Indian 3 OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఇండియన్ 3 - కమల్‌హాసన్, శంకర్‌కు ప్రొడ్యూసర్ బిగ్ షాక్?
03 October 2024, 11:34 IST
Indian 3 OTT: కమల్‌హాసన్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ 3లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇండియన్ 3
Indian 3 OTT: కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కలయికలో ఈఏడాది భారీ అంచనాల నడుమ రిలీజైన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతకు వంద కోట్లకుపైనే నష్టాలను తెచ్చిపెట్టింది. ఇండియన్2కు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా రానుంది. ఇప్పటికే మూడో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం.
ఇండియన్ 2 ఎఫెక్ట్...
కాగా ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ ఇండియన్ 3పై గట్టిగానే పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్ 3 పై బజ్ ఏ మాత్రం లేదు. బిజినెస్ జరగడం కూడా కష్టంగానే మారినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఓన్‌గా రిలీజ్ చేసి రిస్క్ తీసుకోవడం కంటే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ 3కి సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. కమల్‌హాసన్, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరిలోనే ఇండియన్ 3 డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కాజల్ అగర్వాల్...
ఇండియన్ 3లో కమల్‌హసన్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఇండియన్ 2 రిలీజైన థియేటర్లలో క్లైమాక్స్‌లో ఇండియన్ 3 టీజర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో కమల్‌హాసన్, కాజల్ ప్రాచీన యుద్ధ విద్యల్లో ఒకరితో మరొకరు తలపడుతూ కనిపించారు.
250 కోట్ల బడ్జెట్ - 150 కోట్ల కలెక్షన్స్...
ఈ ఏడాది జూలైలో ఇండియన్ 2 దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఒకే సారి రిలీజైంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ 150 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటించారు.
సేనాపతి రీఎంట్రీ...
దేశంలో అవినీతి పెరిగిపోవడంతో ప్రజల పిలుపు మేరకు మళ్లీ సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతిపరులను అంతమొందిస్తుంటాడు. అయితే సేనాపతి తిరిగిరావాలని పిలునునిచ్చిన చిత్ర అరవింద్ అనే యూట్యూబర్‌తో పాటు చాలా మంది యువత అతడిని ఎందుకు వ్యతిరేకించారు?
తన తండ్రి గురించి అరవింద్ తెలుసుకున్న నిజం ఏమిటి అనే అంశాలతో శంకర్ ఈ మూవీని తెరకెక్కించాడు. కథ, కథనాలతో పాటు శంకర్ టేకింగ్, కమల్‌హాసన్ లుక్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మైనస్‌గా నిలిచింది.
గేమ్ ఛేంజర్‌తో బిజీ...
ఇండియన్ 2 తర్వాత రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు శంకర్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు