Aha Naa Pellanta Web Series: రాజ్‌తరుణ్, శివాని రాజశేఖర్ అహ నా పెళ్ళంట వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
Aha Naa Pellanta Web Series: అహ నా పెళ్ళంట పేరుతో కెరీర్‌లో తొలిసారి రాజ్‌తరుణ్, శివాని రాజశేఖర్ ఓ వెబ్‌సిరీస్ చేశారు. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే..

Aha Naa Pellanta Web Series: రాజ్‌తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన అహ నా పెళ్ళంట వెబ్‌సిరీస్ నవంబర్ 17 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో రొమాంటిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో శ్రీను అనే యువకుడిగా రాజ్‌తరుణ్ కనిపిస్తున్నాడు.
తండ్రి శ్రీనును క్రికెటర్‌ను చేయాలని కలలు కంటే అతడు మాత్రం ఫిజియోథెరఫిస్ట్‌గా సెటిల్ అవుతాడు. తండ్రి అదుపుఆజ్ఞల కారణంగా శ్రీను వచ్చే పెళ్లి సంబంధాలు మిస్ అవుతున్నట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. తనకు పూర్తిగా భిన్న మనస్తత్వం కలిగిన మోడ్రన్ అమ్మాయితో శ్రీను ప్రేమలో పడిటం ఆకట్టుకుంటోంది. చివరలో జై బాలయ్య అంటూ రాజ్‌తరుణ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.
రాజ్ తరుణ్ తన కామెడీ టైమింగ్‌తో ట్రైలర్‌లో ఆకట్టుకున్నాడు. ప్రేమ, ఫన్, లవ్, ఎమోషన్స్ అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ కెరీర్‌లో ఇదే తొలి వెబ్‌సిరీస్. హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య రాహుల్ నిర్మించారు. జుడా సాండీ సంగీతాన్ని అందించాడు.