Web Series: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న జబర్ధస్థ్ కమెడియన్ - రాజ్‌తరుణ్‌తో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
05 November 2024, 14:36 IST
Web Series: జబర్ధస్థ్ కమెడియన్ అదిరే అభి డైరెక్టర్ ఎంట్రీ ఇస్తోన్నాడు. చిరంజీవ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తోన్నాడు. రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది.
చిరంజీవ వెబ్ సిరీస్
Web Series: జబర్ధస్థ్ కమెడియన్లుగా ఒక్కొక్కరుగా డైరెక్టర్లుగా మారుతోన్నారు. బలగం మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు ఎల్దండి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. రామం రాఘవం మూవీతో మరో జబర్ధస్థ్ కంటెస్టెంట్ ధన్‌రాజ్ కూడా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. వీరి బాటలోనే మరో జబర్ధస్థ్ కమెడియన్ అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి కూడా అడుగులు వేయబోతున్నాడు. సినిమాతో కాకుండా వెబ్‌సిరీస్ ద్వారా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
టైటిల్ ఇదే...
మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు చిరంజీవ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో రాజ్ తరుణ్ లీడ్ రోల్ చేయబోతున్నాడు. చిరంజీవ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ వెబ్‌సిరీస్‌కు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తోన్నాడు. రాహుల్ యాదవ్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
డిసెంబర్‌లో రిలీజ్...
చిరంజీవ వెబ్‌సిరీస్‌ను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ఆహా ఓటీటీ సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో రాజ్ తరుణ్‌తో పాటు పలువురు ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్‌లు కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. గతంలో తెలుగులో వచ్చిన వెబ్‌సిరీస్‌లకు పూర్తి భిన్నమైన కథ, కథనాలతో చిరంజీవ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
అహ నా పెళ్లంట
తెలుగులో రాజ్ తరుణ్ నటిస్తోన్న సెకండ్ వెబ్ సిరీస్ ఇది. గతంలో అహ నా పెళ్లంట పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. సంజీవ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజైంది.
మూడు సినిమాలు...
మరోవైపు సినిమాల పరంగా రాజ్ తరుణ్ సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. కానీ అవకాశాలు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ వరిస్తున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు, తిరగబడరా సామీతో పాటు భలే ఉన్నాడే సినిమాలు నెల రోజుల గ్యాప్‌లో ఇటీవలే థియేటర్లలో రిలీజయ్యాయి.
ఈ మూడు సినిమాల్లో భలే ఉన్నాడే మోస్తారు వసూళ్లను సాధించగా...మిగిలిన రెండు మూవీస్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రామ్ భజరంగ్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు.
ఈశ్వర్‌తో ఎంట్రీ...
మరోవైపు ప్రభాస్ ఈశ్వర్ మూవీతో కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిరే అభి. ఈగ, బాహుబలి రాగల ఇరవై నాలుగు గంటల్లోతో పాటు మరికొన్ని కమెడియన్‌గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా కనిపించాడు. హీరోగా క్షణక్షణం, పాయింట్ బ్లాక్ వంటి చిన్న సినిమాలు చేశాడు. జబర్ధస్థ్ కామెడీ షోలో కంటెస్టెంట్‌గా చాలా కాలం పాటు కొనసాగాడు. టీమ్ లీడర్‌గా కూడా పనిచేశాడు.