Harihara Veeramallu: సినిమాల్లోకి డిప్యూటీ సీఏం రీఎంట్రీ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన మేక‌ర్స్-pawan kalyan harihara veeramallu update power star joins shoot soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harihara Veeramallu: సినిమాల్లోకి డిప్యూటీ సీఏం రీఎంట్రీ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన మేక‌ర్స్

Harihara Veeramallu: సినిమాల్లోకి డిప్యూటీ సీఏం రీఎంట్రీ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన మేక‌ర్స్

Nelki Naresh Kumar HT Telugu
Aug 16, 2024 01:13 PM IST

Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఏం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీకి జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు
హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు

Harihara Veeramallu: రాజ‌కీయాల కార‌ణంగా గ‌త ఏడాది కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌లో భాగం కానున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. శుక్ర‌వారం నుంచి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ వార్ ఎపిసోడ్ షూటింగ్‌ను ప్రారంభించారు.

500 మంది ఫైట‌ర్లు...

ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్‌లో సుమారు 400-500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటార‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చిత్రీక‌రించ‌నున్న ఈ యాక్ష‌న్‌ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాల్గొనున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ప‌వ‌న్ రీఎంట్రీపై మ‌రో నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

పోరాట యోధుడిగా...

త‌న కెరీర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేస్తోన్న ఫ‌స్ట్ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ ఇది. ఇందులో చారిత్రాత్మ‌క పోరాట యోధుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్లు సినిమా యూనిట్ చెబుతోంది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ప‌వ‌ర్‌ఫుల్‌గా ప‌వ‌ర్ స్టార్ పాత్ర సాగ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. మొఘ‌లుల కాలం నాటి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. మొఘ‌ల్ రాజు ఔరంగ‌జేబును అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను ఎదురించే వీరుడిగా ఈ మూవీలో ప‌వ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీకి జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా తొలుత క్రిష్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల క్రిష్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో సినిమాను పూర్తిచేసే బాధ్య‌త‌ను జ్యోతికృష్ణ చేప‌ట్టాడు.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు స్వార్ట్ వ‌ర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో యానిమ‌ల్ ఫేమ్ బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న ఈ సినిమాలో కీల‌క పాత్రను అనుప‌మ్ ఖేర్ చేస్తోన్నాడు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందించ‌నున్నాడు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్‌ ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

రాజ‌కీయాల‌తో బిజీ....

కాగా గ‌త కొన్నాళ్లుగా ప‌వ‌న్‌ కళ్యాణ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎలెక్ష‌న్స్‌లో పిఠాపురం నుంచి విజ‌యాన్ని సాధించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొన‌సాగుతోన్నారు. రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెడుతూనే తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

మూడు సినిమాలు..

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలు చేస్తోన్నాడు. ఓజీ సినిమాకు సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌కు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు.