తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 July 29th: నరసింహకు విడాకులు ఇవ్వమన్న సుమిత్ర.. శౌర్య గుండె బలహీనంగా ఉందన్న డాక్టర్

Karthika deepam 2 july 29th: నరసింహకు విడాకులు ఇవ్వమన్న సుమిత్ర.. శౌర్య గుండె బలహీనంగా ఉందన్న డాక్టర్

Gunti Soundarya HT Telugu

29 July 2024, 7:00 IST

google News
    • Karthika deepam 2 serial july 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అన్ని సమస్యలకు పరిష్కారం నరసింహకు విడాకులు ఇవ్వడమేనని సుమిత్ర దీపకు చెప్తుంది. కానీ అందుకు దీప మాత్రం ఒప్పుకోదు.
కార్తీకదీపం 2 సీరియల్ జులై 29వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 29వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కార్తీకదీపం 2 సీరియల్ జులై 29వ తేదీ ఎపిసోడ్

Karthika deepam 2 serial july 29th episode: దీప శౌర్య గురించి బాధపడుతుంటే సుమిత్ర ఓదారుస్తుంది. మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను నా కూతురిని చూడటానికి వచ్చారు. కానీ నాకు మీ మొహం చూడటానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు అని సుమిత్ర చెయ్యి పట్టుకుని క్షమాపణ అడుగుతుంది.

క్షమాపణలు చెప్పిన దీప

జ్యోత్స్న నిశ్చితార్థం అని నన్ను ఎంతో సంతోషంగా పిలిచారు. కానీ ఈరోజు నా కారణంగానే అది ఆగిపోయింది. అందుకే మీరు నన్ను క్షమించాలని అడుగుతుంది. నువ్వు ఎందుకు సంజాయిషీ చెప్పడమని సుమిత్ర అంటుంది. జీవితాన్ని కష్టాలతో నింపేసుకోకు.

ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం నువ్వుకాదు. నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురికి పెళ్లి జరగదా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జ్యోత్స్న గురించి కాదు శౌర్య గురించి. నిన్ను తను ఏమైనా అన్నా కూడా పట్టించుకోకని చెప్తుంది. నరసింహ ఇక్కడికి వచ్చాడా అంటే రాలేదని చెప్తుంది.

వస్తాడు వాడు నీ కూతురు కోసం ఖచ్చితంగా వస్తాడని సుమిత్ర అనేసరికి దీప కంగారుగా చుట్టూ చూస్తుంది. మేమందరం ఉంటామని తెలిసి కూడా ధైర్యంగా అక్కడికి వచ్చిన వాడు ఇక్కడికి రాడా? వాడు వస్తే శౌర్య ఏ పరిస్థితిలో ఉన్నా పట్టించుకోడు. తనని వదిలిపెట్టడు.

నరసింహకు విడాకులు ఇవ్వు

పాప జాగ్రత్త. దీనికి కారణం నరసింహ కాదు నువ్వే అంటుంది. నా కూతురిని కాపాడుకోవడానికి అన్నీ చేశాను కానీ వాడు మారడు అంటుంది. అయితే నీ కూతురిని వాడికి ఇచ్చేయమని చెప్తుంది. అదే చేతనైతే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటాను. నీ కూతురిని ఇవ్వలేకపోతే విడాకులు ఇవ్వు అంటుంది.

నువ్వు సరేనని ఒక్క మాట చెప్పు లాయర్ తో నేను మాట్లాడతానని చెప్తుంది.వద్దు అమ్మ ఇప్పటి వరకు ఉన్న సమస్యలు చాలు ఈ విషయం వదిలేయమని దీప కన్నీళ్లతో అడుగుతుంది. నా కూతురు కోలుకున్న తర్వాత తనని తీసుకుని దూరంగా వెళ్లిపోతానని అంటుంది.

ఇంకోసారి అలా మాట్లాడితే నేనే వెళ్ళి నరసింహను తీసుకొస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు. శౌర్య కోలుకున్న తర్వాత తీసుకెళ్లడానికి నేనే హాస్పిటల్ కి వస్తాడు. ఏం ఆలోచించకు. కార్తీక్ ఇక్కడే ఉన్నాడు నీకు ఏ భయం వద్దని జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది.

శౌర్య గుండె చాలా వీక్గా ఉంది

మీరు నా మంచి కోసం చెప్తున్నారు కానీ నేను నరసింహ నుంచి విడాకులు తీసుకోలేను. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు. నేనే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తానని అనుకుంటుంది. డాక్టర్ శౌర్య రిపోర్ట్స్ చూసి పాపకు ప్రాబ్లం ఉందని చెప్తాడు. శౌర్య గుండె చాలా వీక్ గా ఉంది.

