తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Heroines: ఈ ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్లే - ఫ్లాప్ మూవీ బ్యూటీల‌కే క్రేజ్ ఎక్కువ‌!

Tollywood Heroines: ఈ ఏడాది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్లే - ఫ్లాప్ మూవీ బ్యూటీల‌కే క్రేజ్ ఎక్కువ‌!

17 December 2024, 14:21 IST

google News
  • Tollywood Heroines: ఈ ఏడాది హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లువురు ముద్దుగుమ్మ‌లు హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా ప‌దుకోణ్, జాన్వీక‌పూర్ మాత్ర‌మే విజ‌యాలు ద‌క్కాయి. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రిజ‌ల్ట్‌తో భాగ్య‌శ్రీ బోర్సే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది

టాలీవుడ్ హీరోయిన్లు
టాలీవుడ్ హీరోయిన్లు

టాలీవుడ్ హీరోయిన్లు

Tollywood Heroines: టాలీవుడ్‌లోకి ప్ర‌తి ఏటా ప‌దుల సంఖ్య‌లో హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వ‌డం కామ‌న్‌గా క‌నిపిస్తుంది. 2024లో బాలీవుడ్‌తో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లువురు ముద్దుగుమ్మ‌లు తెలుగులో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఈ హీరోయిన్ల‌లో ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వారంద‌రికి చేదు ఫ‌లిత‌మే ఎదురైంది. సినిమాలు డిజాస్ట‌ర్ అయినా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా కొంద‌రు హీరోయిన్లు ఎన‌లేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ‌లు ఎవ‌రంటే?

దీపికా ప‌దుకోణ్...జాన్వీక‌పూర్‌

బాలీవుడ్ అంద‌గ‌త్తెలు దీపికా ప‌దుకోణ్‌, జాన్వీక‌పూర్ ఈ ఏడాది తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌మ తొలి అడుగు వేశారు. క‌ల్కి మూవీతో దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా...దేవ‌ర‌తో జాన్వీక‌పూర్ తెలుగుసినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ ఇద్ద‌రు ఫ‌స్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. క‌ల్కి మూవీలో సుమ‌తి అనే యువ‌తిగా క‌మ‌ర్షియ‌ల్ కోణానికి భిన్న‌మైన పాత్ర‌లో దీపికా ప‌దుకోణ్ క‌నిపించింది. ఈ మూవీ క‌థ మొత్తం ఆమె క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగా సాగ‌డం గ‌మ‌నార్హం. క‌ల్కి సీక్వెల్‌లోనూ దీపికా న‌టిస్తోంది.

గ్లామ‌ర్‌తో...

మ‌రోవైపు ఎన్టీఆర్ దేవ‌రతో త‌న గ్లామ‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచుకుంది జాన్వీక‌పూర్‌. ఈ సినిమాలో పాట‌లు, కొన్ని సీన్స్‌లోనే జాన్వీ క‌నిపించింది. త‌క్కువ స్క్రీన్ టైమ్ ద‌క్కినా అందాల‌తో అద‌ర‌గొట్టింది. ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తే జాన్వీ పేరు తెలుగులో మారుమ్రోగిపోయి ఉండేద‌ని అభిమానులు చెబుతోన్నారు. ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేస్తోంది జాన్వీక‌పూర్‌.

సినిమాలు ఫెయిల్ కానీ...

ఈ ఏడాది రిజ‌ల్ట్‌తో సంభందం లేకుండా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది భాగ్య‌శ్రీ బోర్సే. ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో త‌న అందాల ఆర‌బోత‌తో అద‌ర‌గొట్టింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన భాగ్య‌శ్రీ బోర్సేకు తెలుగులో ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. రామ్ పోతినేని, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో సినిమాలు చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి ఈ మూవీలో భాగ్య శ్రీ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పెద్ద సినిమాల్లో...

నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో సాండ‌ల్‌వుడ్ సుంద‌రి రుక్మిణి వ‌సంత్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ మూవీ ఫ్లాప్ అయినా ప్ర‌స్తుతం ప‌లు భారీ బ‌డ్జెట్ మూవీస్‌ల‌లో రుక్మిణి వ‌సంత్ పేరు వినిపిస్తోంది.

రెండు స‌క్సెస్‌లు...

2024 న‌య‌న్ సారిక‌కు బాగా క‌లిసివ‌చ్చింది. అడుగుపెట్టిన తొలి ఏడాదే రెండు స‌క్సెస్‌ల‌ను అందుకున్న‌ది. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించిన ఆయ్‌, క సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాల కంటే ముందు వ‌చ్చిన ఆనంద్ దేవ‌ర‌కొండ గ‌మ్ గ‌మ్ గ‌ణేషానే తెలుగులో న‌య‌న్ సారిక ఫ‌స్ట్ మూవీ.

మానుషి చిల్లార్‌...సిరి లెల్లా...

మానుషి చిల్లార్ (ఆప‌రేష‌న్ వాలెంటైన్‌), అథిరా రాజ్ (కృష్ణ‌మ్మ‌), సిరి లెల్లా (ప్ర‌తినిధి 2), త‌న్వీ రామ్ (క‌) తో పాటు మ‌రొకొంద‌రు ముద్దుగుమ్మ‌లు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.

తదుపరి వ్యాసం