Devara movie Twitter Review: దేవర మూవీ ట్విట్టర్ రివ్యూ - ఎన్టీఆర్ వన్ మెన్ షో - ప్రీమియర్స్‌కు బ్లాక్‌బస్టర్ టాక్
Devara movie Twitter Review: ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు సృష్టించిన ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Devara Twitter Review: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ ఇది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ద్వారా జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే దేవర మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజైన ఈ మూవీ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
ఎన్టీఆర్ వన్ మెన్ షో...
దేవర ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఎన్టీఆర్ వన్ మెన్ షో ఇదని చెబుతున్నారు. టైటిల్ కార్డ్ నుంచి చివరి వరకు ఎన్టీఆర్ అదరగొట్టేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డ్యూయల్ రోల్ ట్విస్ట్ బాగుందని, దేవర, వర పాత్రలో చక్కటి వేరియేషన్ చూపించాడని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్...
ఎన్టీఆర్ ఎలివేషన్స్, హీరోయిజం దేవర మూవీలో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. దేవర విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, పర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాచ్ అని చెబుతున్నారు.
యాక్షన్ సీక్వెన్స్ హైలైట్...
పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. కథను మొదలుపెట్టిన విధానం, ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైనింగ్, బ్యాక్‌డ్రాప్ అన్ని కొత్తగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ దేవర మూవీకి మెయిన్ హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు. దేవరగా ఎన్టీఆర్, భైరగా సైఫ్ అలీఖాన్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయని చెబుతున్నారు.
ఎర్ర సముద్రం తీర ప్రాంతంలో భారీ కంటైనర్ షిప్‌లపై వచ్చే ఖరీదైన సామాగ్రిని దొంగతనం చేసే నాలుగు ఊళ్ల ప్రజల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. స్టోరీ సింపుల్‌గానే ఉన్నా తన స్క్రీన్‌ప్లేతో కొరటాల శివ మ్యాజిక్ చేశాడని అంటున్నారు.
అనిరుధ్ మరో హీరో...
ఈ సినిమాకు అనిరుధ్ మరో హీరోగా నిలిచాడని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అతడి బీజీఎమ్ థియేటర్లలో గూస్‌బంప్స్‌ను కలిగిస్తోందని చెబుతోన్నారు.
ఇరవై నిమిషాలే...
దేవర మూవీలో జాన్వీకపూర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా మొత్తంలో 15 నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే జాన్వీకపూర్ కనిపిస్తుందని అంటున్నారు. చుట్టమల్లే సాంగ్‌లో ఎన్టీఆర్, జాన్వీకపూర్ కెమిస్ట్రీ, డ్యాన్సులు బాగున్నాయని అంటున్నారు. శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్‌తో పాటు మిగిలిన వారి నటన బాగుందని చెబుతున్నారు.
బాహుబలి స్ఫూర్తితో...
స్టోరీ ప్రెడిక్టబుల్‌గా ఉండటం, సెకండాఫ్‌లో చాలా సీన్లు ల్యాగ్ కావడం కూడా కొంత సినిమాకు మైనస్‌గా మారిందని చెబుతున్నారు. బాహుబలి వన్ స్ఫూర్తితో క్లైమాక్స్‌ను కొరటాల శివ రాసుకున్నాడని, పార్ట్ 2 కోసం లీడ్ ఇస్తూ సినిమాను ఎండ్ చేశారని, కానీ ఆ ట్విస్ట్ అంత గొప్పగా లేదని ఫ్యాన్స్ చెబుతోన్నారు.