తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raju Yadav Ott: ఓటీటీలోకి గెట‌ప్ శ్రీను ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ - ఎప్పుడు...ఎందులో చూడాలంటే?

Raju Yadav OTT: ఓటీటీలోకి గెట‌ప్ శ్రీను ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ - ఎప్పుడు...ఎందులో చూడాలంటే?

09 July 2024, 6:09 IST

google News
  • Raju Yadav OTT: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ గెట‌ప్ శ్రీను హీరోగా న‌టిస్తోన్న రాజు యాద‌వ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్‌గా క్లారిటీ వ‌చ్చింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

రాజు యాద‌వ్ మూవీ ఓటీటీ
రాజు యాద‌వ్ మూవీ ఓటీటీ

రాజు యాద‌వ్ మూవీ ఓటీటీ

Raju Yadav OTT: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ గెట‌ప్ శ్రీను హీరోగా న‌టించిన రాజు యాద‌వ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ ఎమోష‌న‌ల్ కామెడీ మూవీ ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రాజు యాద‌వ్ ఓటీటీ రిలీజ్‌ను ఆహా అఫీషియ‌ల్‌గా క‌న్ఫార్మ్ చేసింది. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. త్వ‌ర‌లోనే రాజు యాద‌వ్ మూవీ విడుద‌ల కానున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌లో వెల్ల‌డించింది.

కామెడీ ఎమోష‌న‌ల్ రోల్‌...

రాజు యాద‌వ్ సినిమాలో గెట‌ప్ శ్రీనుకు జోడీగా అంకితా ఖార‌త్ హీరోయిన్‌గా న‌టించింది. ఆనంద చ‌క్ర‌పాణి, రాకెట్ రాఘ‌వ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మే నెల‌లో రాజు యాద‌వ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోష‌న్స్ చ‌క్క‌గా ప‌డించాడు గెట‌ప్ శ్రీను. కానీ క‌థ పాత‌దే కావ‌డంతో రాజు యాద‌వ్ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌లో క్లారిటీ లేక‌పోవ‌డం, క‌థ‌కు సంబంధం లేని బోల్డ్ సీన్స్ కార‌ణంగా సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

రాజు యాద‌వ్ ప్రేమ‌క‌థ‌...

రాజు యాద‌వ్ (గెట‌ప్ శ్రీను) స్నేహితుల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతున్న‌ప్పుడు అత‌డి ఫేస్‌కు బాల్ త‌గులుతుంది. ఆ ప్ర‌మాదం కార‌ణంగా ఎప్పుడూ న‌వ్వు ముఖంతోనే రాజ్ యాద‌వ్ క‌నిపించాల్సివ‌స్తుంది. అత‌డి ముఖం చూసి అంద‌రూ గేలిచేస్తుంటారు. అనుకోకుండా రాజు యాద‌వ్ జీవితంలోకి స్వీటీ (అంకిత ఖార‌త్‌) వ‌స్తుంది.

స్వీటీని గాఢంగా ప్రేమించిన రాజ్ యాద‌వ్ ఆమె కోసం సొంతూరును వ‌దిలిపెట్టి హైద‌రాబాద్ వ‌స్తాడు. కానీ స్వీటీ మాత్రం రాజుయాద‌వ్‌ను ఓ స్నేహితుడిలాగే చూస్తుంది. రాజు యాద‌వ్ ప్రేమ క‌థ ఏమైంది? స్వీటీ త‌న ప్రేమ‌ను కాద‌న‌డంతో రాజు యాద‌వ్ ఏం చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. రాజు యాద‌వ్ సినిమా కోసం ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ పాట‌ను రాయ‌డ‌మే కాకుండా స్వ‌యంగా తానే పాడాడు.

సోలో హీరోగా ఫ‌స్ట్ మూవీ...

గెట‌ప్ శ్రీనుకు సోలో హీరోగా రాజు యాద‌వ్ ఫ‌స్ట్ మూవీ. గ‌తంలో త్రీమంకీస్ సినిమాలో సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌ల‌తో క‌లిసి హీరోగా ఓ మూవీ చేశాడు. క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా గెట‌ప్ శ్రీను బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్‌, హ‌నుమాన్‌, ఆచార్య‌, జాంబీరెడ్డితో పాటు ప‌లు సినిమాల్లో త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు.

సీరియ‌స్ రోల్స్‌...

మా ఊరి పొలిమేర‌, పొలిమేర 2 సినిమాల్లో సీరియ‌స్ రోల్స్ చేశాడు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మాయ‌బ‌జార్ ఫ‌ర్ సేల్ వెబ్‌సిరీస్‌ల‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కంటెస్టెంట్‌గా గెట‌ప్ శ్రీను కొన‌సాగుతోన్నాడు.

తదుపరి వ్యాసం