార్తీక్ చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్