తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut Thalaivi: కంగ‌నా సినిమాకు న‌ష్టాలు - డ‌బ్బులు తిరిగివ్వాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ కంప్లైంట్‌

Kangana Ranaut Thalaivi: కంగ‌నా సినిమాకు న‌ష్టాలు - డ‌బ్బులు తిరిగివ్వాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ కంప్లైంట్‌

24 March 2023, 5:50 IST

  • Kangana Ranaut Thalaivi: కంగ‌నా ర‌నౌత్ త‌లైవి సినిమా న‌ష్టాల‌పై డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ...బాలీవుడ్‌ ప్రొడ్యూస‌ర్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

కంగ‌నా ర‌నౌత్ త‌లైవి
కంగ‌నా ర‌నౌత్ త‌లైవి

కంగ‌నా ర‌నౌత్ త‌లైవి

Kangana Ranaut Thalaivi: కంగ‌నా ర‌నౌత్ సినిమా కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప్ర‌ముఖ పంపిణీ సంస్థ... ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్‌లో కంప్లైంట్ ఇవ్వ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో 2021లో రూపొందిన త‌లైవి సినిమా త‌మిళ‌, హిందీ వెర్ష‌న్స్‌ను ఇండియాతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ జీ5 రిలీజ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

RK Roja Getup Srinu: మంత్రి రోజా కామెంట్లపై గెటప్ శ్రీను కౌంటర్.. ఎవరు అడగలేదంటూ రియాక్షన్

Raj Tarun: చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా కార‌ణంగా జీ5 సంస్థ దాదాపు ఆరు కోట్ల‌కుపైనే న‌ష్ట‌పోయిన‌ట్లు స‌మాచారం. రిలీజ్‌కు ముందు కంగ‌నా చేసిన కాంట్ర‌వ‌ర్సియ‌ల్ కామెంట్స్, ఆమెపై బాలీవుడ్‌లో ఉన్న వ్య‌తిరేక‌త కార‌ణంగా ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కార‌ణాలు ఏవైనా తాము న‌ష్ట‌పోయిన మొత్తాల‌ను తిరిగి చెల్లించాల‌ని జీ5 డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ నిర్మాత‌ల్ని డిమాండ్ చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతే కాకుండా నిర్మాత‌ల‌పై ఇండియ‌న్ మోష‌న్ పిక్చ‌ర్ ప్రొడ్యూస‌ర్ అసోసియేష‌న్‌లో కంప్లైంట్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అయితే జీ5 డిమాండ్ చేసిన ఆరు కోట్ల‌ను తిరిగి చెల్ల‌డించ‌డానికి ప్రొడ్యూస‌ర్స్ మాత్రం విముఖ‌త వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

ప్ర‌స్తుతం ఈ ఇష్యూను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాల్లో ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈసినిమా 10 కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాలో అర‌వింద్‌స్వామి, నాజ‌ర్‌, మ‌ధుబాల, భాగ్య‌శ్రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.