Prabhas: ప్రభాస్‍ను హాట్‍స్పాట్ అడిగిన సత్య.. ఫారియాను చూసి షాకైన రెబల్ స్టార్.. హిల్లేరియస్ వీడియో చూసేయండి
Prabhas - Mathu Vadalara 2 Video: మత్తువదలరా 2 ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ నేడు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్ ఓ హిల్లేరియస్ వీడియో చేసింది. ప్రభాస్ కూడా సరదాగా పంచ్‍లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రలు పోషించిన మత్తువదలరా 2 చిత్రంపై మంచి హైప్ ఉంది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మత్తువదలరా’కు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీకి రితేశ్ రాణా దర్శకత్వం వహించారు. మత్తువదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నేడు (సెప్టెంబర్ 8) లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ చేసిన వీడియో ఫుల్ ఫన్‍తో ఉంది.
ప్రభాస్ అసహనం.. సత్య కామెడీ
“స్టార్ అంటే రెబలేరా.. రెబల్ అంటే రాజేరా” అంటూ మత్తువదలరా 2 టీమ్ కేకలు పెడుతుంటే.. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. శ్రీసింహ ఇంత మంది ఏంటి అని అన్నారు. రెబల్ స్టార్‌ను టచ్ చేశానంటూ గంతులు వేశారు సత్య. “వీడిని బయటికి వెళ్లి ఆడుకోమను” అని ప్రభాస్ అన్నారు. ఏంటి ఇలా వచ్చారని ప్రభాస్ అంటే.. ట్రైలర్ లంచ్ అని సత్య అన్నారు. లంచ్ ఏంటి డిన్నర్ చేద్దామని ప్రభాస్ చెప్పారు. అది లంచ్ కాదు.. లాంచ్ అంటూ సత్యపై కోప్పడ్డారు శ్రీసింహా.
డేటా అయిపోయింది.. హాట్‍స్పాట్ ఇస్తారా..
ట్రైలర్‌ను ప్రభాస్‍కు చూపించేందుకు శ్రీసింహ, సత్య పోటీపడతారు. సత్య ట్రైలర్ చూపించేందుకు ప్రయత్నించగా.. లోడ్ అవుతూనే ఉంటుంది. దీంతో ప్రభాస్ అసహనం వ్యక్తం చేస్తారు. చాలా ఆలస్యమవడంతో ఇవాళ ఇది వస్తుందా అని అంటారు. “డేటా అయిపోయింది సర్. కొంచెం హాట్‍స్పాట్ ఇస్తారా” అని సత్య అంటారు. దీంతో ప్రభాస్ ఓ లుక్ ఇచ్చి బెదిరిస్తారు.
పక్కనే ఉన్న ఫరియా అబ్దుల్లా తాను పాటపాడతానంటూ నిల్చున్నారు. “దీంతో ఈవిడ ఏంట్రా ఇంతుంది” అని ప్రభాస్ అన్నారు. ఈ టైమ్‍లో మత్తువదలరా పార్ట్ 1 ట్రైలర్ చూపిస్తారు దర్శకుడు రితేశ్ రాణా. సినిమాలు ఎలా నడుస్తున్నాయని శ్రీసింహ అంటే.. మీ డౌన్‍లోడ్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాయని ప్రభాస్ ఫ్రస్ట్రేట్ అయ్యారు. ప్రీ-రిలీజ్‍కు రావాలని, పాట అని ఒక్కొక్కరు అంటుంటే.. ట్రైలర్ లాంచ్ చేయాలా వద్దా అని చిరాకు పడ్డారు.
నేనే తస్కరించా..
ట్రైలర్ ఎవరి దగ్గర ఉంది అంటూ తర్జనభర్జన పడ్డారు. అయితే, ‘ట్రైలర్ నా దగ్గర ఉంది’ అని ప్రభాస్ అన్నారు. “అన్నా నీ దగ్గర ఎలా ఉంది" శ్రీసింహ అడిగారు. దీంతో ‘తస్కరించా’ అంటూ మత్తువదలరా ఐకానిక్ డైలాగ్ చెప్పారు ప్రభాస్. మత్తువదలరా 2 ట్రైలర్ అని లాంచ్ చేశారు రెబల్ స్టార్.
ఈ వీడియో ఫుల్ ఫన్‍తో హిల్లేరియస్‍గా ఉంది. మత్తువదలరా 2 ట్రైలర్ కూడా కామెడీతో అదిరిపోయింది. శ్రీసింహ, సత్య మరోసారి మ్యాజిక్ చేసేశారు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా, సునీల్ కూడా మెయిన్ రోల్స్ చేశారు. మత్తువదలరా 2 చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.
మత్తువదలరా 2 చిత్రం 2 గంటల 19 నిమిషాల రన్‍టైమ్‍తో వస్తోంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూజ్ చేశాయి.