Guppedantha Manasu Serial: వ‌సుధార‌, మ‌ను రిలేష‌న్‌పై పుకార్లు - శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్ - బావ‌కు ఏంజెల్ ల‌వ్ ప్ర‌పోజ్‌-guppedantha manasu may 30th episode shailendra revenge plan fail on manu and vasudhara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: వ‌సుధార‌, మ‌ను రిలేష‌న్‌పై పుకార్లు - శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్ - బావ‌కు ఏంజెల్ ల‌వ్ ప్ర‌పోజ్‌

Guppedantha Manasu Serial: వ‌సుధార‌, మ‌ను రిలేష‌న్‌పై పుకార్లు - శైలేంద్ర ప్లాన్ రివ‌ర్స్ - బావ‌కు ఏంజెల్ ల‌వ్ ప్ర‌పోజ్‌

Nelki Naresh Kumar HT Telugu
May 30, 2024 07:24 AM IST

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార‌, మ‌నుల బంధంపై త‌ప్పుడు పుకార్లు క్రియేట్ చేసి వారిని కాలేజీ నుంచి పంపించాల‌ని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. కానీ శైలేంద్ర ప్లాన్‌ను ఏంజెల్ తిప్పికొడుతుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: ఏంజెల్ త‌న వెంట‌ప‌డుతుండ‌టం మ‌నుకు న‌చ్చ‌దు. అత్త‌య్య కొడుకు అని నువ్వు నాతో చ‌నువుగా ఉండ‌టం త‌ప్పు లేదు. కానీ త‌న జీవితంలో స‌ర‌దాలు, సంతోషాలు లేవ‌ని ఏంజెల్‌తో అంటాడు మ‌ను. క‌ష్టాలు, బాధ‌లు అంద‌రికి ఉంటాయి. వాటిని త‌ల్చుకుంటూ జీవితాంతం ఎవ‌రూ నీలా మూడీగా ఉండ‌ర‌ని మ‌నుకు రిప్లై ఇస్తుంది ఏంజెల్‌.

నేను ఎవ‌రికైతే ద‌గ్గ‌ర అవుతానో...వారితో విప‌రీతంగా గొడ‌వ ప‌డ‌తాను. వారు నాకు ప‌ర్మినెంట్‌గా దూర‌మ‌వుతారు. అది చాలా సార్లు రుజువు అయ్యింద‌ని మ‌ను చెబుతాడు. నేను నీకు దూర‌మ‌వుతున్నాన‌ని భ‌య‌ప‌డుతున్నావా...బాధ‌ప‌డుతున్నావా అని మ‌నును అడుగుతుంది ఏంజెల్‌.

ఏంజెల్ కామెడీ...

మీ అంద‌రి జీవితాలు వేరు..నా ప్ర‌పంచం వేర‌ని ఏంజెల్‌కు మ‌ను స‌మాధాన‌మిస్తాడు. మ‌ను ఎంత సీరియ‌స్‌గా మాట్లాడిన ఏంజెల్ మాత్రం అత‌డి మాట‌ల్ని కామెడీగా తీసుకుంటుంది. నీది భూ ప్ర‌పంచం కాదా...కొంప‌దీసి ఏలియ‌న్‌వా అని అడుగుతుంది.

మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న‌...

ఇవ‌న్నీ కాదు నా గురించి నీ మ‌న‌సులో ఏదైతే ఆలోచ‌న ఉందో అది తీసేయ‌మ‌ని ఏంజెల్‌కు చెబుతాడు మ‌ను. ఏ ఆలోచ‌న ఉంద‌ని నువ్వు అనుకుంటున్నావ‌ని మ‌నును తిరిగి ప్ర‌శ్నిస్తుంది ఏంజెల్‌. అస‌లు నా మీద నీకు ఏం ఆలోచ‌న ఉంది. నువ్వు ఏమైనా గ్రీకువీరుడివా...రాకుమారుడిన‌ని అనుకుంటున్నావా...అని ఏంజెల్ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు న‌టిస్తుంది.

నా గురించి నేను ఏమ‌నుకున్నా ప‌ర్వాలేదు. నువ్వు ఏదైనా అనుకుంటేనే స‌మ‌స్య అని మ‌ను అంటాడు. మ‌న ప‌రిచ‌యాన్ని..ప‌రిచ‌యంగానే ఉంచు. అంతేగానీ ఆ ప‌రిచ‌యాన్ని రిలేష‌న్‌గా...బంధంగా మార్చ‌డానికి ప్ర‌య‌త్నించ‌కు అని సీరియ‌స్‌గా ఏంజెల్‌తో చెబుతాడు మ‌ను.

