Guppedantha Manasu Vasudhara: హీరోయిన్‌గా గుప్పెడంత మనసు వసుధార? - సినిమాల్లో ఎంట్రీపై రక్షా గౌడ క్లారిటీ
Guppedantha Manasu Vasudhara: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్‌లో ఎండ్ అయ్యింది. దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ముగియడంతో తాను ఎమోషనల్ అయినట్లు రక్షా గౌడ అలియాస్ వసుధార చెప్పింది. షూటింగ్ లాస్ట్ డే కన్నీళ్లు ఆగలేదని అన్నది.
Guppedantha Manasu Vasudhara: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది రక్షా గౌడ. ఇటీవలే ఈ సీరియల్ ముగిసింది. దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయినా ఈ సీరియల్‌కు ఆగస్ట్ 31తో మేకర్స్ ప్యాకప్ చెప్పారు. అర్థాంతరంగా ఈ సీరియల్ ముగియడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు.
వసుధార ఎమోషనల్...
ఈ సీరియల్ ముగియడంతో తాను ఎమోషనల్ అయినట్లు రక్షా గౌడ అలియాస్ వసుధార చెప్పింది. సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ చేసిన రోజు కన్నీళ్లు ఆగలేదని వసుధార అన్నది. ఆ రోజును ఎప్పుడు తల్చుకున్న కన్నీళ్లు ఆగవని అన్నది. సీరియల్ షూటింగ్ చేసిన నాలుగేళ్లు ప్రతిరోజు అద్భుతమైన జ్ఞాపకంగా గడిచిపోయాయని వసుధార అన్నది.
టామ్ జెర్రీలా...
గుప్పెడంత మనసు సీరియల్‌కు రిషి, వసుధార కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరు తమ లవ్ స్టోరీతో అభిమానులను ఆకట్టుకున్నారు. సీరియల్‌లో ప్రేమికులుగా కనిపించిన తాము ఆఫ్‌స్క్రీన్‌లో ఎప్పుడు టామ్ జెర్రీలా గొడవలు పడుతుండేవాళ్లమని వసుధార అన్నది. కానీ ఈ గొడవలన్నీ ఫన్నీగా ఉండేవని వసుధార అన్నది.
రొమాంటిక్ సీన్స్ కష్టం...
రిషితో రొమాంటిక్ సీన్స్ చేయడం చాలా కష్టమైందని వసుధార తెలిపింది. రొమాంటిక్ సీన్స్ అనగానే తనకు నవ్వు ఆగేది కాదని, అది చూసి రిషి చాలా డిస్ట్రబ్ అయ్యేవాడని వసుధార అన్నది. ఆ సీన్స్ మొత్తం ఇద్దరం మర్చిపోయేవాళ్లమని తెలిపింది.
టైమ్ వచ్చినప్పుడే...
ఇప్పటికే రిషి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. రిషి బాటలతోనే సినిమాల్లోకి అడుగుపెట్టనుండటంపై వసుధార రియాక్ట్ అయ్యింది. మంచి స్టోరీతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తోన్నట్లు వసుధార అన్నది. టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా సినిమా ఎంట్రీ గురించి ప్రకటిస్తానని అన్నది. కన్నడంలో ఓ మూవీకి రక్షా గౌడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కన్నడం, గుజరాతీలో...
గుప్పెడంత మనసు తెలుగులో వసుధారకు ఫస్ట్ సీరియల్. కన్నడంలో పుట్టమల్లి, గుజరాతీలో రాధా రాఘవ్ అనే సీరియల్స్ చేసింది. కన్నడంలో గతంలో గరుడాక్ష అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
నాలుగేళ్లు...
గుప్పెడంత మనసు సీరియల్ 2020లో ప్రారంభమైంది మొత్తం 1168 ఎపిసోడ్స్‌తో మేకర్స్ ఈ సీరియల్‌ను ఎండ్ చేశారు. జగతి, శైలేంద్ర మారిపోవడంతో పాటు రిషి, వసుధార ఒక్కటైనట్లుగా చూపించి మేకర్స్ సీరియల్‌కు శుభంకార్డు వేశారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో సాయికిరణ్, జ్యోతిరాయ్, సంగీత, సురేష్‌బాబు కీలక పాత్రల్లో నటించారు.గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రెండు సినిమాలు...
మరోవైపు ముఖేష్ గౌడ అలియాస్ రిషి గీతాశంకరంతో పాటు ప్రియమైన నాన్నకు పేరుతో రెండు సినిమాలు చేస్తోన్నాడు. ప్రియమైన నాన్నకు కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానున్నాయి. సినిమాల కారణంగా కొన్నాళ్లు సీరియల్స్‌కు బ్రేక్ ఇవ్వాలని రిషి నిర్ణయించుకున్నట్లు సమాచారం.