Guppedantha Manasu Serial: మను తల్లి అనుపమ కాదా? - వసుధారతో మహేంద్ర గొడవ - బావను ఆటపట్టించిన ఏంజెల్
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు మే 29వ ఎపిసోడ్‌లో మను తండ్రి గురించి మహేంద్ర ఎంక్వైరీ చేయడం మొదలుపెడతాడు. అతడిపై అనుపమ ఫైర్ అవుతుంది. మా జీవితంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరూ అంటూ నిలదీస్తుంది.
Guppedantha Manasu Serial: మనును ప్రేమలో దించడానికి వసుధార కాలేజీలో ఉద్యోగంలో చేరుతుంది ఏంజెల్. మను రూమ్‌లో ఛైర్ వేసుకొని కూర్చుకుంటుంది. మను సీరియస్‌గా వర్క్ చేస్తోండగా తన అల్లరితో అతడిని డిస్ట్రబ్ చేస్తుంది.మను చూస్తుండగా కన్నుకొడుతుంది. ఏంజెల్ అల్లరి తట్టుకోలేకపోతాడు మను.
ఇక్కడ ఇలాంటి పనులు బాగోవని అంటాడు. అయితే బయట కలుద్దామా అంటూ మనును ఏడిపిస్తుంది ఏంజెల్. నువ్వు మా అత్తయ్య కొడుకువి. ఎప్పుడు ఏదో జీవితం కోల్పోయిన వాడిలా మూడీగా ఉండటం చూడలేక నిన్ను సంతోషపెట్టాలని ఇక్కడకు వచ్చానని మనుతో అంటుంది ఏంజెల్.
నా జీవితంలో ఎవరికి చోటు లేదు...
ఏంజెల్ తనను ప్రేమిస్తోన్న విషయం అర్థం చేసుకుంటాడు మను. తన జీవితంలో ఎవరికి చోటు లేదని, తాను ఎవరిని ప్రేమించనని అంటాడు. అయినా ఏంజెల్ వినకపోవడంతో తన క్యాబిన్‌లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు మను. అతడిని ఆపేసి తానే బయటకు వెళుతుంది ఏంజెల్. ఈ సారి వెళుతున్నాను...కానీ మళ్లీ వస్తానని మనుతో చెబుతుంది ఏంజెల్.
వసుధార ప్రశ్నలు...
మను క్యాబిన్ నుంచి బటయకు వచ్చిన ఏంజెల్‌ను...నువ్వు మను కోసమే నువ్వు మా కాలేజీలో ఉద్యోగంలో చేరావా అని వసుధార అడుగుతుంది. పసితనం నుంచి తండ్రి ప్రేమ కోసం మను అల్లాడుతున్నాడని ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది. తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం తెలియక ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడు.
ఆ బాధతోనే ఎవరితో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు తల్లి ప్రేమకు దూరమై మూడీగా ఉంటున్నాడు. అతడిని మామూలు మనిషిని చేయడానికే మను జీవితంలోకి తాను వచ్చినట్లు వసుధారతో అంటుంది ఏంజెల్.
మను సంతోషమే ముఖ్యం...
తల్లి ప్రేమ, తండ్రి గురించి కనుక్కోవడం తప్ప మనుకు ఏ ఎమోషన్ లేకుండాపోయిందని, ఆ బాధ నుంచి మను బయటపడి హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సిందని ఏంజెల్ చెబుతుంది. మను నాకు బావ అవుతాడు...కానీ తనను అలా పిలవద్దని అంటున్నాడని వసుధారతో చెబుతుంది ఏంజెల్. అనుపమ జీవితం కష్టాల మయం కావడం చూసి విశ్వం బాధపడుతున్నాడని, విశ్వం, అనుపమ, మనులను కలపడమే తనముందు ఉన్న కర్తవ్యమని ఏంజెల్ చెబుతుంది.
మను చీదరించుకున్నా...
మను బాధ నుంచి బయటపడాలి...అందరితో సరదాగా ఉండాలని ఏంజెల్ చెబుతుంది. విశ్వాన్ని తాతయ్యగా మను అంగీకరించే వరకు అతడిని వదిలిపెట్టను. తనను చీదరించుకున్నా మను వెంటపడతానని ఏంజెల్‌తో చెబుతుంది వసుధార.
పెద్దమ్మను కలిసిన మహేంద్ర...
మనుకు మాటిచ్చిన ప్రకారం అతడి తండ్రిని వెతికే పనిని మొదలుపెడతాడు మహేంద్ర. అనుపమ పెద్దమ్మను కలుస్తాడు. మను తండ్రిని వెతికి అతడి ముందు నిలబెడతానని మాటిచ్చిన విషయం పెద్దమ్మకు చెబుతాడు మహేంద్ర. అతడి మాటలు విని పెద్దమ్మ షాకవుతుంది. తండ్రి విషయంలో మను ఎన్నో బాధలు అనుభవిస్తున్నా అనుపమ ఎందుకు నోరు విప్పడం లేదు.
తనపై నిందలు పడుతోన్న ఎందుకు మను తండ్రి ఎవరన్నది అనుపమ బయటపెట్టడం లేదని పెద్దమ్మను అడుగుతాడు మహేంద్ర. మను తండ్రి ఎవరన్నది మీకు తెలుసునని నాకు తెలుసు అని పెద్దమ్మతో అంటాడు మహేంద్ర. అనుపమను మోసం చేసిన వాడు ఎవడో తనకు ఇప్పుడే తెలియదని, నమ్మించి మోసం చేసిన వాడిని కాపాడాలని చూడకుండా ఇప్పుడే నిజం చెప్పమని పెద్దమ్మను నిలదీస్తాడు మహేంద్ర.
