Rana Naidu Season 2: రానా నాయుడు 2 షూటింగ్‌తో వెంకటేష్ బిజీ - ఈ బోల్డ్ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ రిలీజ్ ఎప్పుడంటే?
Rana Naidu Season 2: వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముంబాయిలో జరుగుతోన్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో సీజన్ 2ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం.
Rana Naidu Season 2: టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బోల్డ్ యాక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో టాలీవుడ్ హీరో రానా మరో మెయిన్ లీడ్‌గా నటించాడు. గత ఏడాది మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇండియా వైడ్‌గా అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌లో ఒకటిగా రానా నాయుడు నిలిచింది.

ముంబాయిలో షూటింగ్...
రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది. ప్రస్తుతం సీజన్ 2 షూటింగ్‌తో వెంకటేష్, రానా బిజీగా ఉన్నారు. ముంబాయిలో వీరిద్దరిపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తోన్నట్లు సమాచారం. ఈ సిరీస్ షూటింగ్ కోసమే కొన్నాళ్లుగా వెంకటేష్, రానా ముంబాయిలోనే ఉంటున్నట్లు తెలిసింది. రానా నాయుడు సీజన్ 2 చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు.
జూలైలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సిరీస్‌కు గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో రానా నాయుడు సీజన్ 2ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇమేజ్ డ్యామేజ్...
రానా నాయుడు సీజన్ వన్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ కావడంపై విమర్శలొచ్చాయి. వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్‌ను రానా నాయుడు సిరీస్ కొంచెం డ్యామేజీ చేసింది. బోల్డ్ రోల్‌లో వెంకటేష్‌ను ఫ్యాన్స్ ఊహించుకోలేకపోయారు. సీజన్ వన్‌పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని సీజన్ 2లో బోల్డ్ కంటెంట్‌ను తగ్గించి యాక్షన్, ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
కొత్త క్యారెక్టర్స్....
రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్ 2కు కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సిరీస్‌లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషించారు. సీజన్ 2లో మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయని, ఈ పాత్రల్లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ నటీనటులు కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు.
రానా నాయుడు కథ ఇదే...
ముంబాయిలో సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య ఎదురైన పరిష్కరిస్తుంటాడు రానా నాయుడు( రానా). అతడికి తేజ్‌నాయుడు (సుశాంత్ సింగ్) జఫ్ఫానాయుడు (అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముళ్లు ఉంటారు.
రానా నాయుడికి భిన్నంగా వారి లైఫ్‌స్టైల్ ఉంటుంది. రానా నాయుడు తండ్రి నాగనాయుడు (వెంకటేష్) పదిహేనేళ్లు జైలు శిక్షను అనుభవించి విడుదలవుతాడు. తండ్రి జైలు నుంచి విడుదల కావడం రానా నాయుడుకు నచ్చదు. నాగానాయుడిని అనుక్షణం ద్వేషిస్తుంటాడు. చివరికి నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడడు. అందుకు గల కారణమేమిటి? నాగనాయుడును చేయని నేరానికి జైలుకు పంపించింది ఎవరు?
తండ్రీకొడుకుల పోరాటంలో ఎవరి పంతం నెగ్గింది? సూర్య (ఆశీష్ విద్యార్థి) అనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కారణంగా రానా నాయుడికి ఎదురైన సమస్యను నాగనాయుడు ఎలా పరిష్కరించాడు? ఆ గ్యాంగ్ స్టర్ బారి నుంచి తన కుటుంబాన్ని రానా నాయుడు ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సిరీస్ కథ.సీజన్ వన్ ఎండ్ అయిన దగ్గర నుంచే సీజన్ 2 ప్రారంభమవుతుందని సమచారం.
తమకు ఎదురైన మరో ఛాలెంజ్‌ను ఈ తండ్రీకొడుకులు కలిసి ఎలా ఎదుర్కొన్నారన్నదే సీజన్ 2లో యాక్షన్ అంశాలతో చూపించబోతున్నట్లు తెలిసింది.
సైంధవ్ తర్వాత అనిల్ రావిపూడితో...
ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వెంకటేష్. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాంతో తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లోనే వెంకటేష్ నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు. అనిల్ రావిపూడితో పాటు మరో కొత్త దర్శకుడితో వెంకటేష్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.