Celebrity Cricket League : ఫోర్లు, సిక్స‌ర్లు కొట్ట‌డానికి సినిమా స్టార్స్ రెడీ - సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ షెడ్యూల్ ఇదే-celebrity cricket league 2023 schedule announced akhil akkineni to lead telugu warriors team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Celebrity Cricket League 2023 Schedule Announced Akhil Akkineni To Lead Telugu Warriors Team

Celebrity Cricket League : ఫోర్లు, సిక్స‌ర్లు కొట్ట‌డానికి సినిమా స్టార్స్ రెడీ - సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ షెడ్యూల్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jan 28, 2023 06:14 PM IST

Celebrity Cricket League 2023: సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ 2023 షెడ్యూల్‌ను శ‌నివారం అనౌన్స్ చేశారు. ఇందులో తెలుగు వారియ‌ర్స్ టీమ్‌కు యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్ర‌వ‌రి 18న మొద‌లుకానుంది.

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని

Celebrity Cricket League 2023: సిల్వ‌ర్‌స్క్రీన్‌పై యాక్టింగ్‌తో అభిమానుల‌ను అల‌రించే సినిమా స్టార్స్ క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. త‌మ బ్యాటింగ్ విన్యాసాల‌తో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచేందుకు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, బాలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన అగ్ర నటీనటులు సిద్ధ‌మ‌వుతోన్నారు. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ 2023 షెడ్యూల్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు.

ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 19 వ‌ర‌కు ఈ సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ జ‌రుగ‌నుంది. ఇందులో మొత్తం ఎనిమిది టీమ్‌లు పోటీప‌డ‌నున్నాయి. తెలుగు వారియ‌ర్స్‌, బెంగాల్ టైగ‌ర్స్‌, చెన్నై రినోస్‌, కేర‌ళ స్ట్రైక‌ర్స్‌, క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌, ముంబై హీరోస్‌, భోజ్‌పురి ద‌బాంగ్స్‌, పంజాబ్ దే షేర్స్ టీమ్స్ పోటీప‌డ‌నున్నాయి. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు టీమ్‌కు అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. క‌న్న‌డ టీమ్‌కు కిచ్చా సుదీప్‌, చెన్నై టీమ్‌కు ఆర్య కెప్టెన్‌గా ఉండ‌నున్నారు.

ఇందులో బాలీవుడ్ టీమ్‌కు స‌ల్మాన్‌ఖాన్‌, కేర‌ళ టీమ్‌కు మోహ‌న్‌లాల్‌, తెలుగు టీమ్‌కు వెంక‌టేష్ బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఫిబ్ర‌వ‌రి 18 సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ బెంగాల్ టైగ‌ర్స్ - క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది. అదే రోజు చెన్నై రినోస్ తో ముంబాయి హీరోస్ త‌ల‌ప‌డ‌నుంది.

తెలుగు వారియ‌ర్స్ త‌మ తొలి మ్యాచ్‌లో కేర‌ళ స్ట్రైక‌ర్స్‌తో ఫిబ్ర‌వ‌రి 19న మొద‌టి మ్యాచ్ ఆడ‌నున్నారు. ల‌క్నో, జైపూర్‌, బెంగ‌ళూరు, త్రివేండ్రం, జోధ్‌పూర్‌, హైద‌రాబాద్‌ల‌లో సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ ఫైన‌ల్‌కు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ జ‌రుగ‌నుంది. ఇందులో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, భోజ్‌పురి, బెంగాళీ, పంజాబీ, హిందీ భాష‌ల‌కు చెందిన స్టార్స్ పాలు పంచుకోనున్నారు. .

IPL_Entry_Point