Save The Tigers 3 OTT: సేవ్ ది టైగర్స్ 3.. మరిన్ని సీజన్స్‌తో సినిమా కూడా.. కన్ఫర్మ్ చేసిన యాత్ర 2 డైరెక్టర్-director mahi v raghav about save the tigers 3 ott in save the tigers 2 preview event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Mahi V Raghav About Save The Tigers 3 Ott In Save The Tigers 2 Preview Event

Save The Tigers 3 OTT: సేవ్ ది టైగర్స్ 3.. మరిన్ని సీజన్స్‌తో సినిమా కూడా.. కన్ఫర్మ్ చేసిన యాత్ర 2 డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Mar 11, 2024 03:34 PM IST

Save The Tigers 2 Preview Event: సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్‌గా సక్సెస్ అయిన సేవ్ ది టైగర్స్ సిరీస్ మూడో సీజన్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా సేవ్ ది టైగర్స్ 2 ప్రివ్యూ ఈవెంట్‌లో మరిన్ని సీజన్స్‌పై క్రియేటర్, యాత్ర 2 డైరెక్టర్ మహి వి రాఘవ్ క్లారిటీ ఇచ్చారు.

సేవ్ ది టైగర్స్ 3..  మరిన్ని సీజన్స్‌తో సినిమా కూడా.. కన్ఫర్మ్ చేసిన యాత్ర 2 డైరెక్టర్
సేవ్ ది టైగర్స్ 3.. మరిన్ని సీజన్స్‌తో సినిమా కూడా.. కన్ఫర్మ్ చేసిన యాత్ర 2 డైరెక్టర్

Save The Tigers Season 3: సూపర్ హిట్ వెబ్ సిరీస్ "సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. యాత్ర, యాత్ర 2 డైరెక్టర్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ మార్చి 11న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మహీ వి రాఘవ్ మాట్లాడుతూ - "సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ విషయంలో ముందుగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగానే సీజన్ 2 కూడా అనుకుని ఓకే చేయించుకున్న ఫస్ట్ సిరీస్ ఇదే అనుకుంటా. ఇలాంటి ఫన్ ఎంటర్ టైనింగ్ షోస్‌లో రైటింగ్ కంటే ఆర్టిస్టుల పర్ఫామెన్స్ చాలా ముఖ్యం. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత వంటి యాక్టర్స్ అంతా ఈ కథని ఓన్ చేసుకుని నటించారు" అని అన్నారు.

"మేము ఎడిటింగ్ టైమ్‌లో చూసినప్పుడు, ఇప్పుడు మీ మధ్య సిరీస్ చూసినప్పుడు రెస్పాన్స్‌లో వేరియేషన్ చూశాం. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్ గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సీజన్ 1 చేసిన ప్రదీప్ కు, ఇప్పుడు సీజన్ 2కు డైరెక్షన్ చేసిన అరుణ్ కు థ్యాంక్స్. ఈ సెకండ్ సీజన్ కూడా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేవ్ ద టైగర్స్ లో మరిన్ని సీజన్స్ చేయాలనే ఆలోచన ఉంది" అని మహి వి రాఘవ్ తెలిపారు.

"నాలుగైదు సీజన్స్ తర్వాత ఇందులో బాగా వర్కవుట్ అయిన క్యారెక్టర్స్‌ను తీసుకుని సినిమా కూడా చేసుకోవచ్చు" అని మహి వి రాఘవ్ పేర్కొన్నారు. "సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ సీజన్ కోసం హాట్ స్టార్‌ను అప్రోచ్ అయ్యాం. అయితే ఫస్ట్ సీజన్‌ను మరిపించేలా సెకండ్ సీజన్ చేయగలమా లేదా అనే టెన్షన్ ఆ టైమ్‌లో మాలో ఉండేది. క్రియేటివ్ ఫ్రీడమ్ మొత్తం హాట్ స్టార్ వాళ్లు మాకే వదిలిపెట్టారు. మేము మా శక్తిమేరకు ప్రయత్నించి, మంచి సిరీస్ చేశామనే భావిస్తున్నాం. మీ అందరికీ సేవ్ ద టైగర్స్ 2 నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని ప్రదీప్ అద్వైతం తెలిపారు.

"సేవ్ ద టైగర్స్ సీజన్ 1 అంత పెద్ద హిట్ అయిన తర్వాత సీజన్ 2కు డైరెక్షన్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు. అందుకు మహీ గారికి , హాట్ స్టార్, ప్రదీప్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ఫస్ట్ సీజన్ కంటే బాగా రావాలని మా టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రతి సీన్ కూడా జాగ్రత్తగా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ సీజన్‌ను ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూశారు. ఇప్పుడు సీజన్ 2కు ఎక్స్ పెక్టేషన్స్‌తో చూసినా మీకు నచ్చుతుంది" అని డైరెక్టర్ అరుణ్ కొత్తపల్లి చెప్పుకొచ్చాడు.

WhatsApp channel