Devara Release Trailer: భయమంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ వినాలి - ఎన్టీఆర్ దేవ‌ర రిలీజ్ ట్రైల‌ర్ అదుర్స్‌-ntr koratala siva devara movie release trailer unveiled janhvi kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Release Trailer: భయమంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ వినాలి - ఎన్టీఆర్ దేవ‌ర రిలీజ్ ట్రైల‌ర్ అదుర్స్‌

Devara Release Trailer: భయమంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ వినాలి - ఎన్టీఆర్ దేవ‌ర రిలీజ్ ట్రైల‌ర్ అదుర్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 22, 2024 02:27 PM IST

Devara : దేవ‌ర మూవీ రిలీజ్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, యాక్ష‌న్ అంశాల‌తో రిలీజ్ ట్రైల‌ర్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది.

దేవర రిలీజ్ ట్రైలర్
దేవర రిలీజ్ ట్రైలర్

Devara Release Trailer: అభిమానుల‌కు దేవ‌ర టీమ్ మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆదివారం దేవ‌ర రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేసింది. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ అంశాల‌తో రిలీజ్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్ గంభీర‌మైన వాయిస్‌తోనే ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. నిన్న రేత్రి ఓ పీడ‌క‌ల వ‌చ్చుండాది జోగుళ‌. సంద్రం ఎరుపెక్కి నిజంగా ఎర్ర స‌ముద్రం అయిన‌ట్లు, అది నా చేతుల మీద అయిన‌ట్లు క‌నిపించ‌డాది అంటూ వ‌చ్చే డైలాగ్ ఆస‌క్తిని పంచింది.

దేవ‌ర క‌థ ఇనాలా...

భ‌యం పోవాలంటే దేవుడి క‌థ ఇనాలా...భ‌యమంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ ఇనాలా...స‌ముద్రం మీద ఒక దేవ‌ర ఉన్నాడు చాలు...కొండ‌మీద ఇంకో దేవ‌ర‌ను త‌యారు చేస్తే అది మీకే మంచిది కాదు భైర‌...స‌ముద్రం ఎక్క‌లా...స‌ముద్రం ఏలాలా...అనే డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

ట్రైల‌ర్ చివ‌ర‌లో ఓ ప‌క్క ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్‌...మ‌రోప‌క్క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్‌, స‌ముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సీన్స్‌, బీజీఎమ్ ఆక‌ట్టుకుంటున్నాయి.

మూడు గంట‌లు ఆల‌స్యంగా...

తొలుత రిలీజ్ ట్రైల‌ర్‌ను ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల ఏడు నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.కానీ టెక్నిక‌ల్ ఇష్యూస్ వ‌ల్ల మూడు గంట‌ల ఆల‌స్యంగా ట్రైల‌ర్ అభిమానుల ముందుకొచ్చింది. ట్రైల‌ర్ ఆల‌స్యం కావ‌డంతో కొంత అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు. మూవీ టీమ్ ట్రోల్ చేశారు.

నెగెటివ్ కామెంట్స్‌...

మెయిన్ ట్రైల‌ర్‌పై కొంత నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. కేవ‌లం యాక్ష‌న్ అంశాలు త‌ప్ప ట్రైల‌ర్‌లో ఏం క‌నిపించ‌లేదంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆచార్య‌తో చాలా మంది ఈ సినిమాను పోల్చారు. అయితే రిలీజ్ ట్రైలర్ ద్వారా ఆ విమ‌ర్శ‌ల‌కు కొర‌టాల శివ స‌మాధానం ఇచ్చారు.

జాన్వీక‌పూర్ హీరోయిన్‌...

దేవ‌ర మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. దేవ‌ర‌తోనే జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో శ్రీకాంత్‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన మూడు పాట‌లు పెద్ద హిట్ట‌య్యాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

దేవ‌ర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది.ఈ వేడుక‌కు అగ్ర ద‌ర్శ‌కులు ఎస్ ఎస్ రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌తో పాటు ప్ర‌శాంత్ నీల్ అటెండ్ కానున్న‌ట్లు స‌మాచారం. దేవ‌ర మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. దేవ‌ర మూవీకి ఏపీ తెలంగాణ‌లో టికెట్లు రేట్ల‌ను పెంచేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి.

టాపిక్