Guppedantha Manasu Serial: మరదలి ప్రేమను రిజెక్ట్ చేసిన రంగా - శైలేంద్ర తమ్ముడితో సరోజ పెళ్లి -వసు లైన్ క్లియర్
20 July 2024, 7:20 IST
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 20 ఎపిసోడ్ రంగాకు తప్ప తన మనసులో మరొకరికి చోటు లేదని తనను పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన ధన్‌రాజ్‌తో చెబుతుంది సరోజ. అయినా ఆమెను పెళ్లిచేసుకోవడానికి ధన్‌రాజ్ ఒప్పుకుంటాడు.
గుప్పెడంత మనసు సీరియల్ జూలై 20 ఎపిసోడ్
Guppedantha Manasu Serial: ధన్‌రాజ్ పెళ్లిచూపులకు శైలేంద్ర, దేవయాని కూడా వస్తారు. ఆ పెళ్లిచూపుల్లో రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి ఇద్దరు షాకవుతారు. రంగాను చూసి శైలేంద్ర వణికిపోతుంటాడు. మరోవైపు ధన్‌రాజ్‌తో పెళ్లిచూపులు ఇష్టం లేకపోవడంతో రంగాపై అతడి ముందే ప్రేమను కురిపిస్తుంది సరోజ. రంగాకు టీ ఇవ్వడానికి లేచి వెళ్లబోతుంది. సంజీవ ఆమెను కోపగించుకుంటాడు.
శైలేంద్ర చెమటలతో తడసిపోయి వణుకుతుండటం రంగా గమనిస్తాడు. ఏసీ వేసినట్లుగా అలా వణుకుతున్నారేమిటని శైలేంద్రను అడుగుతాడు. అతడు సమాధానం చెప్పకుండా తడబడిపోతాడు. కారులో ఏసీ ఎక్కువగా పెట్టుకొని వచ్చామని దేవయాని సమాధానం బదులిస్తుంది.. వాళ్లు రంగానే చూస్తూ ఉండిపోతారు.
వసుధార అనుమానం...
లోపలి నుంచి దేవయాని, శైలేంద్రల వాయిస్ వినిపించడంతో వాళ్లో... కాదో తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. కానీ వసుధారను ఇంట్లోకి రాకుండా సరోజ ఆపుతుంది. నువ్వు ఇంట్లోకి వచ్చి రంగాను నా భర్త అని అంటే ఊరుకునేది లేదని చెబుతుంది. అదే జరిగితే నేను చావడానికి కూడా వెనుకాడనని అంటుంది. సరోజను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వసుధార లోపలికి రాకుండా ఆగిపోతుంది.
ధన్‌రాజ్ ఆరాలు...
సరోజ, రంగా లవ్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు రాబట్టాలని ధన్‌రాజ్ ఫిక్సవుతాడు. సరోజ మీకు మరదలు కదా, మీ ఈడుజోడు బాగుంటుంది కదా ఆమెనుమీరే ఎందుకు పెళ్లిచేసుకోకూడదని రంగాను అడుగుతాడు ధన్‌రాజ్. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నా సరోజను పెళ్లిచేసుకోవాలనే ఉద్దేశం, ఆలోచన తనకు లేవని, తమ మధ్య బావమరదళ్ల బంధం తప్ప మరేది లేదని రంగా బదులిస్తాడు.
కానీ సరోజకు మీపై ఇష్టం ఉన్నట్లుగా కనిపిస్తుందని రంగాతో అంటాడు ధన్‌రాజ్. అలాంటిదేమీ లేదని, ఇప్పుడు కూడా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నాకు బావ అంటే ఇష్టం, బావ లేకుండా నేను ఉండలేను...చిన్నప్పటి నుంచి బావ కోసమే పెరిగానని సినిమా డైలాగ్‌లు చెబుతుంది చూడంటి అని దన్‌రాజ్‌తో అంటాడు రంరగా. ఆమె మాటలు నమ్మవద్దని చెబుతాడు.
రంగా చెప్పినట్లే...
వసుధార దగ్గర నుంచి ఇంటి లోపలికి వచ్చిన సరోజ...రంగా చెప్పినట్లే చెబుతుంది. రంగాకు తప్ప తన మనసులో మరొకరికి చోటు లేదని, ప్రతిక్షణం బావ గురించే ఆలోచిస్తుంటానని ధన్‌రాజ్‌తో అంటుంది సరోజ. ఆ మాటలు విని ధన్‌రాజ్ తనను రిజెక్ట్ చేస్తాడని సరోజ అనుకుంటుంది.
