Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్ లాంఛింగ్‌ అప్పుడే - గెస్టులుగా పాన్ ఇండియ‌న్ స్టార్స్‌!-unstoppable with nbk next season to launch on dussehra aha ott announced officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్ లాంఛింగ్‌ అప్పుడే - గెస్టులుగా పాన్ ఇండియ‌న్ స్టార్స్‌!

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్ లాంఛింగ్‌ అప్పుడే - గెస్టులుగా పాన్ ఇండియ‌న్ స్టార్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Aug 08, 2024 01:58 PM IST

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 లాంఛింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నుంచి ఈ టాక్ సో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో
బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో

Unstoppable With Nbk:బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో నెక్స్ట్ సీజ‌న్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నుంచి టాక్ షో ప్రారంభం కానున్న‌ట్లు ఆహా ఓటీటీ వెల్ల‌డించింది.

పాన్ ఇండియ‌న్ స్టార్స్…

గ‌త సీజ‌న్స్‌లో టాక్ షోకు గెస్ట్‌లుగా ఎక్కువ‌గా టాలీవుడ్ స్టార్స్ వ‌చ్చారు. నెక్స్ట్ సీజ‌న్‌ను పాన్ ఇండియ‌న్ స్టార్స్‌తో స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ హీరోల‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, సాండ‌ల్‌వుడ్‌ హీరోలు ఈ టాక్ షోలో సంద‌డి చేస్తార‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 11 నుంచి అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆహా ఓటీటీలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.

బాల‌కృష్ణ మేజ‌రిజ‌మ్స్‌...

బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ టాక్ సో తెలుగులో పెద్ద స‌క్సెస్ అయ్యింది. మిగిలిన టాక్ షో రికార్డుల‌ను బ్రేక్ చేసింది. రెగ్యుల‌ర్ టాక్ షోల‌కు భిన్నంగా అన్‌స్టాప‌బుల్‌ను డిజైన్ చేశారు. ఈ షోలో సెల‌బ్రిటీల‌ను బాల‌కృష్ణ ప్ర‌శ్న‌లు అడిగే తీరు...ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌, పంచ్ డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ షో సీజ‌న్ వ‌న్, సీజ‌న్ 2ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోలు గెస్ట్‌లుగా రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

పొలిటీషియ‌న్లు కూడా...

సీజ‌న్ 1కు కేవ‌లం టాలీవుడ్ హీరోహీరోయిన్లు మాత్ర‌మే గెస్ట్‌లుగా వ‌చ్చారు. సీజ‌న్ 2లో సినిమా సెల‌బ్రిటీల‌తో పాటు చంద్ర‌బాబునాయుడు, కిర‌ణ్ కుమార్ రెడ్డి వంటి పొలిటీషియ‌న్లు అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో పాల్గొన్నారు. అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో గ‌త ఏడాది ఓ షో ప్రారంభ‌మైంది. కేవ‌లం రెండు ఎపిసోడ్స్‌తోనే ఈ షోకు ముగింపు ప‌లికారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో...

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 109వ మూవీ ఇది. ఈ మూవీలో యానిమ‌ల్ ఫేమ్ బాడీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ద‌స‌రాకు బాల‌కృష్ణ‌, బాబీ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు.

ఆవేశం రీమేక్‌లో...

బాబీ మూవీ త‌ర్వాత మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఆవేశం సినిమాను తెలుగులోకి బాల‌కృష్ణ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఆవేశం మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన ఆవేశం మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.