తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone In Singam 3: లేడీ సింగం పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ - సింగం -3 క‌న్ఫార్మ్ చేసిన రోహిత్ శెట్టి

Deepika Padukone in Singam 3: లేడీ సింగం పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ - సింగం -3 క‌న్ఫార్మ్ చేసిన రోహిత్ శెట్టి

08 December 2022, 14:09 IST

  • Deepika Padukone in Singam 3: ఖాకీ డ్రెస్ ప‌వ‌ర్‌ను చాటేందుకు దీపికా ప‌డుకోణ్ రెడీ అవుతోంది. లేడీ సింగంగా అవ‌తార‌మెత్తుతోంది. ఆమె పోలీస్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమా ఏదంటే...

దీపికా ప‌డుకోణ్‌, రోహిత్ శెట్టి
దీపికా ప‌డుకోణ్‌, రోహిత్ శెట్టి

దీపికా ప‌డుకోణ్‌, రోహిత్ శెట్టి

Deepika Padukone in Singam 3: బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి (Rohit shetty) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సింగం, సింగం -2 సినిమాలో క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజ్‌లో మూడో భాగం రాబోతున్న‌ది. సింగం -3 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ లేడీ పోలీస్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

స‌ర్క‌స్ సినిమాలోని క‌రెంట్ ల‌గా రే అనే పాట‌ను గురువారం ముంబాయిలో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు దీపికా ప‌డుకోణ్ హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా సింగం -3 గురించి రోహిత్ శెట్టి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

సింగం -3లో దీపికా ప‌డుకోణ్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. పోలీస్ పాత్ర‌లో ఆమె క‌నిపిస్తుంద‌ని చెప్పాడు. సింగం సిరీస్‌లో లేడీ పోలీస్ ఎవ‌ర‌ని చాలా రోజులుగా అంద‌రూ న‌న్ను అడుగుతూనే ఉన్నారు. వారంద‌రికి నేడు స‌మాధానం దొరికింది అంటూ ఈ ఇవెంట్‌లో రోహిత్ శెట్టి వ్యాఖ్యానించాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు రోహిత్ శెట్టి చెప్పాడు.

సింగం, సింగం -2 సినిమాలో హీరో ప్ర‌ధానంగా సాగ‌గా సింగం -3 మాత్రం హీరోయిన్ క్యారెక్ట‌ర్ బేస్‌డ్‌గా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో దీపికా ప‌డుకోణ్ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

కాగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌ర్క‌స్ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ర‌ణ్‌వీర్‌సింగ్(Ranveer Singh) డ్యూయ‌ల్‌రోల్‌లో న‌టిస్తున్నాడు. క‌రెంట్ ల‌గా రే అనే పాట‌లో భ‌ర్త ర‌ణ్‌వీర్‌సింగ్‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది దీపికా ప‌డుకోణ్‌. స‌ర్క‌స్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.