కానీ ధన్‌రాజ్ ఆమెకు ఊహించని షాకిస్తాడు. తనకు సరోజ అంటే ఇష్టమని సమాధానమిస్తాడు. తాను ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నానో అవన్నీ సరోజలో ఉన్నాయని అంటాడు. రంగా, సరోజల లవ్‌స్టోరీ అబద్ధం అని సంజీవ అంటాడు.. బుజ్జితో కూడా అదే మాట చెప్పించడంతో ధన్‌రాజ్ సంతోషపడతాడు. మరోవైపు దేవయాని, శైలేంద్ర మాత్రం రంగా ఇచ్చిన షాక్‌కు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు.
ఏంజెల్ అసహనం...
మను కాలేజీని వదిలిపెట్టడం పట్ల ఏంజెల్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. దేవయాని, శైలేంద్ర మాటలకు భయపడి కాలేజీ వదిలిపెడుతున్నావా అని మనును నిలదీస్తుంది. ఎవరికో భయపడి తాను దారి మార్చుకునే రకం కాదని మను అంటాడు. తానే మనును కాలేజీ వదిలిపెట్టమని చెప్పమనని అనుపమ చెబుతుంది. నువ్వు ఏవో భయాలను మనసులో పెట్టుకొని మను లైఫ్‌ను శాసిస్తున్నావని, ఎండీ కావాల్సిన అతడు ఇప్పుడు పదవి వదలుకోవాల్సివచ్చిందని అనుపమతో అంటుంది ఏంజెల్.
అమ్మ కోసం ఏదైనా చేస్తానని, ఆమె అడిగితే నా ప్రాణాలు అయినా ఇస్తానని మను అంటాడు. అమ్మ కంటే తనకు ఏ పదవి గొప్పది కాదని చెబుతాడు. మా కాలేజీలో జాయిన్ అవుతావా అని మనును అడుగుతుందిఏంజెల్. అమ్మను అడిగి చెబుతానని అంటాడు. ప్రతి టాపిక్‌లో అమ్మ ప్రస్తావనను మను తీసుకురావడంతో ఏంజెల్ అతడిపై సెటైర్లు వేస్తుంది. ప్రతి దానికి అమ్మను తీసుకొస్తావేంటి? ఏం చేయకుండా అమ్మ కొంగు పట్టుకొని తిరుగు అని మనుతో అంటుంది ఏంజెల్.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
అత్తయ్యను నువ్వుఅమ్మ అని పిలవవు కదా...మరిఈ రోజు ఏంటిఈ కొత్త పిలుపు అని మనును అడుగుతుంది ఏంజెల్. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని మను ఫిలాసఫికల్‌గా ఆన్సర్ ఇస్తాడు. జగతితో పాటు వసుధార, రిషి తనకు దూరం కావడంతో తాను ఒంటరివాడిని అయిపోయానని, నా జీవితమే ఎందుకిలా అయిపోయిందని ధరణితో తన బాధను చెప్పుకుంటాడు మహేంద్ర.
చనిపోవాలని ఉందని అంటాడు. రిషి బతికే ఉన్నాడని నాకు అనిపిస్తోందని, వసుధార నమ్మకం నిజం కావచ్చునని ధరణి అంటుంది. ఖచ్చితంగా రిషితోనే వసుధార తిరిగి వస్తుందని ధరణి అంటుంది.
పొగరు...మాట వినదు కదా...
వసుధారను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు రంగా. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడని, సరోజతో అతడి ఈడుజోడు ఎలా ఉందని రంగాను అడుగుతుంది. ఓ క్లారిటీ ఇవ్వడానికే తాను అక్కడికి వెళ్లానని, దాని గురించి తప్ప మిగిలిన విషయాలను పట్టించుకోలేదని రంగా అంటాడు. ఓ టీస్టాల్ కనిపించగానే ఆటోను ఆపమని వసుధార అంటుంది. రంగా వద్దన్న వినకుండా టీ తాగాల్సిందేనని పట్టుపడుతుంది. పొగరు మాట అస్సలు లెక్క చేయదు కదా అని లోలోన వసుధారను ఉద్దేశించి రంగా అనుకుంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.