తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imdb Ratings: 2022లో టాప్‌ Imdb రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ ఇవే

IMDb Ratings: 2022లో టాప్‌ IMDb రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ ఇవే

Hari Prasad S HT Telugu

14 July 2022, 10:04 IST

    • IMDb Ratings: ఏ సినిమాలు చూడాలి.. ఏ వెబ్‌ సిరీస్‌ చూడాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDB) రేటింగ్స్‌ చాలా మంది చూస్తుంటారు. 2022లో ఇప్పటి వరకూ అలా టాప్‌ రేటింగ్స్‌ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ లిస్ట్‌ను ఐఎండీబీ రిలీజ్‌చేసింది.
IMDb రిలీజ్ చేసిన టాప్ రేటెడ్ మూవీస్
IMDb రిలీజ్ చేసిన టాప్ రేటెడ్ మూవీస్ (IMDb Twitter)

IMDb రిలీజ్ చేసిన టాప్ రేటెడ్ మూవీస్

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDb)లో రేటింగ్స్‌ బాగున్నాయి అంటే ఆ సినిమా లేదా వెబ్‌సిరీస్‌ చాలా మందికి నచ్చింది అని. ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ను చూసిన వాళ్లు ఈ ఐఎండీబీలో తమ రేటింగ్స్‌ ఇస్తుంటారు. ఐఎండీబీ రేటింగ్‌ సగటు పదికి 7 నుంచి 9 మధ్యలో ఉంది అంటే ఆ సినిమా లేదా వెబ్‌సిరీస్‌ హిట్‌ అన్నట్లే. ఓటీటీల్లో అయినా, థియేటర్లలో అయినా వీటిని చూడాలని అనుకునే వాళ్లు ఐఎండీబీ రేటింగ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Raj Tarun: చీర కట్టే వృత్తిలో రాజ్ తరుణ్.. ప్రభాస్ డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

అందుకే ప్రతి ఏటా అప్పుడప్పుడూ ఇలా టాప్‌ రేటింగ్స్ సాధించిన మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ లిస్ట్‌లను ఐఎండీబీ రిలీజ్‌ చేస్తుంది. తాజాగా బుధవారం (జులై 13) కూడా ఈ లిస్ట్‌ రిలీజైంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన టాప్‌ రేటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌, టాప్‌ రేటెడ్‌ ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి రెండు వేర్వేరు లిస్ట్‌లను రిలీజ్‌ చేశారు.

IMDb టాప్‌ 10 ఇండియన్‌ మూవీస్‌

విక్రమ్‌ : 8.8

కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2: 8.5

ది కశ్మీర్‌ ఫైల్స్‌: 8.3

హృదయం: 8.1

ఆర్‌ఆర్‌ఆర్‌: 8.0

ఎ థర్స్‌డే: 7.8

ఝుండ్‌: 7.4

సామ్రాట్‌ పృథ్వీరాజ్‌: 7.2

రన్‌వే 34: 7.2

గంగూబాయ్‌ కఠియావాడి: 7.0

IMDb టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌ ఇవే

క్యాంపస్‌ డైరీస్‌ (ఎంఎక్స్‌ ప్లేయర్‌): 9.0

రాకెట్‌ బాయ్స్‌ (సోనీ లివ్‌): 8.9

పంచాయత్‌ (ప్రైమ్‌ వీడియో): 8.9

హ్యూమన్‌ (హాట్‌స్టార్‌): 8.0

అపహరణ్‌ (ఎంఎక్స్‌ ప్లేయర్‌): 8.4

ఎస్కేప్‌ లైవ్‌ (హాట్‌స్టార్‌): 7.7

ది గ్రేట్ ఇండియన్‌ మర్డర్‌ (ప్రైమ్‌ వీడియో): 7.3

మాయి (నెట్‌ఫ్లిక్స్‌): 7.2

ద ఫేమ్‌ గేమ్‌ (నెట్‌ఫ్లిక్స్‌): 7.0

యే కాలీ కాలీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్‌): 7.0

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.