Jyothika Amma Vadi: తెలుగులోకి వస్తోన్న జ్యోతిక తమిళ సూపర్ హిట్‌మూవీ - ట్రైలర్‌లో ముఖ్యమంత్రి జగన్‌పై డైలాగ్స్
Jyothika Telugu Movie: జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ రాక్షసి త్వరలో అమ్మ ఒడి పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమ్మ ఒడి ట్రైలర్‌ను సోమవారం రిలీజ్‌చేశారు.
Jyothika Telugu Movie: జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ రాక్షసి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్ తో అమ్మ ఒడి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి
ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు తమిళంలో ఈ మూవీని నిర్మించారు. తెలుగులో ఈ మూవీని వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి రిలీజ్ చేస్తోన్నారు.
అమ్మ ఒడి ట్రైలర్...
సోమవారం అమ్మ ఒడి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మెసేజ్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ గా జ్యోతిగా పవర్‌ఫుల్ రోల్‌లో నటించింది. ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరించి పేద ప్రజలకు విద్యను అందించేందుకు పాటుపడే మహిళగా జ్యోతిక కనిపించింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారి పట్ల ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తోంది. వెన్నుపోటు పొడిచేవాళ్లు ఎక్కడున్నా ప్రమాదమే. అది పక్కనుండి వెన్నుపోటుపొడిచేవాళ్లు ఇంకా ప్రమాదకరం అంటూ జ్యోతిక చెబుతున్న డైలాగ్స్ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
జగన్ మావయ్య....
పదహారు నెలలు, ఎన్ని విధాలుగా ముప్పు తిప్పలు పెట్టినా అన్ని ఎదుర్కొని ఆశయం వైపు అడుగులు వేశాడు. అనుకున్నది సాధించాడు. పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన ఎవరో తెలుసుగా అంటూ చిన్నపిల్లలను జ్యోతిక అడగటం...వారు జగన్ మావయ్య అంటూ సమాధానం చెప్పడం ఆసక్తిని పంచుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలను అమ్మ ఒడి సినిమాలో టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమ్మ ఒడి సినిమాలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.
త్వరలో రిలీజ్ డేట్...
తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకముందని తెలుగు నిర్మాతలు తెలిపారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఆలోచనాత్మకంగా దర్శకుడు గౌతమ్ రాజ్ ఈ సినిమాలో చూపించారని అన్నారు. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాంమని చెప్పారు.
కాథల్‌తో రీఎంట్రీ...
ఒకప్పుడు తమిళంలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నది జ్యోతిక. సూర్యతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక ఇటీవలే మలయాళ చిత్రం కాథల్ ది కోర్‌తో రీఎంట్రీ ఇచ్చింది. మమ్ముట్టి హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ మలయాళంలో 50 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
కాథల్ తర్వాత హిందీలో మూడు సినిమాలకు జ్యోతిక రీఎంట్రీ ఇచ్చింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన హిందీ మూవీ సైతాన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో మాధవన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సైతాన్‌తో పాటు హిందీలో శ్రీ, డబ్బా కార్టెల్ అనే సినిమాలు చేస్తోంది జ్యోతిక. తెలుగులో ఆమె ఓ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.