ఏ విషయంలోనైనా భయపడితే తను తట్టుకోలేదు. కళ్ళు తిరిగిపడిపోతుంది. తనకు అలా కావడానికి కారణం ఆదేనని డాక్టర్ చెప్తాడు. ఏం చేస్తే ఈ ప్రాబ్లం తగ్గుతుందని కార్తీక్ అడుగుతాడు. పిల్లలు దేన్ని చూసి భయపడతారో దాన్ని దూరంగా ఉంచాలి. తనని ఎక్కువగా ఆడించొద్దని చెప్తాడు.

పాపకు ఉన్న ప్రాబ్లం ఇదొక్కటే ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పడంతో కార్తీక్ దీపకు ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. దగ్గరలోనే మరో మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపిద్దామని కాంచన అంటే అప్పుడైన జరుగుతుందా అని పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.

దీప ఉండగా జరగదు

దీప ఉండగా నిశ్చితార్థం జరగదని అంటుంది. శివనారాయణ సీరియస్ అవుతాడు. సుమిత్ర వస్తే పాపకు ఎలా ఉందని అడుగుతారు. పాప కళ్ళు తెరిచిందని తనకు ఇంకా టెస్ట్ లు జరుగుతున్నాయని చెప్తుంది. పాప కళ్ళు తెరిస్తే ఇంకా కార్తీక్ అక్కడ ఎందుకు రావచ్చు కదాని పారిజాతం అడుగుతుంది.

వాడిది మంచి మనసు అందుకే అండగా నిలుస్తున్నాడు. మళ్ళీ నిశ్చితార్థం ముహూర్తం పెట్టుకోవచ్చు. కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగిరాదు. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మంగళ వాయిద్యాలతో ఇంటికి వచ్చే వాడు కాదు. అందరి ముందు జ్యోత్స్న అంటే ఇష్టం ఉందని చెప్పేవాడు కాదు.

జ్యోత్స్నలో చిన్నపిల్ల మనసు పోలేదు అందుకే అలా మాట్లాడుతుంది. మీరు అలాగే మాట్లాడితే ఎలా అని పారిజాతానికి చురకలు వేస్తుంది. దీప సుమిత్ర మాటల గురించి ఆలోచిస్తుంటుంది. కార్తీక్ కోసం దీప బయటకు వెళ్ళగానే లోపలికి కార్తీక్ వస్తాడు. నరసింహ వస్తాడేమోనని హాస్పిటల్ బయటకు వచ్చి చూస్తుంది.

హాస్పిటల్ దగ్గర నరసింహ

అక్కడ నరసింహ ఉండటం చూసి షాక్ అవుతుంది. కార్తీక్ శౌర్యను చూస్తూ బాధపడతాడు. దీప వచ్చి నరసింహ వచ్చాడని చెప్తుంది. కార్తీక్ బయటకు వెళ్ళేసరికి అక్కడ ఉండడు. వాడు ఖచ్చితంగా పాప కోసమే వచ్చి ఉంటాడు. ఒకటి గుర్తు పెట్టుకో ఏం జరిగినా కూడా నరసింహ పాప దగ్గరకు వెళ్లకూడదు.

చూస్తే శౌర్య అనేసి డాక్టర్ చెప్పిన మాట చెప్పకుండా దాటేస్తాడు. మీరు అబద్ధం చెప్తున్నారు ఇంతకముందు కూడా ఇలాగే జరిగిందని దీప కంగారుగా అడుగుతుంది. ఏం లేదని అంటాడు. కూతురి పరిస్థితి తలుచుకుని దీప చాలా ఏడుస్తుంది. నా కూతురి మనసులో దాని తండ్రి దానిలా ఉంటాడని తండ్రికి దాని గుండెలో అందమైన గుడి కట్టింది.

కానీ ఈరోజు ఆ గుడి కూలిపోయింది. ఆ నిజాన్ని భరించలేక పడిపోయింది. నాన్న ఎప్పుడు వస్తాడని అడిగిన ప్రతిసారి వందల అబద్దాలు చెప్పాను. అది నన్ను అడుగుతుందో లేదో తెలియదు కానీ నేను చెప్పినవి అబద్ధాలని తెలుస్తుంది కదా అంటుంది. కూతురిని కాపాడుకోవడం కోసం అబద్ధాలు చెప్పారు దాన్ని ఎవరూ వేలెత్తి చూపించలేరని కార్తీక్ నచ్చజెప్పడానికి చూస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం