Sudigali Sudheer: బుల్లితెరపైకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ - కొత్త షోకు గ్రీన్‌సిగ్నల్ - టైటిల్ ఇదే!
Sudigali Sudheer: ఈటీవీలోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ పేరుతో కొత్త షోను అంగీకరించాడు.
ఓ టీవీ షోను అంగీకరించాడు. ఈ షోకు ఫ్యామిలీ స్టార్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈటీవీలో ఈ కామెడీ షో టెలికాస్ట్ కానుంది. ఈ వారంలోనే ఫ్యామిలీ స్టార్స్ షో టెలికాస్ట్ డేట్‌ను రివీల్ చేయబోతున్నారు.
లియో స్కిట్ ద్వారా...
ఈ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఈటీవీ వర్గాలు ప్రోమో ద్వారా రివీల్ చేశాయి. దళపతి విజయ్ లియో మూవీ స్ఫూఫ్ స్కిట్‌తో సుధీర్ హోస్ట్ అన్నది వెల్లడించడం ఆకట్టుకుంటోంది.
ఆటచూస్తావా అంటూ ఈ ప్రోమోలో సుధీర్... మహేష్‌బాబు డైలాగ్ చెప్పడం హైలైట్‌గా ఉంది. ది ఎంటర్‌టైనర్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ ప్రోమోలో సుధీర్‌ను ఉద్దేశించి క్యాప్షన్ కనిపిస్తోంది. సినిమా, బుల్లితెర నటులు తమ ఫ్యామిలీతో కలిసి ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఆటపాటలతో అభిమానులకు నవ్వులను పంచబోతున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్థ్‌కు దూరం...
సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో గత ఏడాది జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పాడు సుధీర్. 2013లో జబర్ధస్థ్‌లో కంటెస్టెంట్‌గా జర్నీని మొదలుపెట్టిన సుధీర్...2023తో ఈ షోతో అనుబంధాన్ని ముగించారు. జబర్ధస్థ్‌కు అతడు గుడ్‌బై చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. జబర్థస్థ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఢీ, పోవేపోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్‌గా పనిచేశాడు. ఇవన్నీ అతడికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. సుధీర్ కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ షోలే కారణమయ్యాయి.
సినిమాలపైనే ఫోకస్...
గత ఏడాది నుంచి టీవీషోలకు పూర్తిగా దూరమవుతూ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు సుడిగాలి సుధీర్. అయితే సినిమాల్లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో టీవీల్లోకి అతడు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోట్ అనే ఒకే ఒక సినిమా చేస్తున్నాడు సుధీర్. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు.ఈ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
దీనితో పాటు హీరోగా మరో తెలుగు మూవీకి డిస్కషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు తప్ప కొత్త సినిమాలేవి సుధీర్ అంగీకరించలేదు. కేవలం హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. కమెడియన్ రోల్స్‌కు దూరమయ్యాడు. సినిమాల విషయంలో తాను ఒకటి ప్లాన్ చేస్తే...రిజల్ట్ మరోలా వచ్చిందని...అందుకే ఫ్యామిలీ స్టార్‌తో అతడు టీవీల్లోకి హోస్ట్‌గా రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్సైనట్లు చెబుతోన్నారు. ఇక నుంచి టీవీలపై ఫోకస్ పెడుతూనే సినిమాలు చేయాలని సుధీర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హీరోగా...
హీరోగా సుధీర్ ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడుతో పాటు కాలింగ్ సహస్ర సినిమాలు చేశాడు. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాలు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి.
ఆహా ఓటీటీ...
ప్రస్తుతం ఆహా ఓటీటీలో రెండు షోలకు సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌తో పాటు సర్కార్ 4కు సుధీర్ హోస్ట్‌గా కొనసాగుతోన్నాడు.
టాపిక్