Hari Hara Veera Mallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఆగిపోయింది - క్లారిటీ ఇచ్చిన యానిమ‌ల్ విల‌న్-bobby deol says hari hara veera mallu shooting stopped in halfway ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఆగిపోయింది - క్లారిటీ ఇచ్చిన యానిమ‌ల్ విల‌న్

Hari Hara Veera Mallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఆగిపోయింది - క్లారిటీ ఇచ్చిన యానిమ‌ల్ విల‌న్

Nelki Naresh Kumar HT Telugu
Nov 28, 2023 05:54 AM IST

Hari Hara Veera Mallu హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌పై బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ బాబీడియోల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ భారీ బ‌డ్జెట్ పీరియాడిక‌ల్ మూవీ షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన‌ట్లు యానిమ‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో పేర్కొన్నాడు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు
హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు

Hari Hara Veera Mallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌పై బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బాబీడియోల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ పీరియాడిక‌ల్ మూవీ షూటింగ్‌ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన‌ట్లు తెలిపాడు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో బాబీడియోల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. మొఘ‌లుల రాజు ఔరంగ‌జేబుగా న‌టిస్తోన్నాడు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతోనే తాను టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింద‌ని బాబీడియోల్ అన్నాడు. యానిమ‌ల్‌ తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు గురించి బాబీ డియోల్ మాట్లాడుతూ తాను ఓ తెలుగు సినిమా అంగీక‌రించార‌ని, కానీ స‌గం షూటింగ్‌ పూర్త‌యిన త‌ర్వాత ఆ సినిమా ఆగిపోయింద‌ని తెలిపాడు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాకు మ‌ధ్య‌లోనే ప‌వ‌న్ గుడ్‌బై చెప్పిన‌ట్లు చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాబీడియోల్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ఈ ప్యాకప్ వార్తలపై క్లారిటీ వ‌చ్చేసింది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ దాదాపు యాభై శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ద‌ర్శ‌కుడు క్రిష్‌కు ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో పాటు జ‌న‌సేన క్యార్య‌క్ర‌మాల‌తో ప‌వ‌న్ బిజీ కావ‌డం, ఏపీలో ఎన్నిక‌లు రావ‌డం కూడా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

IPL_Entry_Point