న‌న్ను మార్చొద్దు...

నేను ఇంట్రోవ‌ర్ట్ అని న‌న్ను మార్చ‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని ఏంజెల్‌కు చెబుతాడు మ‌ను. ఇలాంటి హిత‌బోధ‌లే రిషి కూడా చాలా చేశాడ‌ని మ‌ను మాట‌ల్ని ఏంజెల్ తేలిగ్గా తీసుకుంటుంది. కోపం నీ చుట్టూ వైఫ్‌లా తిరుగుతున్నా...పాస్‌వ‌ర్డ్ తెలుసుకొని నేను నీ జీవితంలోకి ఎంట‌ర‌వుతా...నువ్వు ఎంత సీరియ‌స్ అయినా నా మ‌న‌సు, ఆలోచ‌న..పంతం మార‌ద‌ని మ‌నుకు క్లారిటీ ఇస్తుంది ఏంజెల్‌. పోరా అరేయ్ అంటూ మ‌నును పిలిచి ఆట‌ప‌ట్టిస్తుంది. త‌న‌ను ఏంజెల్ అరేయ్ అన‌డంతో మ‌ను షాక‌వుతాడు. బావ అంటే వ‌ద్ద‌న్నావుగా...అందుకే రా అని పిలుస్తున్నాన‌ని అంటుంది.

శైలేంద్ర ప్ర‌తీకారం...

త‌న‌ను మోసం చేసిన వ‌సుధార‌, మ‌నుల‌ను దెబ్బ‌కొట్టాల‌ని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. ఈ సారి తాను వేసిన ప్లాన్‌కు అంద‌రూ కాలేజీ వ‌దిలిపెట్టి వెళ్లిపోవాల‌ని అనుకుంటాడు. ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. కాలేజీలో వ‌ర్క్ చేస్తోన్న వ‌సుధార‌...రిషి గుర్తొచ్చి ఎమోష‌న‌ల్ అవుతుంది. మిమ్మ‌ల్ని నేను చాలా మిస్స‌వుతున్నా...త్వ‌ర‌గా రండి రిషి సార్ అని మ‌న‌సులో అనుకుంటుంది.

స్టోర్ రూమ్‌లో గొడ‌వ‌...

ఇంత‌లో వ‌సుధార‌కు ఫోన్ వ‌స్తుంది. స్టోర్ రూమ్ ద‌గ్గ‌ర స్టూడెంట్స్ గొడ‌వ‌ప‌డుతున్నార‌ని అవ‌త‌లి వ్య‌క్తి చెబుతాడు. కంగారుగా వ‌సుధార స్టోర్ రూమ్‌కు వ‌స్తుంది అక్క‌డ ఎవ‌రూ ఉండ‌రు.

ముఖంపై మాస్క్ వేసుకున్న ఓ వ్య‌క్తి వ‌సుధార‌పై మ‌త్తు మందు స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తాను ట్ర‌బుల్‌లో ఉన్న‌ట్లు వ‌సుధార ఫోన్ ద్వారా మ‌నుకు మెసేజ్ పంపిస్తాడు. అది చూసి కంగారుగా మ‌ను కూడా స్టోర్ రూమ్‌లోకి వ‌స్తాడు. వ‌సుధార కింద ప‌డి ఉండ‌టం చూస్తాడు

వ‌సుధార, మ‌నుపై పుకార్లు...

మ‌ను స్టోర్ రూమ్ లోప‌లికి వెళ్ల‌గానే బ‌య‌టి నుంచి శైలేంద్ర గ‌డియ‌పెడ‌తాడు. ఇద్ద‌రిపై పుకార్లు క్రియేట్ చేయాల‌ని అనుకుంటాడు. వ‌సుధార‌, మ‌ను స్టోర్ రూమ్‌లో క‌లిసి ఉన్నార‌ని, వారిద్ద‌రి గురించి ఎవో త‌ప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని శైలేంద్ర మ‌నిషి కాలేజీలో ప్ర‌చారం చేస్తాడు. ఆ వార్త‌లు విని మ‌హేంద్ర సీరియ‌స్ అవుతాడు. మ‌హేంద్ర‌, శైలేంద్ర‌తో పాటు స్టూడెంట్స్ అంద‌రూ క‌లిసి అది నిజ‌మో కాదో తెలుసుకోవ‌డానికి స్టోర్ రూమ్‌కు వ‌స్తారు.

