Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌పై పోలీస్ కేసు - ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువ‌తి ఫిర్యాదు!-police complaint filed against tollywood hero raj tarun by his ex lover lavanya tollywood news malvi malhotra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌పై పోలీస్ కేసు - ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువ‌తి ఫిర్యాదు!

Raj Tarun: హీరో రాజ్ త‌రుణ్‌పై పోలీస్ కేసు - ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువ‌తి ఫిర్యాదు!

Nelki Naresh Kumar HT Telugu
Jul 05, 2024 01:30 PM IST

Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ త‌రుణ్ నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ప్రేమ పేరుతో హీరో రాజ్ త‌రుణ్ త‌న‌ను న‌మ్మించి మోసం చేశాడ‌ని లావ‌ణ్య అనే యువ‌తి పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది.

 రాజ్ త‌రుణ్
రాజ్ త‌రుణ్

Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్‌త‌రుణ్‌పై లావ‌ణ్య అనే యువ‌తి పోలీసు కేసు పెట్టింది. ప్రేమ పేరుతో రాజ్ త‌రుణ్ త‌న‌ను న‌మ్మించి మోసం చేశాడ‌ని నార్సింగి పోలీసుల‌ను లావ‌ణ్య ఆశ్ర‌యించింది. మ‌రో సినిమా హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్న రాజ్ త‌రుణ్ త‌న‌ను దూరం పెడుతోన్నాడ‌ని, త‌న ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌డం లేద‌ని లావ‌ణ్య త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు తెలిసింది.

ప‌ద‌కొండేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాం...

రాజ్ త‌రుణ్‌తో తాను ప‌ద‌కొండు ఏళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు, ర‌హ‌స్యంగా గుడిలో తామిద్ద‌రం పెళ్లిచేసుకుంటున్న‌ట్లు లావ‌ణ్య ఆరోపించింది. అంద‌రి ముందు త‌న‌ను పెళ్లిచేసుకోమంటే ఇప్పుడు రాజ్ త‌రుణ్ ముఖం చాటేసి త‌ప్పించుకుతిరుగుతున్నాడ‌ని, త‌న ఫోన్ నంబ‌ర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన‌ట్లు లావ‌ణ్య తెలిపింది.

మ‌రో అమ్మాయితో ప్రేమ‌...

రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం మ‌రో హీరోయిన్‌లో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఆ హీరోయిన్ త‌న‌ను డ్ర‌గ్స్ కేసులో అక్ర‌మంగా ఇరికించి మూడు నెల‌ల పాటు జైలుకు వెళ్లేలా చేసింద‌ని లావ‌ణ్య త‌న కంప్లైంట్‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

త‌న‌ను రాజ్ త‌రుణ్ ప్రేమించ‌డ‌మే కాకుండా శారీర‌కంగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడ‌ని లావ‌ణ్య ఆరోపించిన‌ట్లు తెలిసింది. అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్‌త‌రుణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లిఖిత పూర్వ‌కంగా లావ‌ణ్య పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

తిర‌గ‌బ‌డ‌రా సామీ...

ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ తిర‌గ‌బ‌డ‌రా సామీ అనే సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమాలో మాల్వీ మ‌ల్హోత్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే మాల్వీ మ‌ల్హోత్రాతో రాజ్‌త‌రుణ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తోన్నాయి.మాల్వీ మ‌ల్హోత్రాతో రాజ్‌త‌రుణ్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఆమె కార‌ణంగానే లావ‌ణ్య కు రాజ్ త‌రుణ్ దూర‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తిర‌గ‌బ‌డ‌రా సామీ...

తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఏ ఏస్ ర‌వికుమార్ చౌద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమాలో మ‌న్నారా చోప్రా ఓ కీల‌క పాత్ర‌లో క నిపించ‌బోతున్న‌ది. ఇటీవ‌లే ఈ ట్రైల‌ర్ రిలీజైంది.

మూడు సినిమాలు...

ప్ర‌స్తుతం తెలుగులో తిర‌గ‌బ‌డ‌రా సామీతో పాటు భ‌లే ఉందిలే, పురుషోత్త‌ముడు సినిమాలు చేస్తోన్నాడు రాజ్ త‌రుణ్‌. ఈ మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన నాగార్జున నా సామిరంగ‌లో రాజ్ త‌రుణ్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. నా సామి రంగ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

WhatsApp channel