Rashmika Anand: నీయబ్బ.. ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. అంటున్న రష్మిక.. వదిన ఫేవరెట్ కోస్టార్ ఎవరో తెలుసా?
Rashmika Anand: రష్మిక మందన్నా, ఆనంద్ దేవరకొండ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ రష్మిక అనడం విశేషం.
Rashmika Anand: ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. గం గం గణేశా ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ తో రష్మిక పెళ్లి ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటో మీరే చూడండి.
రష్మిక ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే?
గం గం గణేశా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (మే 27) జరిగింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీ ఈవెంట్ కు రష్మిక కూడా వచ్చింది. ఈ ఈవెంట్లో ఆనంద్ కాసేపు యాంకర్ అవతారమెత్తాడు. తన కాబోయే వదినను కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. "ఈ దేశంలో వచ్చిన కొన్ని అత్యుత్తమ సినిమాల్లో నువ్వు కూడా ఓ భాగమయ్యావు కదా. మరి నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు" అని ఆనంద్ అన్నాడు.
ఆ ప్రశ్న వినగానే వెనుక ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. రష్మిక కూడా తన ముందున్న మైక్ ను కాస్త పక్కకు పెడుతూ నీయబ్బ అని ఆనంద్ ను తిట్టింది. రష్మికను భలే స్పాట్ లో పెట్టావు కదా అని స్టేజ్ మీద ఉన్న యాంకర్ అనడం వినొచ్చు. తర్వాత రష్మిక మాట్లాడుతూ.. "ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ లో పెట్టొచ్చా" అని నవ్వుతూ అడిగింది.
ఆలోపే వెనుక నుంచి ఫ్యాన్స్ రౌడీ.. రౌడీ.. అంటూ అరవడం మొదలు పెట్టారు. అవును.. రౌడీ బాయ్.. విజయ్ అని రష్మిక సిగ్గుపడుతూ చెప్పింది. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. రౌడీ కాకపోయినా.. చిన్న రౌడీ అని చెప్పొచ్చు అని అన్నాడు. సరే చిన్న రౌడీయే అని రష్మిక అన్నది. దీంతో హాలంతా అరుపులతో మార్మోగిపోయింది. వీళ్ల ఫన్నీ చాట్ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఆనంద్, రష్మిక కలిసి మూవీలోని పాటపై స్టెప్పులు కూడా వేశారు.
విజయ్, రష్మిక లవ్ స్టోరీ
విజయ్, రష్మిక లవ్ స్టోరీ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని అఫీషియల్ గా బయటపెట్టకపోయినా.. తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా చాలాసార్లే హింట్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, పండగలు జరుపుకోవడంతో ఫ్యాన్స్ వీళ్ల మధ్య ప్రేమ గట్టిగానే ఉందని ఫిక్సయ్యారు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ ను పట్టుకొని పబ్లిగ్గా నువ్వు నా ఫ్యామిలీ రా అని అనడంతో రష్మిక తమ బంధాన్ని చెప్పేసినట్లే అని స్పష్టమవుతోంది.
మరోవైపు ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ తర్వాత ఇప్పుడు గం గం గణేశా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం (మే 31) రిలీజ్ కానుంది. ఈ మూవీలో అతడో దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఓ గణేషుడి విగ్రహం చోరీ చుట్టు తిరిగే కథలా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ మూవీ ద్వారా అతడు హిట్ అందుకుంటాడేమో చూడాలి.