Guppedantha Manasu Today Episode: వసుధార, రంగా రిలేషన్‌పై డౌట్ - సరోజ పంచాయితీ - మహేంద్ర ప్రాణాలకు ప్రమాదం
Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసు జూలై 8 ఎపిసోడ్‌లో తన కళ్ల ముందే వసుధారను సరోజ నానా మాటలు అనడం రంగా సహించలేకపోతాడు. వసుధార సమస్యతో నీకు సంబంధం లేదని, మా మధ్య జోక్యం చేసుకోవద్దని మరదలికి వార్నింగ్ ఇస్తాడు.
Guppedantha Manasu Today Episode: వసుధార మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చిందన్నది చెప్పాలని రంగా నానమ్మ రాధమ్మను నిలదీస్తాడు సరోజ తండ్రి సంజీవ. ఊళ్లో వాళ్లను పోగేసుకొని వచ్చి రంగా ఇంట్లో గొడవచేస్తాడు. వసుధార వెంట ఎవరో పోకిరి వెధవలు పడితే కాపాడి రంగా ఇంటికి తీసుకొచ్చాడటా అని సరోజ నిష్టూరంగా అంటుంది మన కుటుంబం అని సరోజ అనడంతో సంజీవ కూతురిపై కోప్పడుతాడు. వాళ్లు వేరు...మనం వేరు అని చెబుతాడు.
వసుధారను రంగా ప్రేమించాడా?
రంగా ...వసుధారను ఏమైనా ప్రేమించాడా అని ఊరివాళ్లు నిలదీస్తారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా రాధమ్మ సమాధానం చెప్పదు.ముక్కుమొహం తెలియనివాళ్లను ఇంట్లో పెట్టుకున్నారంటే ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారని అనుకోవాలని ఊరివాళ్లు రాధమ్మను ప్రశ్నిస్తారు. అప్పుడే అక్కడికి రంగా వస్తాడు. వసుధార కాపాడిన తర్వాత కూడా ఇంకా ఆమెను ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నావని ఊరి వాళ్లు అడుగుతున్నారని రంగాతో సరోజ అంటుంది.
చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు...
వసుధారకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టే బయటకు పంపించలేకపోతున్నారని ఊరి ప్రజలకు రంగా సమాధానమిస్తాడు. ప్రమాదం ఉంటే మీరెందుకు చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, ఊళ్లో ఎక్కడ చూసిన మీరిద్దరే ఎందుకు కనిపిస్తున్నారని సంజీవ అనుమానంగా రంగాను అడుగుతాడు.
గొడవ అటు తిరిగి...ఇటు తిరిగి సరోజ, రంగా పెళ్లి వరకు వస్తుంది. తన కూతురిని రంగాకు ఇచ్చి పెళ్లి చేసేది లేదని సంజీవ అంటాడు. రంగాకు ఆస్తిపాస్తులు ఏం లేవని, అప్పు ఎగ్గొట్టడానికే పెళ్లి డ్రామా ఆడుతున్నారని అందరి ముందు అవమానిస్తాడు. సరోజను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రంగా చెప్పబోతుంటాడు. అతడిని సరోజ అడ్డుకుంటుంది. వసుధార టాపిక్ తీసుకొస్తుంది.
టైమ్ చూసి పంపిస్తా...
నీకు ఊళ్లో మంచిపేరుందని, పెద్ద మనుషులు పంచాయితీ పెట్టకముందే వసుధారను ఇంట్లో నుంచి పంపించేయమని రంగాతో ఊరివాళ్లు చెబుతారు. టైమ్ చూసి తానే వసుధారను పంపిస్తానని, అప్పటివరకు గొడవ చేయద్దని రంగా వారికి బదులిస్తాడు. . వసుతో తన బంధంపై అనుమానాలు పెంచుకోవద్దని, తమ మధ్య ఏం లేదని ఊరివాళ్లకు మాటిస్తాడు రంగా. ఏదైనా తప్పు జరిగితే మీకంటే నేనే ముందు పంచాయితీలో నిలబడతానని రంగా అంటాడు.
ఎండీ సీట్ కోసం శైలేంద్ర ప్లాన్...
