తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anushka Sharma Bodyguard : అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?

Anushka Sharma Bodyguard : అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?

Anand Sai HT Telugu

21 January 2023, 11:24 IST

    • Anushka Sharma and Virat Kohli Bodyguard : అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీగార్డ్ పేరు సోనూ. అతడు చాలా సంవత్సరాలుగా అనుష్క దగ్గరే పని చేస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే వారి జీతం కంటే.. అతడికే ఎక్కువ.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ(Anushka Sharma), క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) భారతదేశంలోనే ఫేమస్ జంట. వీళ్లకు ఓ బాడీగార్డ్ ఉన్నాడు. చాలా మంది ప్రముఖుల మాదిరిగానే.. కోహ్లీ, అనుష్క తమ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఫాలో అవుతారు. సెక్యురిటీ పరంగా కాస్త ఆలోచిస్తారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

బాలీవుడ్ స్టార్స్‌(Bollywood Stars)తో సహా సెలబ్రిటీలు పబ్లిక్ డొమైన్‌లో సురక్షితంగా ఉండేలా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడాన్ని పట్టించుకోరు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఇతర సెలబ్రిటీల మాదిరిగానే బాడీగార్డ్ ఉన్నారు. వీరి బాడీగార్డ్ పేరు సోనూ(Sonu). అతడు చాలా ఏళ్లుగా అనుష్క పక్కనే ఉన్నాడు. ఆమె దగ్గరే పని చేస్తున్నాడు. సోనూ అసలు పేరు ప్రకాష్ సింగ్. తన సేవలకుగానూ.. అనుష్క, కోహ్లీ నుండి భారీ జీతం అందుకుంటాడు.

విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా అనుష్క బాడీగార్డ్‌(Bodyguard)గానే సోను ఉన్నాడు. జూమ్.కామ్ ప్రకారం.. ప్రకాష్ సింగ్(సోనూ) వార్షిక వేతనం దాదాపు రూ. 1.2 కోట్లు. ఇది చాలా కంపెనీల CEOల CTC కంటే ఎక్కువ.

ఈ స్టార్ కపుల్ సోనూని బాడీగార్డ్ కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేస్తారట. అతడు కుటుంబంలో భాగమయ్యాడని కోహ్లీ, అనుష్క(Kohli Anushka) సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అనుష్క ప్రతి సంవత్సరం సోనూ పుట్టినరోజును జరుపుతుంది. గతంలో 'జీరో' సినిమా సెట్స్‌లో సోనూ పుట్టినరోజు జరిపిన ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో కోహ్లీ భద్రతను కూడా సోనూ చూసుకుంటాడు. అనుష్క గర్భంతో ఉన్నప్పుడు సోనూ ఆమెతోనే ఉండేవాడు. ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ముంబయిలో అడుగుపెట్టినప్పుడు లేదా విదేశాలకు వెళ్లినప్పుడు తమ భద్రతను చూసుకుంటాడు సోనూ. ఈ సూపర్ కపుల్ కు భారీ ఎత్తున ఫాలోయింగ్‌ ఉంది. వారి అభిమానులు ఫొటోలను తీసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. అలాంటప్పుడు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అనుష్క వ్యక్తిగత బాడీగార్డ్ సోను విరాట్‌కు కూడా వన్ మ్యాన్ ఆర్మీ.

సోనూకు అనుష్క భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తుంది. విరాట్‌తో పెళ్లికి ముందు కూడా అతను ఉన్నాడు. సోనూ వార్షిక వేతనం సుమారు రూ. 1.2 కోట్లు. అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్‌లలో ఇతను కూడా ఒకడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.