Yatra 2 OTT Streaming: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్ మూవీ యాత్ర 2
12 April 2024, 7:54 IST
Yatra 2 OTT Streaming: ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది
యాత్ర 2 ఓటీటీ
Yatra 2 OTT Streaming: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ముందస్తుగా ఇటు అమెజాన్ ప్రైమ్‌గానీ, అటు సినిమా యూనిట్‌గానీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. సైలెంట్‌గా శుక్రవారం ఓటీటీలోకి తీసుకొచ్చారు.
తమిళ నటుడు జీవా...
ఈ పొలిటికల్ డ్రామా మూవీలో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించాడు. యాత్ర 2 మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. 2019లో విడుదలైన యాత్ర మూవీకి సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కింది. యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందగా...యాత్ర 2లో మాత్రం జగన్ రాజకీయ జీవితాన్ని దర్శకుడు చూపించాడు.
రెండు నెలల తర్వాత ఓటీటీ...
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం జగన్ సీఏంగా ఉండటం, యాత్ర సక్సెస్‌గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ జగన్ గురించి మీడియాలో ఉన్న, ప్రజలకు తెలిసిన కథనే చెప్పడంతో ఈ పొలిటికల్ డ్రామా మూవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. తాజాగా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ పొలిటికల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
పదేళ్ల రాజకీయ జీవితం...
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే అంశాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోదు.
రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక కన్నుమూసిన కార్యర్తల కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ చేసిన ఓదార్పుయాత్రను ప్రొగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంతో ప్రొగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటుచేసి ఎలా ప్రజల అభిమానాన్ని పొందాడు?
జగన్ రాజకీయ ఎదుగుదలకు అడ్డుకోవడానికి ప్రొగ్రెస్ పార్టీతో పాటు ప్రతి పక్షాలు అతడని అవినీతి కేసుల్లో ఎలా ఇరికించారు? ఆ అడ్డంకులను ఎదుర్కొన్ని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఏ విధంగా సీఏం అయ్యాడు అన్నది యాత్ర 2లో మహి వి రాఘవ్ చూపించాడు.
యాత్ర 2తో టాలీవుడ్ ఎంట్రీ...
జగన్ పాత్రలో జీవా బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రంగంతో పాటు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులుకు చేరువైన జీవా...యాత్ర 2 మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ పొలిటికల్ బయోపిక్‌లో చంద్రబాబు క్యారెక్టర్‌లో మహేష్ మంజ్రేకర్, వైఎస్ భారతిగా కేతకీ నారయణన్ కనిపించారు. సోనియా గాంధీ, కేవీపీ, కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేశాడు మహి వి రాఘవ్. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.