ఎండీ సీట్ కోసం మరో ప్లాన్ వేస్తారు దేవయాని, శైలేంద్ర. మహేంద్రను ఎలాగైనా తమ ఇంటికి తిరిగి తీసుకొచ్చేయాలని అనుకుంటారు. ఆ బాధ్యతను తల్లికి అప్పగిస్తాడు శైలేంద్ర.
బాబాయ్ ఇంటికి వస్తే అతడి ప్రతి కదలిక మనకు తెలుస్తుందని, మహేంద్ర రెచ్చిపోతే అతడిని రిషి, వసుధార దగ్గరకు పంపిస్తానని శైలేంద్ర అంటాడు. కొడుకు చెప్పినట్లే చేయాలని దేవయాని అనుకుంటుంది. నువ్వు ఎండీ సీట్‌లో కూర్చునే రోజు దగ్గరలోనే ఉందని కొడుకును చూసి దేవయాని సంబరపడుతుంది.
వసుధారపై నిందలు..
వసుధార వల్ల తమ కుటుంబం బజారున పడిందని, అందరూ మనల్నే వేలేత్తి చూపుతున్నారని రంగా నానమ్మ బాధపడుతుంది. వసుధార ఇంట్లో ఉంటే మనకు సమస్య అవుతుందని, ఆమె మనతో కలిసి ఉండటం కరెక్ట్ కాదని మనవడితో వాదిస్తుంది రాధమ్మ. వసుధారను పంపించడం నాకు ఇష్టం లేదని, భర్త కోసం ఆమె పడుతోన్న ఆరాటం ముచ్చటేస్తుందని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయాని, సమస్యపెద్దది కాకముందే ఆమెను ఇంట్లో నుంచి పంపించేయమని మనవడితో అంటుంది రాధమ్మ.
వసుధార ఎంట్రీ...
అప్పుడే అక్కడికి వసుధార వస్తుంది. తన వల్ల మీరు బాధపడొద్దని రంగాతో అంటుంది వసు. నీ వల్లే ఏ తప్పు చేయని మా బావ ఈ రోజు తలదించుకోవాల్సివచ్చిందని వసుధారతో సరోజ గొడవకు దిగుతుంది. సరోజను రంగా మందిస్లాడు. బయటివాళ్లు ఏదో అన్నారని వసుధారను నిందించడం కరెక్ట్ కాదని అంటాడు. వసుధారపై ఎందుకు కక్ష సాధించాలని చూస్తున్నానవి, నీ ధోరణి మార్చుకుంటే మంచిదని సరోజకు వార్నింగ్ ఇస్తాడురంగా.
మారిపోయిన రంగా...
మా బావను ఏ మందో పెట్టి నువ్వే మార్చేశావని, నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మా బావ మారిపోయాడని వసుధారతో గొడవపడుతుంది సరోజ. ఆమె మాటలను వసు తట్టుకోలేకపోతుంది.
పెళ్లి తర్వాత మనం ఎదుటివాళ్లతో మాటలు పడాలా? సరోజ నిందిస్తున్నా...బయటివాళ్లు మాటలు అంటోన్న మీ మనసు కరగడం లేదా? ఇంకా ఎన్నాళ్లు రంగాలా యాక్ట్ చేస్తారు? నా ప్రాణాలు పోయిన తర్వాత మీరు రంగా ఒప్పుకుంటారా అంటూ ఎమోషనల్ అవుతుంది వసుధార.
వసుధార యాక్టింగ్...
వసుధారది కన్నీళ్లను నటన అని సరోజ అంటుంది. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్‌కు కరిగిపోయేవారు ఎక్కడ ఎవరూ లేరని అంటుంది. సరోజ మాట్లాడుతోన్న మాటలను తన మనసుకే కష్టంగా అనిపించడంతో ఆమెపై రంగా కోప్పడుతాడు. మేడమ్‌ను బాధపెట్టేలా నువ్వు మాట్లాడితే నేను సహించలేనని అంటాడు.
తన వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి వసుధారపై కోప్పడుతున్నానని రంగాకు బదులిస్తుంది సరో. ఈ సమస్య మాది...మేము మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దని మరదలని హెచ్చరిస్తాడు రిషి. అయినా తాను జోక్యం చేసుకుంటూనే ఉంటానని సరోజ అనుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.