Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..-mathu vadalara 2 day 1 box office collections sri simha satya movie opnes big ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 14, 2024 01:39 PM IST

Mathu Vadalara 2 Day 1 Collections: మత్తువదలరా 2 చిత్రం మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఫుల్ క్రేజ్‍తో వచ్చిన చిత్రం అంచనాలను నిలుపుకుంటూ అదరగొట్టింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ మూవీ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఫస్ట్ డే వసూళ్లు ఎంత వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.

Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన మత్తువదలరా 2 సినిమా అంచనాలను అందుకుంది. 2019లో వచ్చిన మంచి హిట్ అయిన మత్తువదలరాకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రానికి ఫుల్ హైప్ ఏర్పడింది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ బలంగా, విభిన్నంగా చేసింది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) థియేటర్లలో రిలీజైన మత్తువదలరా 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. క్రేజ్ తగ్గట్టే ఈ మూవీ మెప్పించింది. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది.

తొలి రోజు కలెక్షన్లు ఇవే..

మత్తువదలరా 2 చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీ ఈ స్థాయి ఓపెనింగ్ దక్కించుకొని అదరగొట్టింది. తొలి రోజు కలెక్షన్ల లెక్కలను మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 14) అధికారికంగా వెల్లడించింది.

శ్రీసింహ, సత్య జీప్‍పై కూర్చొని గన్‍లు పేలుస్తున్న పోస్టర్‌తో ఫస్ట్ డే కలెక్షన్లను మూవీ టీమ్ రివీల్ చేసింది. “బాక్సాఫీస్ వద్ద దూకుడుగా మత్తువదలరా 2 మొదలైంది. తొలి రోజు రూ.5.3 కోట్ల గ్రాస్ సాధించింది” అని పేర్కొంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి రితేశ్ రాణా దర్శకత్వం వహించారు.

పెరగనున్న వసూళ్ల జోరు!

మత్తువదలరా 2 మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. ఇప్పటికే క్రేజీ సీక్వెల్ అవడం, మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీకి వీకెండ్‍లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారమైన రెండో రోజు టికెట్ల బుకింగ్స్ చూస్తే ఇది అర్థమవుతోంది. దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ దాటేలోపే లాభాల్లోకి వచ్చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

సత్యపై ప్రశంసల వర్షం

మత్తువదలరా 2 సినిమాలో సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాల్లో ఆయన తన నటనతో విపరీతంగా మెప్పించారు. అయితే, మత్తువదలరా 2లో నెక్స్ట్ లెవెల్ కామెడీ జనరేట్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. ఈ మూవీలో మెయిన్ హీరో శ్రీసింహ అయినా.. సత్యనే హైలైట్‍గా నిలిచారు.

తొలి భాగానికి కొనసాగింపుగానే మత్తువదలరా 2 రూపొందింది. డైరెక్టర్ రితేశ్ రాణా మరోసారి తన మార్క్ న్యూఏజ్ టేకింగ్‍తో మెప్పించారు. ఈ చిత్రంలో శ్రీసింహ, సత్యతో పాటు ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, అజయ్ కీలకపాత్రలు పోషించారు.

మత్తువదలరా 2 మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. ఆయన ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఈ మూవీకి సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ చేయగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు.

మత్తువదలరా 2 చిత్రంలో బాబు (శ్రీసింహ), యేసుదాస్ (సత్య).. హీ టీమ్ స్పెషల్ ఆఫీసర్లుగా.. నిధి (ఫారియా అబ్దుల్లా) టీమ్‍లో ఉంటారు. అయితే, ఓ అమ్మాయి కిడ్నాప్ కేసులో బాబు, యేసునే హీ టీమ్ అనుమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కిడ్నాప్ అయిందెవరు, చేసిందెవరు? వారిద్దరు బయటపడ్డారా? అనే అంశాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.