Save The Tigers 2 Trailer: వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా!-save the tigers 2 trailer release save the tigers season 2 ott streaming on disney plus hotstar from march 15 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Save The Tigers 2 Trailer: వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా!

Save The Tigers 2 Trailer: వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా!

Sanjiv Kumar HT Telugu
Mar 02, 2024 11:37 AM IST

Save The Tigers 2 Season Trailer Out: ఓటీటీలో ఎంతో సూపర్ హిట్ అయిన కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు సేవ్ ద టైగర్స్ 2 వచ్చేస్తోంది. తాజాగా సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ విశేషాల్లోకి వెళితే..

వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా!
వచ్చేసిన సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా!

Save The Tigers 2 Trailer: ప్రముఖ ఓటీటీ సంస్థ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, సిరీసులు అందిస్తుంటుంది. డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అలా గతేడాది ఫ్యామిలీ ప్రేక్షకులను అందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో గత సంవత్సరం ఏప్రిల్‌లో ఆరు ఎపిసోడ్స్‌గా వంచి విజయం సాధించింది. అలాగే ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది.

yearly horoscope entry point

సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీసులో కమెడిన్ అభినవ్ గోమఠం, హీరో అండ్ యాక్టర్ చైతన్య కృష్ణ, ప్రియదర్శి, పావని, జోర్దార్ సుజాత, దేవయాని మూడు జంటలుగా కనిపించి వినోదం పండించారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా సేవ్ ద టైగర్స్ 2 సీజన్ రానుంది. తాజాగా సేవ్ ద టైగర్స్ 2 సీజన్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మొదటి సీజన్ లానే రెండో సీజన్ కూడా చాలా నవ్వించనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మొదటి సీజన్ ఎక్కడితో ముగిసిందో దాన్ని గుర్తు చేస్తూ పోలీసుల దగ్గర ఇంట్రాగేషన్‌తో సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ ప్రారంభం అయింది. అభినవ్, చైతన్య, ప్రియదర్శిలను లాకప్‌లో పోలీసులు చితక్కొడతారు. తర్వాత ఇప్పుడు చెప్పండ్రా హంస లేఖ ఏడ అని పోలీస్ అడుగుతాడు. దాంతో ఫస్ట్ సీజన్‌లో జరిగింది గుర్తు చేసుకున్న ప్రియదర్శి నాకు యాదికి వచ్చింది అని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ చేశారు. తర్వాత మొదటి సీజన్ తరహాలోనే మందు సిట్టింగ్స్ చర్చలతో సాగింది.

సేవ్ ద టైగర్స్ 2 సీజన్‌లో ముగ్గురు భర్తలు మారిపోయినట్లుగా చూపించారు. మరి అమాయకంగా నటిస్తూ చైతన్య కనిపించాడు. ఇక ఆఫీస్ అని చెప్పి బాగా రెడీ రూమ్‌లోకి వెళ్తాడు అభినవ్. అదే తన ఆఫీస్ అంటాడు. తర్వాత జోర్దార్ సుజాత బయట పబ్‌లో ఎంజాయ్ చేస్తుంటే.. తన కొడుకు పాలకు తన బనియన్‌ లాగుతున్నాడు అని ప్రియదర్శి చెప్పడం నవ్వించేలా ఉంది. ఇక 7 ఇయర్స్ ఇచ్చింగ్ అంటూ భర్తలు అఫైర్స్ పెట్టుకుంటారంటూ కొత్త ట్రాక్ ఎక్కించారు.

ఈ ట్రాక్‌తో సేవ్ ద టైగర్స్ 2 సీజన్‌లోకి బ్యూటిఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అంటే ఈ ఇందులో సీరత్ కపూర్ కూడా నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఆడోళ్ల డామినేషన్‌ను కంట్రోల్‌లో పెట్టేది ఏదైనా కనిపెట్టన్న అని ప్రియదర్శి అంటే.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా అని చైతన్య అనడంతో ట్రైలర్ ముగుస్తుంది. ఇలా ఆద్యంతం కామెడీతో ఇంట్రెస్టింగ్‌గా మరోసారి కుటుంబ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వేంచేందుకు సేవ్ ద టైగర్స్ 2 సీజన్ రెడీ అయిందని తెలుస్తోంది.

సేవ్ ద టైగర్స్ 2 సీజన్‌కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించగా మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతమ్ క్రియేటర్స్‌గా ఉన్నారు. అజయ్ అరసాడ మ్యూజిక్ అందించారు. ఇందులో ఫస్ట్ సీజన్ పాత్రలతోపాటు సీరత్ కపూర్, ముక్కు అవినాష్, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్నారు. ఇక సేవ్ ద టైగర్స్ 2 సీజన్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే తేజ కాకుమాను దర్శకత్వం సేవ్ ది టైగర్స్ ఫస్ట్ సీజన్‌ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 రాబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్‌ను ఇటీవల ప్రకటించింది.

Whats_app_banner