Sarkaar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చి కుక్కలు కరిచినా నేను సావా.. అదిరిపోయిన సుధీర్ సర్కార్ కొత్త ప్రోమో-sudigali sudheer sarkaar 7th episode promo gam gam ganesha team anand deverakonda pragathi srivastava ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చి కుక్కలు కరిచినా నేను సావా.. అదిరిపోయిన సుధీర్ సర్కార్ కొత్త ప్రోమో

Sarkaar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చి కుక్కలు కరిచినా నేను సావా.. అదిరిపోయిన సుధీర్ సర్కార్ కొత్త ప్రోమో

Hari Prasad S HT Telugu
May 28, 2024 10:34 AM IST

Sarkaar Promo: సుడిగాలి సుధీర్ గేమ్ షో సర్కార్ సీజన్ 4లో ఏడో ఎపిసోడ్ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్లో గం గం గణేశా టీమ్ సందడి చేసింది.

అదిరిపోయిన సుధీర్ సర్కార్ కొత్త ఎపిసోడ్ ప్రోమో
అదిరిపోయిన సుధీర్ సర్కార్ కొత్త ఎపిసోడ్ ప్రోమో

Sarkaar Promo: సుడిగాలి సుధీర్ షో సర్కార్ లో కొత్త ఎపిసోడ్ రాబోతోంది. ఈ షో కోసం వచ్చిన గం గం గణేశా మూవీ ఫిమేల్ లీడ్ ప్రగతి శ్రీవాస్తవను చూడగానే సుధీర్ లోని కవి బయటకు వచ్చాడు. ఒక్కసారి నువ్వంటే బావ.. పిచ్చి కుక్కలు కరిచినా నేను సావా అంటూ రైమింగ్ తో అతడు అదరగొట్టేశాడు. 4 నిమిషాల ఈ ప్రోమో నవ్వులతో నిండిపోయింది.

సర్కార్ ఏడో ఎపిసోడ్ ప్రోమో

ఆహా ఓటీటీలోని టాప్ షోలలో సర్కార్ ఒకటి. ముఖ్యంగా కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ నాలుగో సీజన్లో హోస్ట్ గా వచ్చిన తర్వాత ఈ షో రేంజ్ పెరిగిపోయింది. తన కామెడీ టైమింగ్ తో అతడు అలరిస్తున్నాడు. ఇప్పటికే నాలుగో సీజన్ లో ఆరు ఎపిసోడ్లు పూర్తవగా.. ఏడో ఎపిసోడ్ రానుంది. దీనికి గం గం గణేశా మూవీ టీమ్ ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ వచ్చారు.

తాజాగా ఆహా ఓటీటీ ఈ కొత్త ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ప్రగతి రాగానే సుధీర్ చెలరేగిపోయాడు. చాలా వినుంటరు.. సుధీర్ తోపు.. సుధీర్ ఊపు అని ఇలాంటివన్నీ అంటాడు. దానికి ఆమె నో అని చెప్పడంతో అతని ముఖం మాడిపోతుంది. ఇక ఆ తర్వాత ఆమె కోసం తాను రాసుకొచ్చిన కవితలను తీసి చదువుతాడు.

"నువ్వు ఒక్కసారి అంటే బావ.. పిచ్చి కుక్కలు కరిచినా నేను సావా", "ముష్టోడి బొచ్చలో బిళ్ల.. అందరికీ చెబుతున్నా తనే నా పిల్ల" అంటూ తనదైన స్టైల్ కవితలతో సుధీర్ తెగ నవ్వించాడు. ఇది నీలో దాగి ఉన్న టాలెంటా అని ప్రగతి అడిగితే.. వాటిలో ఇది ఒకటి మాత్రమే అంటాడు. అయితే ఆ టాలెంట్ లోపలే దాగి ఉండని అని ప్రగతి వేసిన పంచ్ కు సుధీర్ తెల్లమొహం వేశాడు.

సర్కార్ గేమ్ షో

సర్కార్ షో ఆహా ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఆ సీజన్లలో ఈ షోని ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసేవాడు. అయితే నాలుగో సీజన్ లో మాత్రం సుడిగాలి సుధీర్ ను రంగంలోకి దింపారు. అతడు వచ్చీ రాగానే ఈ షో ఊపందుకుంది. తన షోకి వచ్చే సెలబ్రిటీలపై జోకులు వేయడం, వాళ్లతో తనపై పంచ్ లు వేయించుకోవడం.. ఇలా సుధీర్ ఈ షోని ఆడుతూపాడుతూ నడిపించేస్తున్నాడు.

దీంతో సర్కార్ ఆహా ఓటీటీలోని టాప్ షోలలో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఇప్పుడీ ఏడో ఎపిసోడ్ శుక్రవారం (మే 31) రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కు గం గం గణేశా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆనంద్ దేవరకొండ, ప్రగతి వచ్చారు. ఈ మూవీ కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా సోమవారం (మే 27) జరిగింది. ఈ షోకి స్పెషల్ గెస్టుగా రష్మిక మందన్నా వచ్చింది. ఆ షోలో రష్మికను తన ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని ఆనంద్ అడగ్గా.. ఆమె రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని సిగ్గు పడుతూ చెప్పడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2024