Getup Srinu Raju Yadav: సోలో హీరోగా గెటప్ శ్రీను ఎంట్రీ - రాజు యాదవ్ ఓటీటీలో కాదు థియేటర్లలోనే రిలీజ్
Getup Srinu Raju Yadav: జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సోలో హీరోగా నటిస్తోన్న రాజు యాదవ్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టారు. థియేటర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.
Getup Srinu Raju Yadav: జబర్ధస్త్ కామెడీతో షో కెరీర్‌ను ప్రారంభించి నటులుగా సక్సెస్ అయిన వారిలో గెటప్ శ్రీను ఒకడు. కమెడియన్‌లో తెలుగులో పలు సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో హీరో స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు గెటప్ శ్రీను.
సోలో హీరోగా...
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సోలో హీరోగా గెటప్ శ్రీను ఓ మూవీ చేస్తోన్నాడు. రాజు యాదవ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్‌చేశారు. మే 17న రాజు యాదవ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్‌చేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు పెళ్లిపీటలపై కూర్చొని కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఓటీటీ కాదు థియేటర్‌లోనే...
గెటప్ శ్రీనుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని రాజు యాదవ్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రాజు యాదవ్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. థియేటర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఆ పుకార్లకు మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టారు.
సూడో రియలిజం...
సూడో రియలిజం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాజు యాదవ్ మూవీ తెరకెక్కుతోంది. ఏం జరిగినా.. లైఫ్ లాంగ్ స్మైల్ ఫేస్ తో గడపాల్సి వస్తే ఎలా వుంటుంది అనే పాయింట్ చుట్టూ ఈ కథ సాగుతుంది. గెటప్ శ్రీను నుంచి ఆశించే ఫన్‌తో పాటు ఎమోషన్స్, లవ్ , యాక్షన్ అంశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. సోలో హీరోగా గెటప్ శ్రీనుకు ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెడుతుందని, అతడిలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఉంటుందని అంటున్నారు
బ్రహ్మానందం వాయిస్ ఓవర్...
ఇటీవల రాజు యాదవ్ టీజర్ రిలీజైంది. ఈ టీజర్‌కు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజు యాదవ్ మూవీలో గెటప్ శ్రీనుకు జోడీగా అంకిత ఖరత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్ష వర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అతడి బీజీఎమ్ రాజుయాదవ్ మూవీకి హైలైట్‌గా నిలవబోతున్నట్లు చెబుతోన్నారు.
ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఈ చిత్రంలో రెండూ పాటలు రాశారు. రాహుల్ సింప్లీగంజ్ ఓ పాట పాడటం మరో ప్రధాన ఆకర్షణ. మరో రెండు పాటలకు కాసర్ల శ్యాం సాహిత్యం అందించినట్లు సినిమా యూనిట్ తెలిపింది.
చిరంజీవితో రెండు సినిమాలు...
గత ఏడాది రిలీజైన హారర్ మూవీ పొలిమేర 2లో గెటప్ శ్రీను ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్, వాల్తేర్ వీరయ్యల్లో కమెడియన్‌గా కనిపించాడు. అహ నా పెళ్లంట, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మాయబజార్ ఫర్ సేల్ వెబ్‌సిరీస్‌లలో హాస్య ప్రధాన పాత్రలు పాత్రలు చేశాడు. ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు గెటప్ శ్రీను.