తెలుగు న్యూస్  /  Entertainment  /  Du Du Song Released From Ravi Teja Dhamaka Movie

Du Du Lyrical Song Release: ధమాకా చిత్రం నుంచి డూ డూ సాంగ్ రిలీజ్.. మాస్ మాహారాజ అదిరే స్టెప్పులు

25 November 2022, 19:17 IST

    • Du Du Lyrical Song Release: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఆయన నటించిన ఈ సినిమా నుంచి డూ డూ అనే పాట విడుదలైంది. ఈ సాంగ్‌లో తన స్టెప్పులతో అదరగొట్టాడు.
ధమాకా చిత్రం నుంచి డూ డూ సాంగ్ రిలీజ్
ధమాకా చిత్రం నుంచి డూ డూ సాంగ్ రిలీజ్

ధమాకా చిత్రం నుంచి డూ డూ సాంగ్ రిలీజ్

Du Du Lyrical Song Release: మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాల్లో కనిపించిన ఈ స్టార్.. ప్రస్తుత ధమకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరించగా.. తాజాగా మరోసారి ఈ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప భర్త గురించి తెలుసుకున్న పారిజాతం.. నరసింహ చేసిన పనికి రగిలిపోయిన అనసూయ

NNS May 3rd Episode: అమరేంద్ర, అరుంధతి కథ సమాప్తం- ఉలిక్కిపడిన రామ్మూర్తి- మిస్సమ్మ జీవితంలో కొత్త అధ్యాయం- మనుకు ఏడుపు

Guardian OTT: ఓటీటీలోకి హ‌న్సిక హార‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

డూ డూ అంటే సాంగ్ ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ పాటలో రవితేజ తన స్టైలిష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. మైండ్ బ్లోయింగ్ స్టెప్పులతో అలరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ఈ పాటకు నృత్యాలు సమకూర్చారు. తన ఎనర్జీకి తగినట్లుగా ఉన్న ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యాన్ని అందించగా.. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. పృథ్వీ చంద్ర పాటను ఆలపించారు.

రవితేజ ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే రీతలో ఉన్న ఈ సాంగ్ ఉర్రూత లూగిస్తోంది. మాస్ మహారాజా ఎనర్జీకి ఈ పాటకు అదనపు ఆకర్షణగా మారింది. రామజోగయ్య శాస్త్రీ రాసిన సాహిత్యంలో రవితేజ పవర్‌ఫుల్ పాత్రను తెలియజేయడమే కాకుండా మంచి ఎలివేషన్ ఇస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.