Tollywood: ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఒకే రోజు ఐదు మూవీస్ రిలీజ్‌-swag to ram nagar bunny telugu movies releasing this week in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఒకే రోజు ఐదు మూవీస్ రిలీజ్‌

Tollywood: ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఒకే రోజు ఐదు మూవీస్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2024 06:18 AM IST

Tollywood: ఈ శుక్ర‌వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఐదు సినిమాలు నిల‌వ‌బోతున్నాయి. వీటిలో శ్రీవిష్ణు స్వాగ్‌పైనే ఎక్కువ‌గా అంచ‌నాలు నెల‌కొన్నాయి. స్వాగ్‌తో పాటు డిఫ‌రెంట్ జోన‌ర్స్‌తో కూడిన మిగిలిన సినిమాల్లో ఏది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టాలీవుడ్
టాలీవుడ్

Tollywood: గ‌త వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఎన్టీఆర్ దేవ‌ర ఒక్క‌టే నిలిచింది. దేవ‌ర‌కు పోటీగా ఏ సినిమా రిలీజ్ కాలేదు. కానీ ఈ శుక్ర‌వారం మాత్రం ఏకంగా ఐదు చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

శ్రీవిష్ణు స్వాగ్‌...

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, ఓం భీమ్ బుష్ సినిమాల‌తో వ‌రుస‌గా రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అందుకున్నాడు శ్రీవిష్ణు. స్వాగ్‌తో హ్యాట్రిక్ హిట్‌కు రెడీ అయ్యాడు. ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో కూడిన‌ సెటైరిక‌ల్ కామెడీ మూవీగా స్వాగ్ తెర‌కెక్కుతోంది. హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఈ వారం తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. . రాజ‌రాజ చోర త‌ర్వాత శ్రీవిష్ణు, హ‌సిత్ గోలి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.

ఈ సినిమాలో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా...మీరా జాస్మిన్‌, ద‌క్షా న‌గార్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు క్యారెక్ట‌రైజేష‌న్ నాలుగైదు షేడ్స్‌లో సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. వింజ‌మ‌ర వంశానికి చెందిన రుక్మిణిదేవి అనే రాణిగా రీతూవ‌ర్మ న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.

రామ్ న‌గ‌ర్ బ‌న్నీ...

బుల్లితెర మెగాస్టార్‌గా పేరుతెచ్చుకున్న సీరియ‌ల్ యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ రామ్‌న‌గ‌ర్ బ‌న్నీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ మూవీకి వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమాలో చంద్ర‌హాస్‌కు జోడీగా న‌లుగురు హీరోయిన్లు విస్మ‌శ్రీ, రిచా జోషి, అంబికావాణి, రీతూ మంత్ర న‌టిస్తోన్నారు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ సినిమాను స్వ‌యంగా ప్ర‌భాక‌ర్ ప్రొడ్యూస్ చేశారు. చంద్ర‌హాస్‌పై సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ట్రోలింగ్‌తోనే రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ మూవీ ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచింది.

క‌లి...

న‌రేష్ అగ‌స్త్య‌, ప్రిన్స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ క‌లి ఈ వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. శివ శేషు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ మంచివాడి జీవితంలోకి సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎలా వ‌చ్చాడ‌నే పాయింట్‌తో క‌లి మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు. క‌లి మూవీకి జేబీ మ్యూజిక్ అందించాడు.

క‌బాలి సాయిధ‌న్సిక‌...

క‌బాలి ఫేమ్ సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తోన్నద‌క్షిణ మూవీ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మంత్ర ద‌ర్శ‌కుడో ఓషో తుల‌సీరామ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ మూవీతోనే అత‌డు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. సైకో కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా, కిల్ల‌ర్‌గా రెండు పాత్ర‌ల్లో సాయిధ‌న్సిక క‌నిపించ‌బోతున్న‌ది.

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ మిస్ట‌ర్ సెల‌బ్రిటీ ఈ మూవీ ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ మూవీకి చందిన ర‌వికిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాతో సీనియ‌ర్ రైట‌ర్స్ ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావుల మ‌న‌వ‌డు ప‌రుచూరి సుద‌ర్శ‌న్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప‌లు తెలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

టాపిక్