కన్నతల్లే...తండ్రి గురించి చెప్పనప్పుడు నేను నిజం చెప్పడం సబబు కాదని, ఆ ప్రశ్నకు సమాధానం నన్ను అడగొద్దని పెద్దమ్మ అంటుంది.
అనుపమ ఎంట్రీ...
అప్పుడే అక్కడికి అనుపమ ఎంట్రీ ఇస్తుంది. మను తండ్రి గురించి మహేంద్ర ఎంక్వైరీ చేయడంపై ఫైర్ అవుతుంది. మను తండ్రి గురించి వెతకాల్సిన అవసరం నీకు లేదని చెప్పాను. అయినా నా మాటను పెడచెవిన పెట్టి పెద్దమ్మ దగ్గరకు ఎందుకొచ్చావని మహేంద్రను నిలదీస్తుంది అనుపమ.
మనును పాతికేళ్లు పెంచిన తల్లి చెప్పడం లేదు నీకు ఎందుకు ఆరాటం మహేంద్రతో అంటుంది పెద్దమ్మ. మను..అనుపమ కొడుకు కాదనే నిజం పొరపాటుగా బయటపెట్టేస్తుంది. కానీ పెద్దమ్మ మాటలపై మహేంద్రకు అనుమానం రాకుండా అనుపమ టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
మా జీవితాల్లోకి రావడానికి నువ్వెవరూ...
అసలు మా జీవితాల్లోకి రావడానికి నువ్వెవరూ అంటూ మహేంద్రను నిలదీస్తుంది అనుపమ. ఆమె మాటలు విని మహేంద్రతో పాటు వసుధార షాకవుతారు. నేను ఎవరో నీకు తెలియదా అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర ఎమోషనల్ అవడం చూసి అనుపమ కరిగిపోతుంది.
స్నేహితురాలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోకపోవడం సహజమే...కానీ మను తండ్రి ఎవరనే విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని, ఈ విషయం గురించి నీకు చెప్పాలనే రూల్ లేదని మహేంద్రతో అంటుంది అనుపమ.
ఆమె మాటలను మహేంద్ర పట్టించుకోడు. మను తండ్రి ఎవరన్నది తాను కనిపెట్టి తీరుతానని అనుపమతో ఛాలెంజ్ చేస్తాడు. గొడవ పెద్దది అయ్యేలా కనిపించడంతో మహేంద్రను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళుతుంది వసుధార.
మహేంద్రను తప్పుపట్టిన వసుధార...
వసుధార కూడా మహేంద్ర వాదనను తప్పు పడుతుంది.మను తండ్రి గురించి వెతికే ప్రయత్నాలు ఆపమని, మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని మహేంద్రకు సలహా ఇస్తుంది వసుధార. ఇది అనవసరమైన విషయం అంటే మనుకు కూడా మనకు అనవసరమైన వాడేనా అని వసుధారను నిలదీస్తాడు మహేంద్ర.
కాలేజీ డైరెక్టర్ మాత్రమే…
మను మన కాలేజీకి డైరెక్టర్ మాత్రమేనని, అంతవరకు పరిమితం చేద్దామని... అంతే కానీ అతడి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని, అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మహేంద్రకు సర్ధిచెప్పడానికి వసుధార ప్రయత్నిస్తుంది. మను మనకోసం ఎంతో చేశాడని గుర్తుచేస్తాడు. మన అవసరాల వరకు మనును వాడుకొని ఇప్పుడు వదిలేద్దామని అంటున్నావా అని వసుధారను అడుగుతాడు మహేంద్ర.
మను తండ్రి ఎవరు అనే నిజం బయటపడితే అందరికి ప్రమాదమని వసుధార ఎంత చెప్పిన మహేంద్ర మాట వినడు. మను తండ్రిని వెతికితీసుకొస్తానని అతడికి మాటిచ్చానని అంటాడు. మను బాధను పోగొట్టడమే తన ముందు ఉన్న కర్తవ్యమని చెబుతాడు.
నిజం తెలుసుకున్న వసుధార...
మీరు బయటపెట్టే నిజం వల్ల చాలా మంది జీవితాలు తారుమారు అవుతాయని, అది ఎంతో మందికి బాధను మిగుల్చుతుందని మహేంద్రతో చెబుతుంది వసుధార. మను తండ్రి మహేంద్రనే అనే విషయం బయటపడకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది. నువ్వు ఇంతగా పట్టుపడుతున్నావంటే మను తండ్రి ఎ వరు అనే నిజం నీకు తెలిసి ఉంటుందని వసుధారతో అంటాడు మహేంద్ర. అనుపమ నీకు ఈ నిజం చెప్పింది కానీ మనుకు చెప్పలేదంటే తను ఏం పాపం చేశాడో తనకు అర్థం కావడం లేదని మహేంద్ర.
కాలేజీలోకి మహేంద్ర రీఎంట్రీ...
కొన్నేళ్లుగా తన బిడ్డ కన్నీళ్లు కారుస్తున్నా ఆ తల్లి నిజం ఎందుకు చెప్పడం లేదో మీరే ఆలోచించండి అంటూ మహేంద్రతో అంటుంది వసుధార మనం ఎక్కువగా రియాక్ట్ అయిపోయి నిజం బయటపెడితే అందరికి బాధే మిగిలుతుందని మహేంద్రపై సీరియస్ అవుతుంది వసుధార.
మహేంద్ర ఖాళీగా ఉండటం వల్లే మను తండ్రి గురించి వెతుకుతున్నాడని అతడిని తిరిగి కాలేజీకి రమ్మని అంటుంది. మహేంద్రను తిరిగి బోర్డ్ మెంబర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వసుధార ఫిక్సవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.