Kajal Aggarwal Satyabhama: కాజ‌ల్ డిష్యూం డిష్యూం - స‌త్య‌భామ కోసం రిస్కీ ఫైట్స్ చేస్తోన్న‌ చంద‌మామ‌-kajal aggarwal performing risky action sequences for satyabhama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Aggarwal Satyabhama: కాజ‌ల్ డిష్యూం డిష్యూం - స‌త్య‌భామ కోసం రిస్కీ ఫైట్స్ చేస్తోన్న‌ చంద‌మామ‌

Kajal Aggarwal Satyabhama: కాజ‌ల్ డిష్యూం డిష్యూం - స‌త్య‌భామ కోసం రిస్కీ ఫైట్స్ చేస్తోన్న‌ చంద‌మామ‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2024 10:17 AM IST

Kajal Aggarwal Satyabhama: యాక్ష‌న్ హీరోయిన్‌గా అవ‌తారం ఎత్తింది కాజ‌ల్‌. స‌త్య‌భామ కోసం రిస్కీ ఫైట్స్ చేస్తోంది. కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్త‌యింది.

కాజ‌ల్‌
కాజ‌ల్‌

Kajal Aggarwal Satyabhama: ప‌దిహేడేళ్ల కెరీర్‌లో గ్లామ‌ర్‌, సాఫ్ట్ రోల్స్ ఎక్కువ‌గా చేసింది కాజ‌ల్‌. స‌త్య‌భామ సినిమాతో తొలిసారి త‌న‌లోని యాక్ష‌న్ కోణాన్ని చూపించ‌డానికి రెడీ అవుతోంది.లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతోన్న స‌త్య‌భామ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో న‌టిస్తోంది.

తెలుగులో కాజ‌ల్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తోన్న తొలి మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ 90 శాతం పూర్త‌యింది. న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ నెల‌ల్లో 35 రోజుల పాటు కీల‌క‌మైన షెడ్యూల్‌ను షూట్ చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ ఈ షెడ్యూల్‌లో కాజ‌ల్‌పై భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను చిత్రీక‌రించారు.

ఈ రిస్కీ యాక్ష‌న్ సీక్వెన్స్ ల‌లో ఎలాంటి డూప్ లేకుండా కాజ‌ల్ స్వ‌యంగా న‌టించిన‌ట్లు స‌మాచారం. ఫైట్ మాస్ట‌ర్ సుబ్బు సార‌థ్యంలో కాజ‌ల్‌పై షూట్ చేసిన ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటాయ‌ని యూనిట్ చెబుతోన్నారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం కాజ‌ల్ స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

కంప్లీట్ యాక్ష‌న్ మోడ్‌లో...

స‌త్య‌భామ సినిమాలో కాజ‌ల్ క్యారెక్ట‌ర్ కంప్లీట్ యాక్ష‌న్ మోడ్‌లో డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఛాలెంజింగ్ రోల్‌లో కాజ‌ల్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. స‌త్య‌భామ సినిమాతో సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమాకు గూఢ‌చారి డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్కా స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చ‌డంతో పాటు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. స‌త్య‌భామ సినిమాలో న‌వీన్‌చంద్ర, ప్ర‌కాష్ రాజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మిగిలిన టాకీ పార్ట్‌ను తొంద‌ర‌లోనే పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. స‌త్య‌భామ మూవీ వేస‌విలో ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. స‌త్య‌భామ సినిమాకు శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

స‌త్య‌భామ మిన‌హా...

ప్ర‌స్తుతం తెలుగులో కాజ‌ల్ చేతిలో స‌త్య‌భామ సినిమా ఒక్క‌టే ఉంది. ఈ సినిమా మిన‌హా ఏది ఆమె సైన్ చేయ‌లేదు. గ‌త ఏడాది భ‌గ‌వంత్ కేస‌రిలో స‌క్సెస్ అందుకున్నా ఆ క్రెడిట్ కాజ‌ల్‌కు మాత్రం ద‌క్క‌లేదు. భ‌గ‌వంత్ కేస‌రిలో క‌థ‌లో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్ర‌లో క‌నిపించింది కాజ‌ల్‌.

ఆమె క్యారెక్ట‌ర్‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌చ్చాయి. భ‌గ‌వంత్ కేస‌రికి ముందు కాజ‌ల్ న‌టించిన తెలుగు, త‌మిళ సినిమాలు చాలా వ‌ర‌కు ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌తో మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇవ్వాల‌ని కాజ‌ల్ ఎదురుచూస్తోంది. స‌త్య‌భామ‌పైనే కాజ‌ల్ చాలా హోప్స్ పెట్టుకున్న‌ది. తెలుగులో మ‌రికొన్ని క‌థ‌లు వింటోంది కాజ‌ల్‌.

ఇండియ‌న్ 2లో...

త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఇండియ‌న్ 2లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో వృద్ధురాలిగా, యువ‌తిగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో కాజ‌ల్ క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇండియ‌న్ 2 షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ఈ సినిమాలో కాజ‌ల్‌తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇండియ‌న్ 2 ఎప్రిల్‌లో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner