HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌-officially director krish out from pawan kalyan harihara veera mallu movie makers new director name ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hhvm Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 10:37 AM IST

HHVM Director: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా నుంచి ద‌ర్శ‌కుడు క్రిష్ త‌ప్పుకున్నాడు. క్రిష్ స్థానంలో ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌డుతోన్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు
హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు

HHVM Director: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్‌ను గురువారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాల‌తో ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సోష‌ల్ మీడియాలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమా నుంచి ద‌ర్శ‌కుడు క్రిష్ త‌ప్పుకొన్న‌ట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీజ‌ర్‌తో ఈ వార్త‌లు నిజ‌మేన‌ని మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. క్రిష్ స్థానంలో ఏఎమ్ జ్యోతికృష్ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొత్త డైరెక్ట‌ర్‌గా జ్యోతికృష్ణ‌...

టీజ‌ర్‌తో పాటుగా గురువారం రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్‌లో డైరెక్ట‌ర్లుగా క్రిష్‌తో పాటు ఏఎమ్ జ్యోతికృష్ణ పేర్లు క‌నిపించాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ 70 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

మిగిలిన షూటింగ్ పార్ట్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ్యోతికృష్ణ పూర్తిచేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. క్రిష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తిచేస్తాడ‌ని వెల్ల‌డించారు.

నీ మ‌న‌సు నాకు తెలుసు...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ప్రొడ్యూస‌ర్‌ ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడే జ్యోతికృష్ణ‌. గ‌తంలో త‌రుణ్‌తో నీ మ‌న‌సు నాకు తెలుసు, గోపీచంద్‌తో ఆక్సిజ‌న్ సినిమాల‌ను తెర‌కెక్కించాడు జ్యోతికృష్ణ‌. ఈ రెండు సినిమాలు ఫెయిల‌వ్వ‌డంతో చాలా రోజుల పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉన్న జ్యోతికృష్ణ ఇటీవ‌లే రూల్స్ రంజ‌న్‌తో తిరిగి మెగాఫోన్ ప‌ట్టాడు.

త‌న పేరును ర‌థినం కృష్ణ‌గా మార్చుకొని రూల్స్ రంజ‌న్ మూవీని తెర‌కెక్కించాడు. డైరెక్ట‌ర్‌గా త‌న పేరును మార్చుకున్న సినిమా రిజ‌ల్ట్ మాత్రం సేమ్ వ‌చ్చింది. ఈ మూవీ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ప‌వ‌న్ ఫ్యాన్స్ కంగారు...

డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ కంగారు ప‌డుతోన్నారు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ మొద‌లై నాలుగేళ్లు దాటింది. మ‌రోవైపు ఎన్నిక‌ల కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సినిమా షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, క్రిష్‌కు మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌న్ సూచించిన మార్పులు చేర్పులు చేయ‌డానికి క్రిష్ అంగీక‌రించ‌న‌ట్లు స‌మాచారం. అందువ‌ల్లే ఈ సినిమాను క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పూర్తిచేయ‌డానికి ప‌వ‌న్ అంగీక‌రించ‌లేద‌ని అంటున్నారు. అత‌డి స్థానంలో ద‌ర్శ‌కుడిగా జ్యోతికృష్ణ‌ను నియ‌మించిన‌ట్లు చెబుతోన్నారు.

డిసెంబ‌ర్‌లో రిలీజ్‌...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, నోరా ఫ‌తేహి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాబీడియోల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అనుష్క‌తో మూవీ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి త‌ప్పుకున్న క్రిష్ అనుష్క‌తో కొత్త మూవీని ఇటీవ‌లే అనౌన్స్‌చేశాడు. ఘాటి పేరుతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ప్ర‌స్తుతం అనుష్క‌, క్రిష్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఘాటి మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను షూటింగ్ పూర్తికాక‌ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డ్ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ది.

IPL_Entry_Point