తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathan First Single Update: బికినీలో దీపికా ప‌డుకోణ్ - వైర‌ల్‌గా మారిన ప‌ఠాన్ పోస్ట‌ర్‌

Pathan First Single Update: బికినీలో దీపికా ప‌డుకోణ్ - వైర‌ల్‌గా మారిన ప‌ఠాన్ పోస్ట‌ర్‌

10 December 2022, 20:16 IST

  • Pathan First Single Update: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీపికా ప‌డుకోణ్ బికినీ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్

దీపికా ప‌డుకోణ్

Pathan First Single Update: దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత ప‌ఠాన్ సినిమాతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు షారుఖ్‌ఖాన్‌ (Shahrukh Khan). సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా జ‌న‌వ‌రి 26న రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ బేష‌ర‌మ్ రంగ్ పాట‌ను డిసెంబ‌ర్ 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ అప్‌డేట్‌తో పాటు దీపికా ప‌డుకోణ్ (Deepika Padukone) గ్లామ‌ర్ ఫొటోను రిలీజ్ చేసింది. ఇందులో ఎల్లో క‌ల‌ర్ బికినీ ధ‌రించి దీపికా ప‌డుకోణ్ క‌నిపిస్తోంది. ఈ గ్లామ‌ర‌స్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాను య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

బాలీవుడ్ అగ్ర హీరోలు స‌ల్మాన్‌ఖాన్‌, హృతిక్ రోష‌న్ ప‌ఠాన్ సినిమాలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఐమాక్స్ వెర్ష‌న్‌లో ప‌ఠాన్‌ విడుద‌ల‌కానుంది.

2018లో జీరో సినిమాతో చివ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు షారుఖ్‌ఖాన్‌. ఈ సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో కెరీర్‌కు నాలుగేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ప‌ఠాన్‌తో పాటు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ సినిమా చేస్తున్నాడు షారుఖ్‌ఖాన్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే రాజ్‌కుమార్ హిరాణీతో డుంకీ సినిమా అంగీక‌రించాడు షారుఖ్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.