OTT Malayalam Comedy Drama: ఓటీటీలోకి పది నెలల తర్వాత వస్తున్న మలయాళం కామెడీ మూవీ.. ఐదుగురి అమ్మాయిలతో రొమాన్స్
OTT Malayalam Comedy Drama: ఓటీటీలోకి ఓ మలయాళ కామెడీ డ్రామా పది నెలల తర్వాత వచ్చింది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన ఈ మూవీలో దేవర నటుడు షైన్ టామ్ చాకో నటించాడు. అతనికి ఇది 100వ సినిమా కావడం విశేషం.
OTT Malayalam Comedy Drama: మలయాళ ఇండస్ట్రీలో నుంచి వచ్చిన మరో కామెడీ డ్రామా మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. మంగళవారం (నవంబర్ 5) నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది జనవరి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మొత్తానికి సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.
అయితే ఈ మూవీ అతనికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడంతోపాటు ఐఎండీబీలోనూ దారుణమైన 3.3 రేటింగ్ వచ్చింది. ఐదుగురు అమ్మాయిలతో ఓ వ్యక్తి చేసే రొమాన్స్ చుట్టూ తిరిగే కథే ఈ వివేకానందన్ విరళను మూవీ.
వివేకానందన్ విరళను ఎలా ఉందంటే?
వివేకానందన్ విరళను మూవీ వివేకానందన్ (షైన్ టామ్ చాకో) అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. ఊళ్లో భార్య, తాను పనిచేసే చోట మరో అమ్మాయితో కాపురం చేస్తుంటాడు. అమ్మాయిలంటే పడిచచ్చే అతడు ఈ ఇద్దరితోనే కాకుండా మరో ముగ్గురితోనూ రొమాన్స్ చేస్తుంటాడు.
ఒక రోజు అతనికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటకు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అతనికి బుద్ది చెప్పడానికి ఆ ఐదుగురు మహిళలు కలిసి ఓ ప్లాన్ వేస్తారు. అది ఏంటి? వివేకానందన్ జీవితం ఏం కాబోతోంది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తోనే వచ్చినా డైరెక్టర్ కమల్ దానిని ప్రెజెంట్ చేయడంలో విఫలమైనట్లు మూవీ రిలీజ్ సమయంలోనే రివ్యూలు వచ్చాయి. దీంతో వివేకానందన్ విరళను మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు ఓటీటీలో ఎంతమేర ఈ సినిమాకు ఆదరణ దక్కుతుందన్నది చూడాలి.