TS AP Chicken Price Today : తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన చికెన్ ధరలు, తగ్గిన గుడ్డు రేటు-hyderabad telangana ap chicken price increasing egg prices decreasing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ap Chicken Price Today : తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన చికెన్ ధరలు, తగ్గిన గుడ్డు రేటు

TS AP Chicken Price Today : తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన చికెన్ ధరలు, తగ్గిన గుడ్డు రేటు

Bandaru Satyaprasad HT Telugu
Apr 01, 2024 07:20 PM IST

TS AP Chicken Price Today : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. ఎండలు, కోళ్ల దాణా, నీళ్ల కొరత ఇలా పలు కారణాలతో చికెన్ ధరలు కొండెక్కాయి.

చికెన్ ధరలు
చికెన్ ధరలు

TS AP Chicken Price Today : తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులు(Non Veg) కాస్త ఎక్కువే. సండే వచ్చిందంటే చికెన్ ముక్క లేదా మటన్ బొక్క లేనిదే ముద్ద దిగదు. అయితే గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణలో చికెన్ ధరలు(AP TS Chicken Rates) అమాంతం పెరుగుతున్నాయి. చికెన్ ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. పెరిగిన ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు షాక్ అవుతున్నాయి. గత వారంలో చికెన్ ధరలు క్రమంగా పెరిగాయి. గత వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో చికెన్ స్కిన్ లెస్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతుంది. అలాగే స్కిన్ తో చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200 వరకు ధర ఉంది. ప్రస్తుతం చికెన్ ధరలు కొండెక్కాయి. ఇక మటన్ కిలో రూ.1000 వరకు పలుకుతోంది.

హైదరాబాద్ లో చికెట్ ధరలు(Hyderabad Chicken Rates)

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో చికెన్ స్కిన్ లెస్(Hyderabad Skinless chicken Rate) కిలో ధర రూ.300 వరకు పలుకుతుంది. స్కిన్ తో కిలో చికెన్ ధర(Skin Chicken Rate) రూ.280 ఉంది. పెరిగిన చికెన్ ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. వారంలోపే ధరలు ఇంతలా పెరిగాయని బాధపడుతున్నారు. ఏపీలోని ప్రధాన పట్టణాల్లో చికెన్ ధరలు సైతం ఇలానే ఉన్నాయి. అయితే కోడిగుడ్డు ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. గతం వారంతో పోలిస్తే కోడిగుడ్డు తగ్గాయి. గతవారంలో రూ.7 పలికిన కోడిగుడ్డు(Egg Retail Price) ప్రస్తుతం రిటైల్ ధర రూ.5.00 చేరింది. కోడి గుడ్ల ధరలు ఇంతకన్నా తగ్గే ఛాన్స్ లేదని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. కానీ చికెన్ ధరలు (AP TS Chicken Rates)పెరిగే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతుండడంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని, దీంతో కోళ్ల లభ్యత తగ్గి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవిలో చికెన్ ధరలు పెరగడమే ఏటా చూస్తున్నామన్నారు.

నేటి కోడి గుడ్డు ధర(Egg price today)

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం హైదరాబాద్‌లో కోడి గుడ్డు ధర(Egg price Hyderabad Today) రూ.3.8గా ఉంది. హైదరాబాద్‌లో 100 కోడిగుడ్ల ధరరూ.380 కాగా, 12 గుడ్ల ధర రూ.45.6గా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో(Egg Price AP Today) కోడి గుడ్డు ధర రూ.4.58గా ఉంది. 100 కోడి గుడ్ల ధర రూ. 458 కాగా, 12 గుడ్ల ధర రూ.54.96 ఉంది.

చికెన్ ధరల పెరుగుదలకు కారకాలు

పౌల్ట్రీ రైతుల(Poultry Farmers) ప్రకారం కోళ్ల దాణా ధరలలో పెరుగుదల కారణంగా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని అంటున్నారు. కోళ్ల దాణాగా ఉపయోగించే సోయా, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి పడిపోవడంతో...మార్కెట్ వీటి ధర(Market Rates) పెరిగింది. దీంతో కిలో మాంసంపై ఉత్పత్తి ఖర్చులు రూ.100 వరకు పెరిగినట్లు పౌల్ట్రీ రైతులు తెలిపారు. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్‌లు(Poultry Farming) మూతపడుతున్నాయన్నారు. దీంతో కోళ్ల సరఫరాపై ప్రభావం పడిందన్నారు. అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోళ్ల ఎదుగుదలతో పాటు చిన్న పిల్లల మరణాల రేటును ప్రభావితం చేశాయని రైతులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం