Sarkaar 4 OTT: సుడిగాలి సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం.. టేస్టీ తేజపై సీరియస్: అదిరిపోయిన సర్కార్ 4 ప్రోమో-bigg boss actor sivaji punches on sudigali sudheer sarkar 4 aha ott game show latest promo entertaining big boss telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaar 4 Ott: సుడిగాలి సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం.. టేస్టీ తేజపై సీరియస్: అదిరిపోయిన సర్కార్ 4 ప్రోమో

Sarkaar 4 OTT: సుడిగాలి సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం.. టేస్టీ తేజపై సీరియస్: అదిరిపోయిన సర్కార్ 4 ప్రోమో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 05, 2024 03:09 PM IST

Sarkaar 4 OTT Promo: సర్కార్ సీజన్ 4 గేమ్ షోకు శివాజీతో పాటు బిగ్‍బాస్ తెలుగు 7 కంటెస్టెంట్లు మరో ముగ్గురు వచ్చారు. సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం కురిపించారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది.

Sarkaar 4 OTT: సుడిగాలి సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం.. టేస్టీ తేజపై సీరియస్: అదిరిపోయిన సర్కార్ 4 ప్రోమో
Sarkaar 4 OTT: సుడిగాలి సుధీర్‌పై శివాజీ పంచ్‍ల వర్షం.. టేస్టీ తేజపై సీరియస్: అదిరిపోయిన సర్కార్ 4 ప్రోమో

Sarkaar 4 OTT Promo: ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సర్కార్ సీజన్ 4 గేమ్ షో హవా చూపిస్తోంది. ట్రెండింగ్‍లో కొనసాగుతూ సత్తాచాటుతోంది. సుడిగాలి సుధీర్ యాంకరింగ్ ఈ సర్కార్ సీజన్‍కు హైలైట్‍గా నిలుస్తోంది. సర్కార్ సీజన్ 4.. 8వ ఎపిసోడ్‍కు బిగ్‍బాస్ తెలుగు 7 కంటెస్టెంట్లు నలుగురు వచ్చారు. బిగ్‍బాస్‍లో పాల్గొన్న సీనియర్ నటుడు శివాజీ, టేస్టీ తేజ, రితికా, నయని పావని ఈ ఎపిసోడ్‍కు వచ్చారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఎంటర్‌టైనింగ్‍గా ఉంది.

సుధీర్‌పై పంచ్‍లు

తన గురించి ఏదైనా చెప్పాలని సుధీర్ అడుగుతారు. “నీకేంటి సుధీర్.. అందగాడివి.. మామూలు స్పీడ్ కాదు” అని శివాజీ అంటారు. తనకు పెద్ద ఫ్యాన్ అని.. ఏవైనా రెండు జోక్‍లు చెప్పారని శివాజీని సుధీర్ అడుగుతారు. అయితే, “ఇప్పుడు నేను చెప్పింది అవే కదా” అని శివాజీ పంచ్ వేయడంతో సుధీర్ అవాక్కయ్యారు. నయని పావనిని కౌలిగించుకునేందుకు సుధీర్ ప్రయత్నిస్తే.. శివాజీ మధ్యలో వచ్చి హగ్ ఇస్తారు. ఏరా ‘పట్టేసుకుందామనే” అని శివాజీ పంచ్ ఇచ్చారు. నయనిని టమాటా పండుతో పోలిస్తే.. సుడిగాలి సుధీర్‌కు మరో ఝలక్ ఇచ్చారు శివాజీ.

‘ఆ’తో కాదు మీతోనే ఆనందం స్టార్ అవుతుందని రితికను సుధీర్ పొగుడుతుంటే.. “వాడు మేల్ రాధిక.. జాగ్రత్త” అని శివాజీ పంచ్ వేశారు. ఆ తర్వాత టేస్టీ తేజ, రితిక, పావని మధ్య గేమ్‍లో ఫన్ ఉంది. ఆడంబరం అంటే ఆడోళ్లు అని తేజ జోక్ వేస్తే.. ఆడంబరం అంటే ఘనంగా అని తేజకు రితిక చెప్పారు.

బీపీ పెంచొద్దు

గేమ్‍లో ఓ దశలో శివాజీ సీరియస్ అయినట్టు ఈ ప్రోమోలో ఉంది. “సుధీర్ సహజంగా నాకు బీపీ రాదు.. పెంచుతున్నావ్ నాకు” అని శివాజీ అంటారు. టేస్టీ తేజ మధ్యలో వస్తే.. “నువ్వు ఎవడివి రా మధ్యలో” అని సీరియస్‍గా శివాజీ అరిచారు. శివాజీ నిజంగానే సీరియస్ అయ్యారా.. లేకపోతే ఇది ప్రోమో స్టంటా అనేది ఫుల్ ఎపిసోడ్‍లో తెలుస్తుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

శివాజీ, టేస్టీ తేజ, రితిక, నయని పావని పాల్గొన్న సర్కార్ 4 ఎపిసోడ్ 8 ఈవారంలోనే జూన్ 7వ తేదీన రాత్రి 8 గంటల నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుంది.

సర్కార్ సీజన్ 4 ఆహా ఓటీటీలో మంచి సక్సెస్ అవుతోంది. యాంకర్‌గా తన కామెడీ టైమింగ్, వాక్చాతుర్యంతో ఈ గేమ్‍ షోను సుధీర్ అద్భుతంగా నడిపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సర్కార్ 4 గత 7వ ఎపిసోడ్‍కు గంగం గణేశా టీమ్ వచ్చింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ ప్రగతి, ఇమ్మాన్యుయేల్, ప్రిన్స్ యావర్ గేమ్ ఆడారు. ఈ ఎపిసోడ్ కూడా ఎంటర్‌టైనింగ్‍గా సాగింది.

ఆహాలో సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కూడా మొదలుకానుంది. ముందుగా జూన్ 7నే ఈ షో మొదలవుతుందని ఆహా వెల్లడించింది. అయితే వాయిదా పడింది. వారం ఆలస్యంగా జూన్ 14వ తేదీన తెలుగు ఇండియన్ ఐడల్ 3 మొదలుకానుంది.