Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-sarkaar 4 on aha ott baby actress vaishnavi chaitanya in sudigali sudheer game show sarkaar game show streaming date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaar 4 Ott: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 21, 2024 04:05 PM IST

Sarkaar 4 OTT Game Show: సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ 4 గేమ్ షోలో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య సందడి చేశారు. లవ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ గేమ్‍షోలో ఆమె పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.

OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో
OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో

Sarkaar 4 OTT Game Show: యాంకర్, యాక్టర్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 4 గేమ్ షో ఆహా ఓటీటీలో మంచి సక్సెస్ అవుతోంది. ఆహాలో ఇటీవలి కాలం అత్యధిక వ్యూస్ దక్కించుకుంటున్న షోగా నిలుస్తోంది. టాప్‍లోనూ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్‍లో ఐదు ఎపిసోడ్లు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక, సర్కార్ సీజన్ 4 ఆరో ఎపిసోడ్‍లో బేబీ ఫేమ్, యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య పాల్గొంటున్నారు.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

లవ్‍మీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీమ్ సర్కార్ 4 ఎపిసోడ్‍కు వచ్చింది. లవ్‍మీలో హీరోగా నటించిన ఆశిష్ రెడ్డి, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు మరో హీరోయిన్ సిమ్రన్ చౌదరి, నటుడు రవికృష్ణ కూడా ఈ గేమ్ ఆడారు. ఈ ఎపిసోడ్ ఈ శుక్రవారం మే 24న రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది.

ప్రోమో ఇలా..

సర్కార్ 4 ఎపిసోడ్ 6 ప్రోమోను ఆహా తీసుకొచ్చింది. ఇది ఎంటర్‌టైనింగ్‍గా సాగింది. లవ్ మీ మూవీలోని దివ్యావతి దెయ్యం పేరుతో సుధీర్, హీరో ఆశిష్ మధ్య పంచ్‍లు హిలేరియస్‍గా ఉన్నాయి. ఆ తర్వాత వైష్ణవి చైతన్య, సిమ్రన్ చౌదరితో స్టెప్స్ వేశారు సుధీర్. వారితో లవ్ మీ అని చెప్పించుకొని తన మార్క్ కామెడీ పండించారు సుడిగాలి.

హోస్ట్ సుధీర్, రవికృష్ణ మధ్య చాలా ఫన్ జనరేట్ అయింది. ఇద్దరి మధ్య మాటలు ఎంటర్‌టైనింగ్‍గా సాగాయి. ఆషిశ్, వైష్ణవి పగలబడి నవ్వారు. పుష్కరానికి ఎన్ని సంవత్సరాలు అంటే.. ఐదు.. పది.. పన్నెండు అంటూ తడబడ్డారు వైష్ణవి చైతన్య. దీంతో తనకు బేబి సినిమా చూసినట్టు అనిపించిందని పంచ్ వేశారు సుధీర్. ఆ తర్వాత అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇలా ఈ ప్రోమో ఫుల్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. ఈ ఫుల్ ఎపిసోడ్ మే 24న రాత్రి 8 గంటలకు ఆహాలో అడుగుపెడుతుంది.

సర్కార్ 4 గేమ్ షో గత వారం సీజన్‍కు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వచ్చారు. ఈ ఎపిసోడ్‍లో సుధీర్, కాజల్ మధ్య మాటలు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యాయి. ఓ ఎపిసోడ్ కూడా ఆహాలో ట్రెండ్ అవుతోంది. సత్యభామ మూవీ ప్రమోషన్ల కోసం ఐదో ఎపిసోడ్‍లో కాజల్‍తో పాటు నవీన్ చంద్ర, డైరెక్టర్ శశికిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కూడా ఆట ఆడారు. సర్కార్ సీజన్ 4లో ఆహాలో ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్ వస్తోంది.

లవ్‍మీ సినిమా గురించి..

లవ్‍మీ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామా మూవీగా వస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించారు. దివ్యావతి అనే దెయ్యాన్ని ప్రేమించేందుకు అర్జున్ (ఆశిష్) ప్రయత్నించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. దెయ్యాన్ని లవ్ చేయడం అనే డిఫరెంట్ స్టోరీలైన్‍‍తో వస్తోంది.

లవ్‍మీ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి, స్టార్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ మూవీకి పనిచేశారు. ఈ మూవీని దిల్‍రాజు ప్రొడక్షన్ హౌస్ పతాకంపై హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. లవ్‍మీ సినిమా ఈవారంలోనే మే 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై ఇంట్రెస్ట్ పెంచింది.

టీ20 వరల్డ్ కప్ 2024