Guppedantha Manasu Jagathi: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి - టైటిల్ ఇదే!
14 October 2024, 9:53 IST
Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ తెలుగులో హీరోయిన్‌గా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నది. కిల్లర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతోంది.
గుప్పెడంత మనసు జగతి
Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మనసు సీరియల్‌తో ఫేమస్ అయిన జ్యోతి రాయ్ అలియాస్ జగతి తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీకి జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకనిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ కొత్త సినిమాకు కిల్లర్ పార్ట్ వన్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్...
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా కిల్లర్ మూవీ తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో జ్యోతిరాయ్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు వెల్లడించారు. జ్యోతిరాయ్‌తోపాటు ఆమె భర్త సుకుపూర్వజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. డైరెక్టర్ అయినా అతడు ఈ మూవీతోనే నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
మోడ్రన్ లుక్‌లో...
కిల్లర్ మూవీలో జ్యోతిరాయ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌లో అల్ట్రా మోడ్రన్ గెటప్‌లో ఓ యువతి షోడో కనిపిస్తోంది. గన్, రక్తం మరకలతో పాటు చెస్ కాయిన్స్ పోస్టర్‌పై కనిపిస్తూ ఆసక్తిని పంచుతున్నాయి.
త్వరలో షూటింగ్...
కిల్లర్ మూవీకి సుమన్ జీవన్‌రత్నం, అషీర్‌ల్యూక్ మ్యూజిక్ అందిస్తోన్నారు. ప్రజయ్ కామత్‌తో కలిసి సుకు పూర్వజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. త్వరలోనే కిల్లర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు సమాచారం.
ప్రేమ...పెళ్లి..
ప్రస్తుతం భర్త సుకు పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఏ మాస్టర్ పీస్ మూవీలో జ్యోతిరాయ్ ఓ కీలక పాత్ర చేస్తోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏ మాస్టర్ పీస్ మూవీలో అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే సుకుపూర్వజ్‌తో జ్యోతిరాయ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.
సుకుపూర్వజ్‌ను పెళ్లిచేసుకున్న జ్యోతిరాయ్...తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకుంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఓ బైలింగ్వల్ వెబ్ సిరీస్‌లో జ్యోతిరాయ్ టైటిల్ రోల్ చేస్తోంది.
గుప్పెడంత మనసు సీరియల్‌తో...
గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది జగతి. ఈ సీరియల్‌లో కొడుకు ప్రేమ, అతడి మంచి కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో సీరియల్ ఫ్యాన్స్‌ను మెప్పించింది. ఇటీవలే ఈ సీరియల్ ముగిసింది.
కన్నడంలో పదిహేను సీరియల్స్...
గుప్పెడంత మనసు కంటే ముందు తెలుగులో కన్యాదానం సీరియల్ చేసింది. కన్నడంలో పదిహేనుకుపైగా సీరియల్స్ చేసింది. కన్నడంలో దియా, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్ 10తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ఇకపై సీరియల్స్‌కు దూరంగా ఉంటూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెట్టాలని జ్యోతిరాయ్ నిర్ణయించుకుంది.