Bigg Boss Avinash: అవినాష్ ప్లేస్‌లో స్టార్ మా షోలోకి ఎంట్రీ ఇచ్చిన జబర్ధస్థ్ కంటెస్టెంట్
Bigg Boss Avinash: అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ 8లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడంతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం టీవీ షోలో అతడి స్థానంలో నెక్స్ట్ వీక్ నుంచి జబర్ధస్థ్ ఇమాన్యుయేల్ కనిపించబోతున్నట్లు స్టార్ మా ప్రకటించింది.
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ..ప్రస్తుతం తెలుగు టీవీ షోస్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్ టూ ప్లేస్‌లో ఉంది. బిగ్‌బాస్ తర్వాత తెలుగులో పాపులర్ టీవీ షోగా కొనసాగుతోంది. ప్రతి ఆదివారం స్టార్ మా ఛానెల్‌లో స్టార్ మా పరివారం టెలికాస్ట్ అవుతుంటుంది. ఈ షోలో సీరియల్ స్టార్స్, బుల్లితెర ఆర్టిస్టులు ప్రతివారం తమ ఆట పాటలతో అభిమానులను అలరిస్తోంటారు.
శ్రీముఖి హోస్ట్...
ఈ కామెడీ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అవినాష్, రోహిణి, హరి ఈ షోలో కమెడియన్లుగా కనిపిస్తూ వచ్చారు. పెద పాలేరుగా అవినాష్ చేసే కామెడీ అదివారం స్టార్ మా పరివారం షోకు ఓ హైలైట్‌గా నిలుస్తూ వచ్చింది. షోకు గెస్ట్‌గా వచ్చిన టీవీ స్టార్స్‌పై పంచ్‌లు, ప్రాసలు అభిమానులను నవ్విస్తుంటాడు అవినాష్.
బిగ్‌బాస్ 8లోకి ఎంట్రీ...
అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇటీవలే బిగ్‌బాస్ 8 లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో అవినాష్ ప్లేస్‌లో పెద పాలేరుగా జబర్ధస్థ్ కమెడియన్ ఇమాన్యుయేల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇమాన్యుయేల్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్ధస్థ్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతోన్నాడు ఇమాన్యుయేల్. ఇస్మార్ట్ ఇమాన్యుయేల్ పేరుతో వర్ష అండ్ టీమ్‌తో కలిసి టీమ్‌ను నడిపిస్తోన్నాడు.
బిగ్‌బాస్ సీజన్ 8లో...
అవినాష్ కెరీర్ కూడా జబర్ధస్థ్‌తోనే మొదలైంది. చాలా కాలం పాటు జబర్ధస్థ్ కంటెస్టెంట్‌గా కొనసాగాడు. బిగ్‌బాస్ సీజన్ 4లో ఆఫర్ రావడంతో అర్ధాంతరంగా జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇందుకోసం అతడు జబర్ధస్ట్ మేకర్స్‌కు పది లక్షలు ఫైన్ కట్టినట్లు వార్తలు వినిపించాయి.
ఫైనల్ ముందు వారం...
బిగ్‌బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగిన అవినాష్ ఫైనల్‌కు ముందువారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ 8తో రెండోసారి ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు బిగ్‌బాస్ మేకర్స్ భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వారానికి తొమ్మిది లక్షల రెమ్యునరేషన్‌తో అతడు ఈ షోలో అడుగుపెట్టినట్లు చెబుతోన్నారు. తెలుగులో పటాస్, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు అవినాష్.
బిగ్‌బాస్ టాప్...
కాగా లేటెస్ట్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ 8 టాప్‌లో నిలిచింది. ఈ షో తర్వాత ఆదివారం స్టార్ మా పరివారం హయ్యెస్ట్ టీఆర్‌పీని దక్కించుకున్నది. తాజా రేటింగ్స్ లో బిగ్ బాస్ తెలుగు 8 వీకెండ్ షో 5.53 రేటింగ్ వచ్చింది. వీక్ డేస్‌లో 4.46 రేటింగ్‌ను బిగ్‌బాస్ సొంతం చేస్తున్నారు.ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లో 4.13తో సెకండ్ ప్లేస్‌ను దక్కించుకున్నది.