Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు ఆరోజే రానుందా!-crime comedy movie mathu vadalara 2 expected streaming date on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 Ott: మత్తువదలరా 2 ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు ఆరోజే రానుందా!

Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు ఆరోజే రానుందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 03:59 PM IST

Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 మూవీ మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..

Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు ఆరోజే రానుందా!
Mathu Vadalara 2 OTT: మత్తువదలరా 2 ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు ఆరోజే రానుందా!

మంచి క్రేజ్ మధ్య రిలీజైన ‘మత్తువదలరా 2’ సూపర్ హిట్ అయింది. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో శ్రీసింహా, సత్య లీడ్ రోల్స్ చేశారు. మత్తువదలరా మూవీకి ఐదేళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తక్కువ బడ్జెట్‍తో రూపొందిన మత్తువదలరా 2 అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు సాధించింది.

మత్తువదలరా 2 సినిమాకు దాదాపు థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావొస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో బజ్ బయటికి వచ్చింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

మత్తువదలరా 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది.ఈ సీక్వెల్‍పై హైప్ ఉండటంతో మంచి ధరకే హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఆ రోజునే స్ట్రీమింగ్‍కు వస్తుందనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మత్తువదలరా 2 మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో దసరా కలిసి వస్తుండటంతో పండుగకు ఒక్క రోజు ముందు అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందనే అంచనాలు వస్తున్నాయి.

మత్తువదలరా 2 చిత్రానికి రితేశ్ రాణా దర్శకత్వం వహించారు. సీక్వెల్‍లోనూ మ్యాజిక్ రిపీట్ చేశారు. ఈ చిత్రంలో సస్పెన్స్ కామెడీని తెరపై ఆకట్టుకునేలా చూపించారు. ఈ చిత్రంలో సత్య యాక్టింగ్‍పై చాలా ప్రశంసలు వచ్చాయి. మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టేశారు. శ్రీసింహ కూడా మెప్పించారు. ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, సునీల్, రోహిణ్, అజయ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.

మత్తువదలరా 2 కలెక్షన్లు

మత్తువదలరా 2 చిత్రం సుమారు రూ.32 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్‍గా నిలిచింది. మత్తువదరా 3 కోసం కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మత్తువదలరా 2 చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు నిర్మించాయి. చిరంజీవి పెదమల్లు, హేమలత ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ చేయగా.. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు.

స్టోరీలైన్ ఇలా..

హీ టీమ్‍లో బాబు (శ్రీసింహ), యేసుదాసు (సత్య) స్పెషల్ ఆఫీసర్లుగా చేరుతారు. నిధి (ఫారియా అబ్దుల్లా) వీరికి సీనియర్. కిడ్నాప్ కేసుల్లో డబ్బు విషయంలో అవకతవకలు చేస్తుంటారు బాబు, యేసుదాసు. అయితే, ఓ కిడ్నాప్ విషయంలోనూ ఇలాగే చేసేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు. ఓ హత్య కేసులో ఇద్దరూ చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరిని ఎవరు ఇరికించారు? బాబు, యేసు ఈ చిక్కుల నుంచి బయటపడ్డారా అనేవి మత్తువదలరా 2 చిత్రంలో ఉంటాయి.