తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Karthika Ott: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ కాజ‌ల్ తెలుగు హార‌ర్ మూవీ

Kajal Karthika OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ కాజ‌ల్ తెలుగు హార‌ర్ మూవీ

02 April 2024, 6:01 IST

google News
  • Kajal Karthika OTT: కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా హీరోయిన్లుగా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ కాజ‌ల్ కార్తీక థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

కాజ‌ల్ కార్తీక ఓటీటీ రిలీజ్ డేట్
కాజ‌ల్ కార్తీక ఓటీటీ రిలీజ్ డేట్

కాజ‌ల్ కార్తీక ఓటీటీ రిలీజ్ డేట్

Kajal Karthika OTT: కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ కాజ‌ల్ కార్తీక థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. కాజ‌ల్ కార్తీక మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐదు క‌థ‌ల‌తో ఆంథాల‌జీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్స‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్, యోగిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ హార‌ర్ మూవీకీ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కరుంగాపియ‌మ్ పేరుతో త‌మిళంలో రూపొందిన సినిమాను కాజ‌ల్ కార్తీక పేరుతో తెలుగులోకి డ‌బ్ చేశారు. క‌థ‌లో కొత్త‌ద‌నం మిస్స‌వ్వ‌డం, హార‌ర్ ఎలిమెంట్స్ పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్ట‌లేక‌పోవ‌డంతో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

ఆంథాల‌జీ మూవీ…

లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో మొత్తం ఐదు క‌థ‌ల‌తో ఈ హార‌ర్‌ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు డీకే ప్ర‌తి క‌థ‌ను రెజీనా క్యారెక్ట‌ర్ ద్వారా ప‌రిచ‌యం అవుతుంటాయి. ఈ సినిమాలోని మొద‌టి క‌థ మీరాది (రైజా విల్స‌న్‌). లాక్‌డౌన్ కార‌ణంగా మీరా ఇళ్లు ఖాళీ చేయాల్సివ‌స్తుంది. శ‌క్తి (క‌లైయ‌రాస‌న్‌)అనే యువ‌కుడు త‌న ఇంట్లో ఆమెకు ఆశ్ర‌యం క‌ల్పిస్తాడు.

శ‌క్తి హంత‌కుడ‌ని తెలియ‌డంతో అత‌డి అపార్ట్‌మెంట్‌నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేస్తుంది మీరా. కానీ శ‌క్తి ఆమెను బంధిస్తాడు. మీరాను చంపేయాల‌నుకుంటాడు. ఐదేళ్ల క్రిత‌మే మీరా చ‌నిపోయింద‌నే నిజం అత‌డికి తెలుస్తుంది. మీరా ఎవ‌రు? అన్న‌దే ఫ‌స్ట్ క‌థ‌...

లాక్‌డౌన్ టైమ్‌లో...

లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో చిక్కుకుపోయిన కాజ‌ల్ (జ‌న‌ని అయ్య‌ర్‌) ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది. ఆ వీడియోలో ఆమె వెనుక ఓ వ్య‌క్తి క‌నిపిస్తాడు. ఆమెను భ‌య‌పెడ‌తాడు. అత‌డు ఎవ‌రు? కాజ‌ల్ ఇంట్లోకి అత‌డు ఎలా వ‌చ్చాడు? అన్న‌ది రెండో క‌థ‌. లాక్‌డౌన్ టైమ్‌లో మందు కోసం ఓ సీక్రెట్ బార్‌లో అడుగుపెట్టిన ఇద్ద‌రు స్నేహితుల‌కు బంధాల విలువ‌ను ఎలియ‌న్స్ ఎలా గుర్తుచేశార‌న్న‌ది మ‌రో క‌థ‌.

కార్తీక మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ...

శృతి ఓ సింగ‌ర్‌. ఓ సినిమా పాట పాడ‌టం ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్దార్థ్ అభిమ‌న్యు స్టూడియోకు వ‌స్తుంది. ఆ స్టూడియోలో శృతికి వింత మ‌న‌షులు క‌నిపిస్తారు. సిద్ధార్థ్ అభిమ‌న్యు అప్ప‌టికే చ‌నిపోయాడ‌నే నిజం తెలుస్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది నాలుగో క‌థ‌.

కార్తిక‌ (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) భ‌ర్త ఆర్మీలో ప‌నిచేస్తుంటాడు. కూతురు ఉమాయిల్ తో క‌లిసి ప‌ల్లెటూరిలో ఉంటుంది కార్తిక‌. ఆ ఊరిలో వ‌రుస‌గా చిన్న‌పిల్ల‌లు మాయ‌మ‌వుతుంటారు. కొంద‌రు పెద్ద‌లు హ‌త్య‌కు గుర‌వుతుంటారు. ఆ మ‌ర్డ‌ర్స్‌కు కార్తిక‌నే కార‌ణ‌మ‌ని నింద‌ మోపి హ‌త్య చేస్తారు? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది ఐదో క‌థ‌. ఈ ఐదు క‌థ‌ల‌ను క‌లుపుతూ మ‌రో స్టోరీగా రెజీనా ట్రాక్ న‌డుస్తుంది.

హార‌ర్ డోసు....

క‌థ‌లో హార‌ర్ డోసు త‌గ్గ‌డం, కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో కాజ‌ల్ కార్తీక ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. తెలుగులో కాజ‌ల్ కార్తీక రిలీజైన విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు.

స‌త్య‌భామ‌లో పోలీస్ ఆఫీస‌ర్‌...

ప్ర‌స్తుతం తెలుగులో స‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్ లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా కాజ‌ల్ క‌నిపించ‌బోతున్న‌ది. అఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌త ఏడాది భ‌గ‌వంత్ కేస‌రితో పెద్ద హిట్‌ను అందుకున్న‌ది కాజ‌ల్‌. కానీ ఈ స‌క్సెస్ క్రెడిట్ అమె కంటే బాల‌కృష్ణ‌, శ్రీలీల‌కే ఎక్కువ‌గా ద‌క్కింది.

తదుపరి వ్యాసం