ఏంజెల్ ఎంట్రీ...

మ‌ను, వ‌సుధార‌ల‌ను ఇరికించాన‌ని సంబ‌ర‌ప‌డుతూ స్టోర్ రూమ్ డోర్ తీస్తాడు శైలేంద్ర‌. కానీ స్టోర్ రూమ్‌లో ఏంజెల్ క‌నిపించ‌డంతో షాక‌వుతాడు. స్టోర్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏంజెల్ గొడ‌వ జ‌రుగుతుంద‌ని చెప్పి త‌న‌ను ఎవ‌రో త‌ప్పుదోవ ప‌ట్టించి ఎవ‌రో స్టోర్ రూమ్‌లో పెట్టి లాక్ చేశార‌ని, వారు ఎవ‌రో మ‌ర్యాద‌గా చెప్పాల‌ని అంటుంది. శైలేంద్ర‌నే డోర్ లాక్ చేసి ఉంటాడ‌ని అత‌డిపై ఫైర్ అవుతుంది. తాను కాద‌ని బుకాయిస్తాడు శైలేంద్ర. వాడు ఎవ‌డో తానే క‌నిపెట్టి అంతుచూస్తాన‌ని ఏంజెల్‌ అంటుంది. వ‌సుధార‌, మ‌నుల‌ను అన‌వ‌స‌రంగా అనుమానించామ‌ని స్టూడెంట్స్ వెళ్లిపోతారు.

మ‌ను వార్నింగ్‌...

మ‌ను, వ‌సుధార ఎలా మిస్స‌య్యారా అని శైలేంద్ర ఆలోచిస్తుండ‌గా అక్క‌డికి మ‌ను వ‌స్తాడు. వ‌సుధార‌ను, న‌న్ను ఇరికించ‌డానికి ఈ వెధ‌వ ఐడియా నువ్వే వేశావ‌ని నాకు తెలుసు అని శైలేంద్ర‌తో అంటాడు. నేనే ఈ ప్లాన్ చేసిన‌ట్లు ప్రూఫ్ ఉందా అని మ‌నుపై రివ‌ర్స్ అవుతాడు శైలేంద్ర‌. రిషికే చుక్క‌లు చూపించాను.

సూటు వేసుకొని నాలుగు ఉంగ‌రాలు పెట్టుకున్నంత మాత్రానా నువ్వేం పెద్ద పోటుగాడిన‌ని అనుకుంటున్నావా అని శైలేంద్ర అంటాడు. మిమ్మ‌ల్ని ఎవ‌ర‌ని వ‌దిలిపెట్ట‌న‌ని, మీరు చేసిన మోసానికి డ‌బుల్‌, ట్రిపుల్ మీరు అనుభ‌వించేలా చేస్తాన‌ని మ‌నుకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. నేను ఏం చేస్తానో మీ ఊహ‌ల‌కు అంద‌దు. ఈ శైలేంద్ర చ‌ర్య‌లు ఊహాతీతం అని అంటాడు.

చిల్ల‌ర వేషాలు వేస్తే...

శైలేంద్ర వార్నింగ్‌ను తేలిగ్గా తీసుకుంటాడు మ‌ను. ఇంకోసారి ఇలాంటి చిల్ల‌ర వేషాలు వేస్తే తోలువొలిచేస్తాన‌ని తిరిగి శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు మ‌ను. వ‌సుధార స్పృహ‌లోకి వ‌స్తుంది. స్టోర్ రూమ్‌కు ఎందుకు వెళ్లావ‌ని వ‌సుధార‌ను ఏంజెల్‌, మ‌ను అడుగుతారు.

గొడ‌వ జ‌రుగుతుంద‌ని ఫోన్ రావ‌డంతోనే వెళ్లాన‌ని, రూమ్‌లోకి వెళ్ల‌గానే మ‌త్తు మందు స్ప్రే చేశార‌ని, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌ద‌ని అంటుంది. త‌న‌ను రూమ్‌లో లాక్ చేసిన వ్య‌క్తిని గుర్తుప‌ట్ట‌లేక‌పోయాన‌ని వ‌సుధార అంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024